Post Office: నెలకు 15 వందలతో 35 లక్షలు ఆర్జించే పోస్టాఫీసు పథకమిదే

Post Office: పెట్టుబడి పెట్టాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ రిస్క్ ఎదుర్కోలేరు. అటువంటివారి కోసం పోస్టాఫీసులో కొన్ని పథకాలు మంచి ప్రత్యామ్నాయాలుగా ఉన్నాయి. రిస్క్ తక్కువగా ఉండి..ఎక్కువ లాభాలిస్తాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 27, 2022, 12:20 AM IST
Post Office: నెలకు 15 వందలతో 35 లక్షలు ఆర్జించే పోస్టాఫీసు పథకమిదే

ఇటీవలి కాలంలో పోస్టాఫీసు పథకాలకు ఆదరణ పెరిగింది. కారణం ఇందులో రిస్క్ తక్కువ..లాభాలు ఎక్కువ. స్వల్ప పెట్టుబడితో లక్షల రూపాయలు సంపాదించే మార్గాలున్నాయి. ఆ వివరాలు మీ కోసం..

జీరో రిస్క్..బంపర్ రిటర్న్స్. ప్రస్తుతం పోస్టాఫీసు పథకాల విషయంలో విన్పిస్తున్న మాట. మీరు కూడా పోస్టాఫీసులో ఎక్కౌంట్ ఓపెన్ చేసే ఆలోచనలో ఉంటే..మంచి మంచి పథకాలున్నాయి. పోస్టాఫీసులో పెట్టుబడులు పెట్టేందుకు మంచి ఆప్షన్ ఇది. ఇందులో మీ డబ్బుకు పూర్తిగా గ్యారంటీ ఉంటుంది. పోస్టాఫీసు గ్రామ్ సురక్షా యోజన పథకమిది. ఈ పథకంలో లాభాలు అనేకం. పోస్టాఫీసు గ్రామ్ సురక్షా యోజన అనేది ఓ రకమైన భీమా పధకం. ఇందులో మీరు నెలకు కేవలం 15 వందల రూపాయలు పెట్టుబడి పెడితే చాలు..మెచ్యూరిటీ అనంతరం 35 లక్షల రూపాయలు లభిస్తాయి.

ఎవరు అర్హులు, ప్రీమియం ఎంత

ఈ పథకాన్ని ప్రారంభించేందుకు కావల్సిన అర్హత 19 ఏళ్ల నుంచి 55 ఏళ్లు. ఇందులో కనీస భీమా మొత్తం 10 వేల రూపాయలు కాగా..గరిష్టంగా 10 లక్షల రూపాయలుంది. ఈ పధకంలో ప్రీమియం మొత్తాన్ని నెలవారీ, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాదికి చెల్లించవచ్చు. ప్రీమియం చెల్లింపు కోసం 30 రోజుల వ్యవధి కూడా ఉంటుంది. దాంతోపాటు మీకు రుణ సౌకర్యం కూడా ఉంటుంది. అయితే పాలసీ తీసుకున్న 4 ఏళ్ల తరువాతే రుణం కోసం అప్లై చేసే అవకాశముంటుంది. 

ఈ పథకాన్ని మీరు 19 ఏళ్లలో ప్రారంభించి..పది లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే..55 ఏళ్ల కోసం నెలకు ప్రీమియం 1515 రూపాయలు కాగా 58 ఏళ్లకైతే 1463 రూపాయలు, 60 ఏళ్లకైతే 1411 రూపాయలుంటుంది. 

మెచ్యూరిటీ మొత్తం ఎంత

55 ఏళ్ల పథకంలో మెచ్యూరిటీ అనంతరం 31.60 లక్షల రూపాయలు లభిస్తాయి. 58 ఏళ్లకైతే 33.40 లక్షల రూపాయలు వస్తాయి. అదే 60 ఏళ్లకైతే 34.60 లక్షల రూపాయలు మెచ్యూరిటీ ఫండ్ లభిస్తుంది. ఈ స్కీమ్ ప్రత్యేకత ఏంటంటే ఈ పాలసీని మధ్యలో సరెండర్ కూడా చేయవచ్చు. అంటే ఉపసంహరించుకోవచ్చు. 

Also read: EPF Account Update: పీఎఫ్ ఎక్కౌంట్ ఎలా బదిలీ చేయాలో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News