Car Loan Offers 2024: కారు కొనాలనుకునేవారికి బంపర్‌ ఆఫర్.. అక్షయతృతీయ సందర్భంగా అతితక్కువ వడ్డీకే రుణ సదుపాయం

Car Loan Offers 2024: కారు కొనుగోలు చేయాలని ఎన్నో ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నవారు ఉంటారు. కొందరి కారు కొనుగోలు చేయాలనే కోరిక ఉంటుంది. కానీ, ఆర్థిక పరిస్థుల వల్ల వెనకడును వేస్తారు. అలాంటి వారికి అక్షయ తృతీయ సందర్భంగా బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.

Written by - Renuka Godugu | Last Updated : May 7, 2024, 03:03 PM IST
Car Loan Offers 2024: కారు కొనాలనుకునేవారికి బంపర్‌ ఆఫర్.. అక్షయతృతీయ సందర్భంగా అతితక్కువ వడ్డీకే రుణ సదుపాయం

Car Loan Offers 2024: కారు కొనుగోలు చేయాలని ఎన్నో ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నవారు ఉంటారు. కొందరి కారు కొనుగోలు చేయాలనే కోరిక ఉంటుంది. కానీ, ఆర్థిక పరిస్థుల వల్ల వెనకడును వేస్తారు. అలాంటి వారికి అక్షయ తృతీయ సందర్భంగా బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. అతి తక్కువ ధరలోనే కారు లోను పొందే అద్భుత అవకాశం కల్పిస్తున్నాయి.ఈనెల 10వ తారీఖు శుక్రవారం రోజు అక్షయ తృతీయ జరుపుకోనున్నారు. ఇది హిందూ మతంలో అత్యంత పవిత్రమైన రోజు. ఈరోజు ముఖ్యంగా బంగారం, వెండి, ఇల్లు, కారు వంటివి కొనుగోలు చేస్తారు. ఎందుకంటే ఈరోజు ఏది కొన్నా డబుల్ లాభం పొందుతారు. అందుకే చాలామంది ఈరోజు ఎక్కువ ఆసక్తి చూపుతారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న బ్యాంకు అధికారులు కస్టమర్లను ఆకట్టుకోవడానికి అక్షయ తృతీయరోజు ఈ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించాయి. 

కారు కొనుగోలు చేసేవారు అందరూ డబ్బులు పెట్టికొనలేరు. రుణం తీసుకుని కొనుగోలు చేస్తారు. ఈ నేపథ్యంలో అతితక్కువ ధరకే అక్షయ తృతీయ రోజు కారు లోను సదుపాయాన్ని వివిధ ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. అంతేకాదు ప్రాసెసింగ్‌ ఫీజులో కూడా రాయితీ ఇవ్వనున్నాయి. ఈ బ్యాకులు రూ. 10 లక్షలలోపు ఉన్న కార్లకు 4 ఏళ్ల సమయంతో 8.70% నుంచి 9.10% మధ్య వడ్డీతో కారు కొనుగోలుకు రుణ సదుపాయాన్ని అందించనున్నారు. ఏ బ్యాంకులు ఎంత వడ్డీకి ఆఫర్‌ ఇస్తున్నాయో తెలుసుకుందాం.

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా..
మన దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌. 8.75 శాతంతో కారు లోన్‌ పొందవచ్చు. పంజాబ్ నేషనల్‌ బ్యాంక్‌,కెనరా బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌లు కూడా 8.75% నాలుగు ఏళ్ల వరకు రుణాన్ని అందించనున్నాయి. ఈఎంఐ రూ. 24,587 చెల్లించాలి.

యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా..
ఇది పబ్లిక్‌ సెక్టర్ బ్యాంక్‌. అక్షయ తృతీయ సందర్భంగా ఈ బ్యాంకులో కార్‌లోన్ కేవలం 8.70% వడ్డీకే రుణాన్ని అందించనున్నాయి. ఈ రుణం కేవలం 10 లక్షలలోపు ఉన్న కార్లకు మాత్రమే వర్తిస్తాయి. అది కూడా నాలుగు ఏళ్లకు అందిస్తుంది. నెలనెలా ఈఎంఐ రూ. 24,565 చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్‌ ఆఫ్ ఇండియా విషయానికి వస్తే 8.85% శాతాన్ని కారు లోను పొందవచ్చు. నెలవారీ ఈఎంఐ రూ. 24,632 చెల్లించాల్సి ఉంటుంది.

ఐసీఐసీఐ బ్యాంక్..
అక్షయ తృతీయ సందర్భంగా కారు కొనాలనుకునే వారికి ఐసీఐసీఐ బ్యాంక్ బంపర్‌ ఆఫర్ ప్రకటించింది. కేవలం 9.10% వడ్డీకే కార్‌లోన్‌ అందించనుంది. ఇది కూడా పది లక్షలలోపు ఉన్న కార్లకు నాలుగు ఏళ్ల వ్యవధితో రుణ సదుపాయాన్ని కల్పించనుంది. ఇక నెలవారీ ఈఎంఐ రూ.24,745 నుంచి చెల్లించాల్సి ఉంటుంది.

బ్యాంక్‌ ఆఫ్ బరోడా..
అక్షయ తృతీయ సందర్భంగా బ్యాంక్‌ ఆఫ్ బరోడా 8.90% వడ్డీ కొత్త కారు కొనుగోలుకు రుణాన్ని అందిస్తున్నాయి. 10 లక్షలలోపు నాలుగేళ్లకు గాను ఈ రుణాన్ని అందిస్తుంది.  ఈ బ్యాంకులో రూ. 24,655 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: నెలకు 50 వేల పెట్టుబడితే ఏకంగా 5 కోట్ల సంపాదన

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్..
కొత్త కారు కొనాలనుకునేవారికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కేవలం 9.10% వడ్డీకే రుణాన్ని అందించనుంది. ఇది కూడా పది లక్షల లోపు ఉన్న కార్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈఎంఐ రూ. 24,745 చెల్లించాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: 6 వేల స్మార్ట్‌వాచ్ కేవలం 999 రూపాయలకేనా, ఎలాగంటే

యాక్సిస్‌ బ్యాంక్‌..
యాక్సిస్‌ బ్యాంక్‌ కూడా అక్షయ తృతీయ సందర్భంగా అతి తక్కువ ధరకే కార్‌లోన్‌ ఇవ్వనుంది. పది లక్షలలోపు ఉన్న కార్లకు నాలుగు ఏళ్ల వ్యవధితో కేవలం 9.30% వడ్డీకే రుణాన్ని అందించనుంది. నెలవారీ ఈఎంఐ రూ. 24,835 చెల్లించాల్సి ఉంటుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News