Google: కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగులు ఇంటి దగ్గర నుంచే పనిచేస్తున్నారు. దానికే అలవాటుపడిపోయారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ పుంజుకుంటున్న తరుణంలో ఆఫీస్ గేట్లు తెరవాలని సంస్థలు భావిస్తున్నాయి. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
ఈ నేపథ్యంలో..ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగుల వేతనంలో కంపెనీలు కొంత మొత్తం కట్ చేసే అవకాశం ఉందా? అంటే అవును, అనే సమాధానం వినిపిస్తుంది. ఈ మహమ్మారికి ముందు కార్యాలయంలో పనిచేస్తున్న గూగుల్ ఉద్యోగులు(Google Employees) శాశ్వతంగా ఇంటి నుంచి పనిచేయడానికి మెగ్గుచూపితే వేతనంలో కోతలు విధించే అవకాశం ఉన్నట్లు రాయిటర్స్ తెలిపింది. ఇప్పుడు ఈ విషయం గురుంచి సిలికాన్ వ్యాలీ(Silicon Valley) అంతటా విపరీతమైన చర్చ నడుస్తోంది.
Also Read: ఆ దేశంలో ఉన్న ఇండియన్స్ వెంటనే తిరిగి రాకపోతే ప్రమాదమే
ఇప్పటికే ఫేస్‌బుక్(Facebook), ట్విట్టర్(Twitter) వంటి సంస్థలు తక్కువ ఖరీదైన ప్రాంతాలకు వెళ్ళే రిమోట్ ఉద్యోగులకు వేతనాన్ని తగ్గించాయి. గూగుల్(Google).. ఉద్యోగులు ఉంటున్న లొకేషన్ ఆధారంగా జీతాలు నిర్ణయిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే, సంస్థ వారి ఉద్యోగుల లొకేషన్(location) ఎప్పటికప్పుడు ట్రాక్ చేసే అవకాశం ఉంది. "ఉద్యోగులకు చెల్లిస్తున్న ప్యాకేజీలు ఎల్లప్పుడూ స్థానం ఆధారంగా నిర్ణయించబడ్డాయి. ఒక ఉద్యోగి ఎక్కడ నుంచి పనిచేస్తాడో దాని ఆధారంగా మేము ఎల్లప్పుడూ స్థానిక మార్కెట్లో ఉన్న వారికంటే ఎక్కువ మొత్తం చెల్లిస్తున్నట్లు" గూగుల్ ప్రతినిధి తెలిపారు.
వేతనం అనేది నగరం నుంచి నగరానికి, రాష్ట్రానికి భిన్నంగా ఉంటుంది. జూన్ లో ప్రారంభించిన కంపెనీ వర్క్ లొకేషన్ టూల్(location tool) అంచనాల ప్రకారం.. ఇంటి నుంచి పనిచేసే వారి వేతనంలో సుమారు 10 నుంచి 20 శాతం కోత విధించనున్నట్లు తెలుస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook