Nita Ambani's Make-up Man Salary: నీతా అంబాని మేకప్ మేన్ జీతం ఎంతో తెలుసా ?

Nita Ambani make-up artist salary: ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ఈ వయస్సులో కూడా ఎంత చురుకుగా వ్యవహరిస్తారో.. అంతే అందంగానూ కనిపిస్తారు. ఫ్యామిలీ ఫంక్షన్స్, బిజినెస్ ప్రోగ్రామ్స్ కి నీతా అంబానీ చాలా చక్కగా రెడీ అవుతారు. అయితే, అందంగా కనిపించే నీతా అంబానినే అందరికీ తెలుసు కానీ ఆమె అందం వెనుక ఉన్నది ఎవరో మాత్రం చాలా మందికి తెలియదు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 8, 2023, 10:31 PM IST
Nita Ambani's Make-up Man Salary: నీతా అంబాని మేకప్ మేన్ జీతం ఎంతో తెలుసా ?

Nita Ambani make-up artist salary: ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. భారత్ లో అత్యంత స్టైలిష్ బిజినెస్ ఉమెన్ లో నీతా అంబాని కూడా ఒకరు. భర్త ముఖేష్ అంబానితో కలిసి పలు వ్యాపార వ్యవహారాలను చూసుకుంటూనే ఆయనకు భార్యగా, ముగ్గురు పిల్లలకు తల్లిగా కుటుంబం బాధ్యతలు కూడా అంతే చక్కగా నెరవేర్చుతున్నారు. అంతేకాకుండా ఐపిఎల్ జట్లలో ముఖ్యమైన జట్టుగా పేరున్న ముంబై ఇండియన్స్ టీమ్‌ బాధ్యతలు కూడా నీతా అంబానినే పర్యవేక్షిస్తోంది. ఇద్దరు కుమారులు, ఓ కూతురు, ఇద్దరు కోడళ్లు.. అందరినీ కలుపుకుని పోవడంలో ఆమె స్టైలే వేరు. 

Nita-Ambani-make-up-artist-salary.jpg

అన్నింటికి మించి ఈ వయస్సులో కూడా నీతా అంబానీ ఎంత చురుకుగా వ్యవహరిస్తారో.. అంతే అందంగానూ కనిపిస్తారు. ఫ్యామిలీ ఫంక్షన్స్, బిజినెస్ ప్రోగ్రామ్స్ కి నీతా అంబానీ చాలా చక్కగా రెడీ అవుతారు. అయితే, అందంగా కనిపించే నీతా అంబానినే అందరికీ తెలుసు కానీ ఆమె అందం వెనుక ఉన్నది ఎవరో మాత్రం చాలా మందికి తెలియదు. నీతా అంబానిని అందం వెనుక ఆమె మేకప్ ఆర్టిస్ట్ మిక్కీ కాంట్రాక్టర్ ఉన్నాడు. నీతా అంబానీతో పాటు ఆమె కూతురు ఇషా అంబానీ, కోడలు శ్లోకా అంబానీలకు అతడే మేకప్ ఆర్టిస్ట్.

Nita-Ambani-make-up-artist-salary.jpg

మిక్కీ కాంట్రాక్టర్ అంటే ఒక ఫేమస్ మేకప్ ఆర్టిస్ట్. మేకర్ ఆర్టిస్టుగా అతడు ఎంత పాపులర్ అనేది ఒక్క ముక్కలో చెప్పాలంటే... హమ్ అప్కే హై కౌన్, దిల్ తో పాగల్ హై, కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ గమ్, కల్ హో నా హో, మొహబత్తెయిన్, మై నేమ్ ఈజ్ ఖాన్, కార్తీక్ కాలింగ్ కార్తీక్, డాన్, వీర్ ది వెడ్డింగ్, గుడ్ న్యూస్, ఇంగ్లీష్ మీడియం వంటి చిత్రాలకు మిక్కీ కాంట్రాక్టర్ మేకప్ ఆర్టిస్టుగా పనిచేశాడు. మిక్కీ కాంటాక్టర్ క్లయింట్స్ జాబితాలో కరీనా కపూర్, దీపికా పదుకొనే, ఐశ్వర్య రాయ్, అనుష్క శర్మ వంటి స్టార్ హీరోయిన్స్ ఉన్నారు. అలాంటి మిక్కీ కాంట్రాక్టర్ నీతా అంబానికి పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్.

మిక్కీ కాంట్రాక్టర్ హైర్ చేసుకోవడం అంతీ ఈజీ వ్యవహారం కాదు. ఎందుకంటే ముంబైలోనే ఒక్కో వ్యక్తికి రోజుకు రూ.75,000 నుంచి రూ.లక్ష వరకు చార్జ్ చేస్తాడు. కెరీర్ మొదలుపెట్టిన కొత్తలో మిక్కీ కాంట్రాక్టర్ చాలా కష్టపడ్డాడు. టోక్యో బ్యూటీ పార్లర్‌లో హెయిర్ స్టైలిష్టుగా పని చేసేవాడు. అయితే అతడి పనితనం చూసిన హెలెన్.. అతడిని సినిమాల కోసం పనిచేయాల్సిందిగా సూచించారు. అప్పటి నుంచి మిక్కీ స్టార్ తిరిగిపోయింది. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు ఎన్నో కంపెనీల సీఈఓల కంటే మిక్కీ సంపాదించే నెల వారీ ఆదాయమే ఎక్కువ.

Trending News