Changes from April 1: మార్చ్ 31తో ఈ ఆర్ధిక సంవత్సరం ముగియనుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్తగా మార్పులు చేర్పులు ఉంటాయి. కొన్ని వస్తువుల ధరలు పెరగనుండటంతో ఆ ప్రభావం నేరుగా సామాన్యుడి బడ్జెట్‌పై పడనుంది. ఇటీవల సమర్పించిన కేంద్ర బడ్జెట్లో చాలా వస్తువులపై ట్యాక్స్ పెంచడంతో వాటి ధరలు పెరగబోతున్నాయి. ఇవన్నీ ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి రానున్నాయి.
ఏప్రిల్ 1 నుంచి ధరలు తగ్గనున్న వస్తువులు
ఏప్రిల్ 1 , 2023 నుంచి చాలా రకాల వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ 5 శాతం తగ్గించి 2.5 శాతం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఫలితంగా ఈ వస్తువుల ధరలు ఏప్రిల్ 1 నుంచి తగ్గనున్నాయి. ఈ వస్తువులలో మొబైల్ ఫోన్, కెమేరా, ఎల్ఈడీ టీవీ, బయోగ్యాస్ సంబంధిత వస్తువులు, ఎలక్ట్రిక్ కార్లు, ఆట వస్తువులు, హీట్ క్వాయిల్, డైమెండ్ జ్యువెల్లరీ,సైకిళ్లు ఉన్నాయి.
ధరలు పెరగనున్న వస్తువులు
ఏప్రిల్ 1 నుంచి ధరలు పెరగనున్న వస్తువుల్లో బంగారం, వెండి, బంగారం-వెండితో తయారైన వస్తువులు, ప్లాటినం, ఇంపోర్టెడ్ డోర్స్, కిచెన్ చిమ్నీలు, విదేశీ ఆట వస్తువులు, సిగరెట్, ఎక్స్‌రే మిషన్ ధరలు పెరగనున్నాయి. ఈ విషయం ఇప్పటికే అంటే ఫిబ్రవరి 1న సమర్పించిన కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు.
యూపీఐ లావాదేవీలు ప్రియం
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం యూపీఐ విధానంతో చెల్లించే వ్యాపార లావాదేవీలపై ఛార్జి విధించవచ్చు. ఆర్బీఐ ఆమోదిస్తే ఏప్రిల్ 1 నుంచి యూపీఐ బిజినెస్ లావాదేవీలపై ఛార్జ్ పడనుంది. అంటే 2000 రూపాయలు దాటిన లావాదేవీలపై 1.1 శాతం సర్ ఛార్జ్ వసూలు చేయవచ్చు.
ఎల్పీజీ సిలెండర్ ధర
ప్రతి నెలా మొదటి తేదీన ఎల్పీజీ సిలెండర్ ధరపై సమీక్ష ఉంటోంది. ఈసారి ఏప్రిల్ 1 న పెట్రోలియం కంపెనీలు ధర పెంచే అవకాశాలున్నాయి. గత నెల అంటే మార్చ్ 1వ తేదీన కంపెనీలు సిలెండర్ ధరను 50 రూపాయలు పెంచేశాయి. దాంతో ఢిల్లీలో సిలెండర్ ధర ఇప్పుడు 1103 రూపాయలుంది. ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగవచ్చు.
పెరగనున్న కార్ల ధరలు
కార్ల కొనుగోలుకు ఆలోచిస్తుంటే ఏప్రిల్ 1లోగా తీసుకోకపోతే ఆ తరువాత ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది. ఏప్రిల్ 1 నుంచి కార్ల ధరలు పెరగనున్నాయి. టాటా మోటార్స్, హీరో మోటో కార్ప్, మారుతి కంపెనీలు ధరలు పెరగనున్నాయని ప్రకటించాయి. కొత్త ధరలు ఏప్రిల్ 1 నుంచి పెరగనున్నాయి.
Also read: Fact Check: ఫోన్‌పే, గూగుల్ పే చెల్లింపులపై ఛార్జీలున్నాయా, అసలు నిజమేంటి, ఎన్పీసీఐ ఏమంటోంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook