Maruti Suzuki Alto: మారుతీ ఆల్టో...దేశంలో అత్యధికంగా అమ్ముడు పోతున్న కారు. ఇప్పటి వరకు 50లక్షల యూనిట్ల వరకు విక్రయం జరిగింది. ఇంతటి అద్భుత ఘనత సాధించిన ఏకైక మోడల్ కూడా మారుతే కావడం గమనార్హం. మరో విశేషం ఏంటంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మారుతీ ఆల్టోకు ఏమాత్రం డిమాండ్ తగ్గలేదు. టాప్ 10 కార్ల లిస్టులో ఈ కారు లేనప్పటికీ ప్రతినెలా 10వేలకు పైగా కస్టమర్లు ఈ కారును కొనుగోలు చేస్తున్నారు. ఇది కంపెనీ ఎంట్రీ లెవెల్ కారు కూడా. దేశంలోనే అత్యంత తక్కవు ధరకు లభిస్తున్న కారు కూడా ఇదే. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ. 3.99లక్షలు మాత్రమే.
ఇక ఆల్టో బడ్జెట్ ఫ్యామిలీ కారు. ఈ కారును మొదటిసారిగా 1979లో విదేశీ మార్కెట్లోకి లాంచ్ చేశారు. 1984లో సెకండ్ జనరేషన్ మోడల్, 1988లో థర్డ్ జనరేషన్ మోడల్, 1993లో నాలుగో జనరేషన్ మోడల్, 1998లో 5వ జనరేషన్ మోడల్ మార్కెట్లోకి విడుదలయ్యాయి. దీని 8వ జనరేషన్ ప్రస్తుతం విదేశీ మార్కెట్లో సేల్ అవుతోంది.
ఆల్టో కె10కారు కంపెనీ అప్ డేట్ ఫ్లాట్ ఫాం హెర్టెక్ ఆధారంగా డిజైన్ చేశారు. ఈ హ్యాచ్ బ్యాక్ కొత్త జెన్ కె సిరీస్ 1.0ఎల్ డ్యూయల్ జెట్, డ్యూయల్ వీవీటీ ఇంజిన్ కలిగి ఉంది. ఈ ఇంజిన్ 66. 62పీఎస్ పవర్, 5500ఆర్పీఎం, గరిష్ట టార్క్ 89ఎన్ఎం, 3500ఆర్పీఎం తో రిలీజ్ చేస్తుంది. దాటి ఆటోమెటిక్ వేరియంట్ 24.90KM/L మైలేజీని అందిస్తుంది. మాన్యువల్ వేరియంట్ 24.93 KM/1మైలేజీని ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. అయితే దాని సీఎన్జీ వేరియంట్ మైలేజ్ 33.85kmpl.
ఆల్టో K10 7-అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో వస్తుంది. ఇది ఇప్పటికే S-Presso, Celerio, Wagon-R లలో మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో పాటు USB, బ్లూటూత్, ఆక్స్ కేబుల్లకు సపోర్ట్ చేస్తుంది. అదనంగా, స్టీరింగ్ వీల్ కొత్త డిజైన్, స్టీరింగ్ మౌంటెడ్ ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంది.
సేఫ్టీ ఫీచర్లు: భద్రత పరంగా, ఈ హ్యాచ్‌బ్యాక్ ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), రివర్స్ పార్కింగ్ సెన్సార్ , యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)తో ప్రీ-టెన్షనర్, ఫోర్స్ లిమిట్ ఫ్రంట్ సీట్ బెల్ట్ ఇందులో ఉంది. ఇది కాకుండా స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, హై స్పీడ్ అలర్ట్ వంటి ఎన్నో సేఫ్టీ ఫీచర్లను ఈ కారులో ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.