Maruti New SUV: మారుతి సుజుకి నుంచి మరో 3 SUV కార్లు.. ధరలు తెలిస్తే షాక్‌ అవుతారు..

Maruti Suzuki New Car 2023: మార్కెట్‌లో ప్రస్తుతం కొత్త కొత్త ఫీచర్లకు సంబంధించిన కార్లు లభిస్తున్నాయి. అయితే మారుతి కంపెనీ నుంచి సరికొత్త  SUVలను విడుదల చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ కార్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 3, 2023, 11:28 AM IST
Maruti New SUV: మారుతి సుజుకి నుంచి మరో 3 SUV కార్లు.. ధరలు తెలిస్తే షాక్‌ అవుతారు..

Maruti New SUV: వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని మారుతి సుజుకి కొత్త కొత్త ఫీచర్లలతో మార్కెట్‌లోకి కార్లను లాంచ్‌ చేస్తుంది. అయితే 2023 కొత్త సంవత్సరం కారణంగా మారుతి కొన్ని SUVలను లాంచ్‌ చేయబోతున్నట్లు పేర్కొంది. జనవరిలో జరిగే ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో మూడు కొత్త SUVలను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఈ మూడు ఎస్‌యూవీల పేర్లకు సంభంచిన సమాచారం వివరించలేదు. అయితే మారుతి బాలెనో క్రాస్ అని పేరు పెట్టవచ్చని కొన్ని మీడియా కథనాలలో వైరల్‌ అవుతున్నాయి. అయితే ఈ కార్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మీకు తెలపబోతున్నాం.

ముఖ్యంగా ఈ SUVల ఇంజిన్ బూస్టర్‌జెట్ టర్బో పెట్రోల్‌తో వస్తున్నట్లు సమాచారం. ఇంతముందే ఇలాంటి చాలా ఇంజిన్స్‌ వచ్చినప్పటికీ అందులోనే కొన్ని మార్పులు చేర్పులు చేసి తీసుకువస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇందులో  BS6 అవతార్‌ సమార్థ్యం కూడా ఉంటుంది. మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ ఉంటుందని మార్కెట్‌లో టాక్‌. అంతేకాకుండా ఇది డీజిల్‌ వేరియంట్‌ కాకుండా పెట్రోల్ ఇంజిన్ వేరియంట్‌తో వచ్చే అవకాశాలున్నాయి. ఇది 1.2L డ్యూయల్‌జెట్ లేదా 1.5L డ్యూయల్‌జెట్ మైల్డ్ హైబ్రిడ్ టెక్ యూనిట్‌తో రాబోతుందని సమాచారం. ఈ మూడు SUVలు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో వచ్చే ఛాన్స్‌ ఉంది.

డిజైన్, కొత్త ఫీచర్లు:
ప్రస్తుతం మార్కెట్‌లలో లభిస్తున్న కార్ల కంటే దీని డిజైన్ కొంత కొత్తగా ఉండబోతోందని సమాచారం. ఇటీవలే లాంచ్‌ అయిన బాలెనో క్రాస్‌ లాంటి డిజైన్‌ల రాబోతున్నట్లు సమాచారం. ఇక కారు ల్యాంప్‌ విషయాల కొస్తే స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, స్లిమ్ LED DRLలతో అందుబాటులో ఉంటుంది. బానెట్ పైన సిగ్నేచర్ 'త్రీ-బ్లాక్' మోనికర్‌ కూడా అందుబాటులో ఉండనుంది. అంతేకాకుండా  SUV వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ కూడా కలిగి ఉంటుంది. ఎంజీ హెక్టార్‌ లాంటి వాయిస్ కమాండ్‌ను కూడా కలిగి ఉండబోతోందని సమాచారం. ముఖ్యంగా కనెక్ట్ ఫీచర్‌ను కలిగి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. డిజిటల్ కన్సోల్, ఆటో AC యూనిట్, యాక్సిడెంట్స్‌ నుంచి రక్షించేందుకు పెద్ద ఎయిర్‌బ్యాగ్‌ల ఫిచర్‌తో కూడా అందుబాటులో ఉండనుంది.

ప్రారంభం ధర:

కొత్త మారుతి YTB SUV లాంచింగ్‌కి సంబంధించిన సమాచారాన్ని ఇంకా అధికరింగా ప్రకటించలేదు. కారు ప్రొడక్షన్ వెర్షన్ ఏప్రిల్‌లో విడుదల కానుంది. . కొత్త మారుతి బాలెనో క్రాస్ ఎస్‌యూవీ ధర బేస్ మోడల్‌కు దాదాపు రూ. 8 లక్షలు నుంచి టాప్-ఎండ్ ట్రిమ్ కోసం రూ. 13 లక్షల వరకు ఉండే ఛాన్స్‌ ఉందని మార్కెట్‌లో సమాచారం. అంతేకాకుండా మార్కెట్‌లో టాటా నెక్సాన్, నిస్సాన్ మాగ్నైట్, హ్యుందాయ్ వెన్యూ వంటి SUVలతో పోటీపడుతుంది. కాబట్టి మీరు కూడా కొత్త మోడల్‌ SUV కొనుగోలు చేయలంటే ఏప్రిల్‌లో దీనిని కొనుగోలు చేయోచ్చు.

Also Read: Vaikunta Ekadasi: తిరుమల శ్రీవారి హుండీకి రికార్డు స్థాయి ఆదాయం.. చరిత్రలో అన్ని రికార్డులు బ్రేక్   

Also Read: Gade Venkata Reddy: భార్య నగలు తాకట్టు పెట్టా.. 70 ఎకరాలు అమ్ముకున్నా.. వైసీపీ జడ్పీటీసీ ఆవేదన 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News