Mahindra XUV 700: మహీంద్రా ఎక్స్‌యూవీ 700 పై ఊహించని విధంగా 2 లక్షల తగ్గింపు

Mahindra XUV 700: దేశంలో గత కొద్దికాలంగా ఎస్‌యూవీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ మధ్యకాలంలో ఇండియన్ కంపెనీ మహీంద్రా ఎస్‌యూవీ 700 గణనీయమైన అమ్మకాలు నమోదు చేస్తోంది. మీకు కూడా మహీంద్రా ఎస్‌యూవీ కొనే ఆలోచన ఉంటే ఇదే సరైన అవకాశం. ఊహించని డిస్కౌంట్ లభిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 10, 2024, 09:30 AM IST
Mahindra XUV 700: మహీంద్రా ఎక్స్‌యూవీ 700 పై ఊహించని విధంగా 2 లక్షల తగ్గింపు

Mahindra XUV 700: మహీంద్రా అండ్ మహీంద్రా లాంచ్ చేసిన Mahindra XUV 700 మార్కెట్‌లో దూసుకుపోతోంది. లాంచ్ చేసిన మూడేళ్లలోనే 2 లక్షల యూనిట్లు అమ్మకాలు నమోదు చేసింది. ఇప్పుుడీ సందర్భంగా భారీ ఆఫర్ ప్రకటించింది. ఏకంగా  2 లక్షల రూపాయలు డిస్కౌంట్ పొందవచ్చు. ఇది పరిమిత ఆఫర్ కావడంతో వెంటనే త్వరపడండి.

Mahindra XUV 700 మూడేళ్ల వార్షికోత్సవ ఆఫర్‌లో భాగంగా ఎంపిక చేసిన వేరియంట్లపై పరిమిత ఆఫర్ ప్రకటించింది. దాదాపుగా ఈ వేరియంట్లపై గరిష్టంగా 2.2 లక్షల వరకూ తగ్గింపు ఇస్తోంది. జూలై 10 అంటే ఇవాళ్టి నుంచి మహీంద్రా ఎక్స్‌యూవీ 700పై ఆఫర్ నడుస్తోంది. Mahindra XUV 700 AX7 అసలు ధర 21.54 లక్షలు కాగా 2.2 లక్షల డిస్కౌంట్‌తో కేవలం 19.49 లక్షలకే లభించనుంది. ఈ కారులో హై ఎండ్ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 26.03 సెంటీమీటర్ల హెచ్‌డి ఇన్‌ఫోటైన్‌మెంట్, డిజిటల్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, లెవల్ 2 ఏడీఏఎస్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కంపాటిబిలిటీ, డ్రైవర్ డ్రౌజినెస్ డిటెక్షన్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్, టైర్ ప్రెషర్ మోనిటరింగ్ సిస్టమ్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. 

ఈ కారు 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. రెండింట్లోనూ 6 స్పీడ్ మేన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ సిస్టమ్ ఉన్నాయి. ఇది కాకుండా 12 స్పీకర్ సోనీ డి ఆడియో సిస్టమ్, 360 డిగ్రీ సరౌండింగ్ వ్యూ, వెంటిలేటెడ్ సీట్లు, నీ ఎయిర్ బ్యాగ్, పాసివ్ కీలెస్ ఎంట్రీ, ఎలక్ట్రానిక్ పార్క్ బ్రేక్, బ్లైండ్ వ్యూ మోనిటర్ ఫీచర్లు ఉన్నాయి. ఈ తగ్గింపు ఆఫర్ ఎన్ని రోజులుంటుందో కంపెనీ ఇంకా ప్రకటించలేదు. మార్కెట్‌లో ఉన్న బెస్ట్ ఎస్‌యూవీని 2 లక్షల తగ్గింపుతో పొందాలంటే ఇదే మంచి అవకాశం.

Also read: TOP CNG Cars: 10 లక్షల్లోపు ధరలో లభించే 5 బెస్ట్ సీఎన్జీ కార్లు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News