Mahindra Bolero: మహీంద్రా బొలేరో అద్భుతమైన సామర్ధ్యం కలిగిన కారు. ఇందులో ఒకేసారి 7 మంది ప్రయాణం చేయవచ్చు. మహీంద్ర బొలేరోలో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ అందుబాటులో ఉంది. ఈ బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీని కేవలం 2.2 లక్షలు చెల్లించి ఇంటికి తీసుకెళ్లవచ్చు.
దేశంలో అత్యధికంగా కార్ల విక్రయాలు జరిపే కంపెనీల్లో మహీంద్రా కంపెనీ ఉంది. మహీంద్రా కార్లను దాదాపుగా అందరూ ఇష్టపడతారు. అత్యధికంగా విక్రయమౌతున్న ఎస్‌యూవీ మహీంద్రా బొలేరో. ఈ కారు ధర, ఫీచర్లు అందర్నీ ఆకట్టుకుంటాయి. ఒకేసారి 7మంది కలిసి ప్రయాణించవచ్చు. ఇందులో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. 75 పీఎస్ పవర్, 210 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇంజన్‌కు 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఉంటుంది. అన్నింటికంటే ఆకట్టుకునే అంశమేదంటే..మహీంద్రా బొలేరోను కేవలం 2.2 లక్షలు చెల్లించి ఇంటికి తీసుకెళ్లవచ్చు.
మహీంద్రా ఇటీవలే బొలేరో ధరను 31 వేల రూపాయలు పెంచేసింది. మహీంద్రా బొలేరో ధర 9.78 లక్షల నుంచి 10.79 లక్షల రూపాయలుంది. కస్టమర్లకు ఈ కారు మూడు వేరియంట్లు బి4, బీ6, బీ6(0) అందుబాటులో ఉన్నాయి. ఎస్‌యూవీలో అత్యధికంగా 7 మంది కూర్చోవచ్చు. అదే లోన్‌పై ఈ వాహనం కొనుగోలు చేయాలనుకుంటే..కేవలం 2.2 లక్షల రూపాయలు చెల్లించి ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఈఎంఐ వివరాలు ఇలా ఉంటాయి..
మహీంద్ర బొలేరో బేసిక్ వేరియంట్ అంటే బీ4 తీసుకోవాలనుకుంటే ఈ కారు ఆన్‌రోడ్ ధర 11.14 లక్షల రూపాయలుంది. డౌన్ పేమెంట్ అనేది ఎంతైనా చెల్లించవచ్చు. ఇక వడ్డీ రేటు కూడా వేర్వేరు బ్యాంకులు వేర్వేరుగా చెల్లిస్తున్నాయి. రుణాన్ని 1-7 ఏళ్ల వరకూ చెల్లించే సౌలభ్యముంటుంది.
2.2 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్10 శాతం వడ్డీతో 5 ఏళ్ల కాలపరిమితి లెక్కేసుకోవచ్చు. ఈ లెక్కన నెలకు 18,881 రూపాయలు ఈఎంఐ ఉంటుంది. అంటే మొత్తం లోన్ 8.92 లక్షల రూపాయలకు అదనంగా 2.40 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
Also read: Amazon mobile offers: Realme GT 2 Pro స్మార్ట్‌ఫోన్‌పై ఊహించని భారీ డిస్కౌంట్ ఆఫర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook