LPG Gas Cylinder Rates Decreased: ప్రతి నెలా 1వ తేదీన గ్యాస్ ధరలపై సమీక్ష ఉంటుంది. ఇందులో భాగంగా దేశంలో వినియోగంలో ఉన్న రెండు రకాల డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధరలు నిర్ణయమౌతుంటాయి. ఇవాళ గ్యాస్ ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
2023-24 కొత్త ఆర్ధిక సంవత్సరం తొలిరోజే గ్యాస్ ధరలపై శుభవార్త విన్పించింది. కేంద్ర ప్రభుత్వం. ప్రతి నెలా ఆయిల్ కంపెనీలతో సమీక్ష అనంతరం గ్యాస్ ధరలు నిర్ధారితమౌతుంటాయి. అంటే నెలకోసారి డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ ధరలు మారుతుంటాయి. అదే పెట్రోల్-డీజిల్ ధరలు రోజూ మారుతుంటాయి. ఇవాళ ఏప్రిల్ 1 కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభం సందర్భంగా గ్యాస్ ధరల్లో తగ్గుదల కన్పించింది. ఇటీవలి కాలంలో డొమెస్టిక్ లేదా కమర్షియల్ గ్యాస్ ధరలు పెరుగుతున్న నేపధ్యంలో ఈసారి తగ్గడం కాస్త ఉపశమనం కల్గిస్తోంది. అయితే తగ్గిన గ్యాస్ ధర కేవలం కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకే. డొమెస్టిక్ గ్యాస్ వినియోగదారులకు ఏ విధమైన ఉపశమనం లేదు. 14.2 కిలోల గ్యాస్ సిలెండర్ ధరను కేంద్ర ప్రభుత్వం మార్చ్ నెలలో 50 రూపాయలు పెంచింది. ఈ నెల కూడా అదే ధర కొనసాగనుంది. అదే సమయంలో మార్చ్ నెలలో కమర్షియల్ సిలెండర్ ధరను 350 రూపాయలు పెంచగా, ఇవాళ 92 రూపాయలు తగ్గించింది.
ఇవాళ్టి నుంచి సవరించిన ధరల అనంతరం ఇండేన్ గ్యాస్ ధరలు 19 కిలోల సిలెండర్ డిల్లీలో 2028 రూపాయలు కాగా, కోల్‌కతాలో 2132 రూపాయలుగా ఉంది. ముంబైలో 1980 రూపాయలైతే చెన్నైలో 2192.50 రూపాయలుంది. ఇక డొమెస్టిక్ గ్యాస్ 14.2 కిలోల సిలెండర్ ధర శ్రీనగర్‌లో 1219 రూపాయలు, ఢిల్లీలో 1103 రూపాయలు, పాట్నాలో 1202 రూపాయలు, అహ్మదాబాద్‌లో 1110 రూపాయలుంది. ఇక బెంగళూరులో 1115.5 రూపాయలు కాగా ముంబైలో 1112.5 రూపాయలుంది. చెన్నైలో 1118.5 రూపాయలు కాగా కోల్‌కతాలో 1129 రూపాయలు, విశాఖపట్నంలో 1111 రూపాయలుంది.
Also Read: Interest Rates Increased: గుడ్ న్యూస్.. పొదుపు పథకాలపై పెరిగిన వడ్డీ రేట్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook