Union Budget 2022 Live updates: క్రిప్టో కరెన్సీ, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నింగ్ ఫైల్, డిజిటల్ రూపీ, సహజ వ్యవసాయం, ఎల్ఐసి ఐపీఓ, ఈ-పాస్‌పోర్ట్ అంశాలపై కీలక ప్రకటన

Union Budget 2022 Live updates: వరుసగా నాలుగో సారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్​లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్​ 2022 లైవ్​ అప్​డేట్స్​ మీకోసం..

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 1, 2022, 01:23 PM IST
Union Budget 2022 Live updates: క్రిప్టో కరెన్సీ, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నింగ్ ఫైల్, డిజిటల్ రూపీ, సహజ వ్యవసాయం, ఎల్ఐసి ఐపీఓ, ఈ-పాస్‌పోర్ట్ అంశాలపై కీలక ప్రకటన
Live Blog

Union Budget 2022 Live updates: 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం నేడు పార్లమెంట్​లో బడ్జెట్ ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ బడ్జెట్ 2022 ను ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్​ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది వరుసగా నాలుగోసారి కావడం విశేషం. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో బడ్జెట్​ పేపర్‌లెస్​ పద్ధతిలో ప్రవేశపెట్టారు.

Union Budget 2022 App: సామాన్యులు సైతం బడ్జెట్ పూర్తి వివరాలు తెలుసుకునేందుకు 'యూనియన్ బడ్జెట్ యాప్​'ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్ ప్లే స్టోర్​, యాపిల్ యాప్​ స్టోర్​ ద్వారా దీనిని డౌన్​లోడ్ చేసుకోవచ్చు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంతో పాటు.. వివిధ రంగాలకు కేటాయింపులు, అంచనాలు, విధాన నిర్ణయాలు, కీలక ప్రకటనలకు సంబంధించిన అన్ని వివరాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.

1 February, 2022

  • 12:53 PM

    12:55 Stock market update- స్టాక్ మార్కెట్ అప్​డేట్

    స్టాక్ మార్కెట్లపై బడ్జెట్ 2022 ఉత్సాహం కొనసాగుతోంది.

    సెన్సెక్స్ 830 పాయింట్లకుపైగా లాభంతో 58,844 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది. నిఫ్టీ 230 పాయింట్లకుపైగా పుంజుకుని.. 17,575 వద్ద కొనసాగుతోంది.

    దాదాపు అన్ని రంగాలు సానుకూలంగా స్పదిస్తున్నాయి.

    సన్​ ఫార్మా 6.10 శాతం, టాటా సీటీల్​ 4.96 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 3.89 శాతం లాభంతో దూసుకుపోతున్నాయి.

  • 12:36 PM

    (12:35) Duty on unpolished diamonds-  డైమండ్స్​పై డ్యూటీ తగ్గింపు..

    పాలీష్​  చేయని డైమండ్స్​పై డ్యూటీ 5 శాతానికి తగ్గింపు

    ఇతర ఉత్పత్తులతో కలపని ఇంధనాలపై అదనంగా లీటర్​కు 2 ఎక్సైజ్​ డ్యూటీని పెంపు

    దీర్ఘకాల మూలధన పెట్టుబడుల ద్వాార వచ్చే ఆదాయంపై 15 శాతం పన్ను విధింపు

  • 12:30 PM

    (12:25) Highest GST collection- రికార్డు స్థాయిలో జీఎస్​టీ వసూళ్లు..

    2022 జనవరిలో రూ.1,40,986 కోట్లు జీఎస్​టీ వసూలైనట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ పార్లమెంట్​లో వెల్లడించారు. జీఎస్​టీ అమలులోకి వచ్చిన తర్వతా అత్యధిక వసూళ్లు ఇవేనని వెల్లడించారు. 

    ఈ సందర్భంగా పన్ను చెల్లింపుదారులందరికీ ఆర్థిక మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

  • 12:19 PM

    Budget 2022 estimation: బడ్జెట్ 2022-23 అంచనా..

    బడ్జెట్ 2022-23 అంచనా రూ.39 లక్షల కోట్లకుగా తెలిపారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​.

    వచ్చే సంవత్సరానికి ఆదాయం అంచనా రూ.22.84 లక్షల కోట్లుగా పేర్కొన్నారు.

    దీనితో వచ్చే ఆర్థిక సంవత్సరం ద్రవ్యోలోటు 6.9 శాతంగా ఉండొచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ వివరించారు.

  • 12:12 PM

    (12:08) Rs 1Lakh crore allocated to states- రాష్ట్రాలకు కోసం ప్రత్యేక నిధి..

    రాష్ట్రాల ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించేందుకు రూ.లక్షకోట్ల కేటాయింపు. ప్రత్యేక నిధితో రాష్ట్రాలకు రూ.లక్షకోట్ల వరకు వడ్డీ రహిత రుణాలు.

  • 12:00 PM

    12:00 Digital Rupee in Fiscal 2022-23- డిజిటల్ కరెన్సీ..

    అందరూ అంచనా వేసినట్లుగానే డిజిటల్​ కరెన్సీపై ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి.

    2022-23 ఆర్థిక సంవత్సరంలో డిజిటల్​ రూపీని అందుబాటలోకి రానుంది. బ్లాక్​ చైన్​, ఇతర సాంకేతికతలతో దీనిని రూపొందించినట్లు చెప్పారు ఆర్థిక మంత్రి.

    ఆర్​బీఐ ద్వారా డిజిటల్ రూపీ జారీ చేయనున్నట్లు ఆర్థిక మంత్రి వివరించారు.

  • 11:53 AM

    11:55 Agricultural universities syllabus - వ్యవసాయ విశ్వవిద్యాలయాల సిలబస్ : 

    ఆధునిక వ్యవసాయ పోకడలు అందిపుచ్చుకుని ఖర్చు లేకుండా సహజ పద్ధతిలో వ్యవసాయం అభివృద్ధి చేసేందుకు దోహదపడే విధంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాల సిలబస్ సవరించేందుకు రాష్ట్రాలను ప్రోత్సహించనున్నట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

  • 11:46 AM

    వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5జీ స్పెక్ట్రం వేలం..

    టెలికాం సంస్థలు 5జీ సేవలు అందించేందుకు కావాల్సిన స్పెక్ట్రం వేలాన్ని 2022-23లో పూర్తి చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

  • 11:42 AM

    దేశవ్యాప్తంగా డిజిటల్​ పేమెంట్స్​ను ప్రోత్సహించేందుకు.. 75 జిల్లాల్లో.. 75 డిజిటల్​ బ్యాంకింగ్ యూనిట్స్. ఏర్పాటు చేయనున్నాం: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​

  • 11:39 AM

    పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్ సేవలు..

    దేశవ్యాప్తంగా ఉన్న1.5 లక్షల పోస్టాఫీసులు 100 శాతం బ్యాంకింగ్ సేవల పరిధిలోకి వచ్చాయి.

    పోస్టాఫీస్ ఖాతా నుంచి బ్యాంక్ ఖాతాకు నగదు బదిలీ సేవలు నడుస్తున్నాయి.

    యూపీఐ, ఇంటర్నెట్​ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి.

  • 11:38 AM

    Digital University - డిజిటల్ యూనివర్శిటీ:
    10:30 విద్యారంగంలో భోదనలో నైపణ్యం పెంపు కోసం చేస్తున్న కృషిలో భాగంగా డిజిటల్ యూనివర్శిటీ ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

  • 11:34 AM

    ఈశాన్య రాష్ట్రాలకు ప్యాకేజ్​..

    ఈశాన్య రాష్ట్రాల కోసం త్వరలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నాం: నిర్మలా సీతారామన్​

    ఆయా రాష్ట్రాల అభివృద్ధికి కోసం 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ.. రూ.1,500 కోట్లు కేటాయింపు

  • 11:32 AM

    నైపుణ్యాలు పెంపొందించేందుకు గాను దేశవ్యాప్తంగా త్వరలో డిజిటల్​ ఎకో సిస్టమ్​ ప్రారంభించనున్నాం: ఆర్థిక మంత్రి

  • 11:20 AM

    11:17 రానున్న  కాలంలో భారత్‌లో రసాయనరహిత వ్యవసాయం పద్ధతులను ప్రోత్సహించనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

  • 11:20 AM

    ప్రధాన మంత్రి గతి శక్తి ప్రణాళికలో భాగంగా రైల్వేకు మరింత ఊతం: ఆర్థిక మంత్రి

    1. వచ్చే మూడేళ్లలో 400 కొత్త వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.

    2. 'స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించేందుకు వన్​ స్టేషన్​ వన్​ ప్రోడక్ట్​ కాన్సెప్ట్​ను తీసుకురాన్నాం'

    3. వచ్చే మూడేళ్లలో మరో 100 కార్గో టర్మినల్​ల ఏర్పాటు..

  • 11:14 AM

    జాతీయ రహదారులను 25 వేల కిలో మీటర్ల మేర విస్తరించనున్నట్లు సీతారామన్​ పేర్కొన్నారు.

  • 11:11 AM

    త్వరలోనే ఎల్​ఐసీ ఐపీఓకి రానున్నట్లు బడ్జెట్​ ప్రసంగంలో స్పష్టం చేసిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​

  • 11:05 AM

    మేక్ ఇండియా ద్వారా దేశంలో 60 లక్షల ఉద్యోగాలు సృష్టించాం: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​..

  • 11:03 AM

    11:00 కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ 2022 ను ప్రకటిస్తూ తన ప్రసంగం ప్రారంభించారు.

     

  • 10:42 AM

    10:20 బడ్జెట్ 2022 ప్రవేశపెట్టడానికంటే ముందుగా జరిగే కేబినెట్ భేటీలో పాల్గొనడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌కి చేరుకున్నారు.

  • 10:33 AM

    10:05 కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కి చేరుకున్నారు. 11 గంటల నుంచి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభించనున్నారు. 

     

  • 10:23 AM

    మార్కెట్లకు బడ్జెట్ 2022 దన్ను..

    బడ్జెట్ 2022-23పై ఆశలతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి.

    సెన్సెక్స్ 750 పాయింట్లకుపైగా లాభంతో 58,764 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 200 పాయింట్లకుపైగా పెరిగి 17,543 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

Trending News