KIA EV6 Car: ఈ క్రేజీ కారు కొనేవారికి షాకింగ్ న్యూస్

KIA EV6 Car Price and Specifications: కియా ఈవి6 ఫీచర్స్ విషయానికొస్తే.. ఇది 5 సీటర్ కారు ఇది. జీటీ లైన్ ఆర్‌డబ్లూడి వేరియంట్ తో పాటు జీటి లైన్ ఏడబ్లుడి వేరియంట్స్ లో ఈ కారు లభిస్తోంది. 77.4 కిలోవాట్ అవర్ బ్యాటరీని అమర్చారు. కియా ఈవి6 ఎలక్ట్రిక్ కారుకు ఉన్న భారీ డిమాండ్ దృష్ట్యా ఈ కారు ధర మరింత పెరిగింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2023, 08:20 PM IST
KIA EV6 Car: ఈ క్రేజీ కారు కొనేవారికి షాకింగ్ న్యూస్

KIA EV6 Car Price and Specifications: కియా ఈవి6 కారు ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఇంకా ఏడాది కూడా కాలేదు. కానీ అప్పుడే భారీ డిమాండ్ సొంతం చేసుకుంది. గతేడాది జూన్ నెలలో కియా ఈవి6 కారు ఇండియాలో లాంచ్ అయినప్పుడు 59.95 లక్షల ప్రారంభ ధర వద్ద లాంచ్ అయింది. కియా ఈవి6 కారును ఇండియాలో సిబియూ కారుగా పరిగణిస్తున్నారు. సిబియూ అంటే కంప్లీట్ బిల్ట్-అప్ కారు అని అర్థం. ఈ కారుకు మరో విశిష్టత కూడా ఉంది. కియా మోటార్స్ ఇండియాలో కాలుమోపిన తరువాత ఆ కంపెనీ నుంచి వచ్చిన తొలి ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం గమనార్హం. 

కియా ఈవి6 ఎలక్ట్రిక్ కారుకు ఉన్న భారీ డిమాండ్ దృష్ట్యా ఈ కారు ధర మరింత పెరిగింది. లాంచింగ్ సమయంలో GT Line RWD వేరియంట్ ధర రూ.59.95 లక్షలుగా ఉండగా.. తాజాగా ఆ కారు ధర మరో లక్ష రూపాయలు పెరిగి మొత్తం రూ. 60.95 లక్షలకు చేరుకుంది. అలాగే GT Line AWD వేరియంట్ కారు 64.95 లక్షలుగా ఉండగా.. ఈ వేరియంట్ పై కూడా మరో రూ. లక్ష వరకు పెరిగి మొత్తం రూ. 65.95 లక్షలకు చేరింది. 

ఇప్పటికే ఈ కారుని ఇష్టపడి కొనాలని అనుకుని, కొన్న వాళ్లకు ఆ లక్ష రూపాయలు సేఫ్. ఇకపై ఈ రెండు వేరియంట్స్‌లో ఏ కారు కొనాలన్నా మరో లక్ష రూపాయలు అదనంగా చెల్లించుకోవాల్సిందే. 

కియా ఈవి6 ఫీచర్స్ విషయానికొస్తే.. ఇది 5 సీటర్ కారు ఇది. జీటీ లైన్ ఆర్‌డబ్లూడి వేరియంట్ తో పాటు జీటి లైన్ ఏడబ్లుడి వేరియంట్స్ లో ఈ కారు లభిస్తోంది. 77.4 కిలోవాట్ అవర్ బ్యాటరీని అమర్చారు. కియా చెబుతున్న వివరాల ప్రకారం కియా ఈవీ6 కారు ఒక్కసారి చార్జ్ చేస్తే.. 708 కిమీ రేంజ్ వరకు చక్కర్లు కొట్టొచ్చు. ఇంకా చెప్పాలంటే.. హైదరాబాద్ నుంచి విజయవాడకు బేఫికర్ గా వెళ్లి రావొచ్చు. లేదంటే హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు ఏ టెన్షన్ లేకుండా వెళ్లొచ్చు. 

229 పిఎస్ సామర్థ్యంతో నడిచే ఈ కారు ఇంజన్ 350 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. బిఎండబ్లూ ఐ4, హ్యూందాయ్ ఆయనిక్5, వోల్వో ఎక్స్‌సీసీ 40 రీచార్జ్ వంటి కార్లతో కియా ఈవి6 కారు పోటిపడుతుంది.

ఇది కూడా చదవండి : kia EV9 Specs: కొత్త కారు కొంటున్నారా ? కొంచెం ఆగండి

ఇది కూడా చదవండి : Amul Franchise Investment: అమూల్ ఫ్రాంఛైజీతో భారీ లాభాలు.. 2 లక్షల పెట్టుబడితో నెలకు రూ. 5 లక్షల వరకు లాభం

ఇది కూడా చదవండి : Tata Nexon SUV Prices: మారుతి, మహింద్రాలకు చమటలు పట్టిస్తున్న ఎస్‌యూవి.. జనం కళ్లు మూసుకుని కొంటున్న ఎస్‌యూవి కారు ఏదో తెలుసా ?

ఇది కూడా చదవండి : SBI Loans: గుడ్ న్యూస్.. ఏ సెక్యురిటీ లేకుండానే 10 లక్షల రుణం ఇస్తోన్న ఎస్బీఐ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News