Free OTT Platforms: నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఏడాది ఉచితంగా కావాలా

Free OTT Platforms: నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి ప్రముఖ ఓటీటీలను ఇక మీరు ఏడాదిపాటు ఉచితంగా పొందవచ్చు. ఆశ్చర్యపోతున్నారా..ముమ్మాటికీ నిజం. అదెలాగో చూద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 15, 2022, 10:34 PM IST
Free OTT Platforms: నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఏడాది ఉచితంగా కావాలా

ఓటీటీ వేదికలపై ఇటీవలి కాలంలో క్రేజ్ బాగా పెరిగింది. అందుకే నెల నెలా లేదా ఏడాదికోసారి భారీగా ఖర్చు చేస్తున్నారు. అయితే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలను ఏడాదిపాటు పూర్తిగా ఉచితంగా అందుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ వివరాలు తెలుసుకుందాం..

ఉచితంగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ అది కూడా ఏడాది పాటు పొందేందుకు అద్భుత అవకాసం లభిస్తోంది. నెట్‌ఫ్లిక్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ప్రముఖ ఓటీటీ వేదికల సేవలు ఉచితంగా పొందవచ్చు. ఈ అవకాశాన్ని మీకు జియో అందిస్తోంది. జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తీసుకుంటే ఈ రెండు ఓటీటీలు ఉచితంగా ఏడాదిపాటు పొందవచ్చు. ఈ అవకాశం ఎలా పొందాలో చూద్దాం..

జియో ప్లాన్ 399 రూపాయల ప్లాన్‌లో ప్రతి నెలా 75 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించుకునే వెసులుబాటు ఉంది. అంతేకాకుండా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఏడాది సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందుకోవచ్చు.

జియో ప్లాన్ 599 రూపాయల ప్లాన్‌లో 100 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఏడాది ఉచిత సబ్‌స్క్రిప్షన్ అందుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఇవాళే జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తీసుకోండి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఏడాది పాటు ఉచితంగా ఎంజాయ్ చేయండి.

Also read: Credit Card Alert: క్రెడిట్ కార్డు హోల్డర్లకు బిగ్ ఎలర్ట్, ఇక నుంచి ఆ బ్యాంకు కార్డులపై కొత్త ఛార్జీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News