ITR E-Verification: ఐటి రిటర్న్స్ ఇ-వెరిఫికేషన్ చేశారా లేదా ? లేదంటే భారీ జరిమానా తప్పదు

ITR E-Verification After Filing IT Returns : పన్ను చెల్లింపుదారులకు ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఇ - వెరిఫికేషన్ ప్రాముఖ్యతను ఒక్కి నొక్కానించి చెబుతూ ఆదాయపు పన్ను శాఖ చేసిన ఈ ట్వీట్ కి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. " ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన 30 రోజులలోగా మీ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ని ధృవీకరిస్తూ ఇ - వెరిఫై చేయడం మర్చిపోవద్దు " అని తమ ట్వీట్ లో పేర్కొంది.

Written by - Pavan | Last Updated : Sep 11, 2023, 06:14 PM IST
ITR E-Verification: ఐటి రిటర్న్స్ ఇ-వెరిఫికేషన్ చేశారా లేదా ? లేదంటే భారీ జరిమానా తప్పదు

ITR E-Verification After Filing IT Returns : జరిమానా లేకుండా ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడానికి జూలై 31వ తేదీతో చివరి గడువు ముగిసిన విషయం తెలిసిందే. అయితే, తుది గడువులోపు కానీ లేక తుది గడువు తరువాత కానీ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినంత మాత్రాన్నే పని అయిపోతుంది అని అనుకోవద్దు. ఐటిఆర్ ఫైల్ చేసిన తరువాత 30 రోజులలోపు మీ ఐటి రిటర్న్స్ ని ఇ-వెరిఫికేషన్ చేయడం కూడా అంతే ముఖ్యం అనే విషయం మర్చిపోవద్దు. లేదంటే మీ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు ప్రక్రియ అనేది పూర్తి కాకుండా అసంపూర్తిగానే మిగిలిపోతుంది. 

ఉదాహరణకు మీరు జూలై 31వ తేదీలోగా ఐటి రిటర్న్స్ ఫైల్ చేసినట్లయితే, ఆగస్టు 31వ తేదీ లోగా ఇ-వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇ- వెరిఫికేషన్ చేయలేని పక్షంలో ఐటి శాఖ మీకు రూ. 5,000 జరిమానా విధిస్తుంది. అందుకే పన్ను చెల్లింపుదారులకు ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఆదాయపు పన్ను శాఖ ఒక ట్వీట్‌ చేసింది.

ఇ-వెరిఫికేషన్ గురించి గుర్తుచేసిన ఐటి శాఖ :
పన్ను చెల్లింపుదారులకు ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఇ - వెరిఫికేషన్ ప్రాముఖ్యతను ఒక్కి నొక్కానించి చెబుతూ ఆదాయపు పన్ను శాఖ చేసిన ఈ ట్వీట్ కి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. " ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన 30 రోజులలోగా మీ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ని ధృవీకరిస్తూ ఇ - వెరిఫై చేయడం మర్చిపోవద్దు " అని తమ ట్వీట్ లో పేర్కొంది. ఆలస్యం చేసే కొద్ది ఈ ప్రక్రియ మరింత క్లిష్టంగా మారుతుంది అని సూచించిన ఆదాయ పన్ను శాఖ.. ఆలస్యం లేకుండా ఈరోజే ఆ పని పూర్తి చేయండి అని స్పష్టంచేసింది. ఐటి రిటర్న్స్ దాఖలు చేసే వారిలో చాలామందికి ఈ విషయం తెలియక ఇబ్బంది పడే ప్రమాదం ఉంది అనే ముందు జాగ్రత్తలోనే ఐటి శాఖ ఈ ట్వీట్ చేసింది. 

ఐటి రిటర్న్స్ దాఖలు ఇ - వెరిఫికేషన్ ప్రాముఖ్యత ఏంటంటే :
ఐటి రిటర్న్స్ ఇ - వెరిఫికేషన్ ప్రాముఖ్యత గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఐటి రిటర్న్స్ ఇ - వెరిఫికేషన్ పూర్తి చేస్తేనే ఐటి రిటర్న్స్ దాఖలు ప్రక్రియ పూర్తి చేసినట్టు అవుతుంది. ఒకవేళ మీకు ఐటి రిఫండ్స్ దాఖలు చేయాలనుకున్నా.. ఇ-వెరిఫికేషన్ పూర్తి చేస్తేనే ఐటి రిఫండ్స్ సాధ్యం అవుతుంది. మీరు ఏ రోజైతే ఇ-వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారో.. ఆ రోజు ఆధారంగానే ఐటి శాఖ మీ రిటర్న్స్ తేదీ కూడా నిర్ణయించడం జరుగుతుంది. ఉదాహరణకు మీరు సెప్టెంబర్ 1న మీ ITRని వెరిఫై చేశారు అనుకోండి.. మీ ఫైలింగ్ తేదీ సెప్టెంబర్ 1గా పరిగణించడం జరుగుతుంది.

Trending News