Infinix Note 12 Sale: వేయి రూపాయల కంటే తక్కువ ధరకే Infinix Note 12 స్మార్ట్ ఫోన్.. త్వరపడండి!

Infinix Note 12 Sale: మీరు తక్కువ ధరతో సరికొత్త ఫీచర్‌లతో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే Infinix కంపెనీకి చెందిన స్మార్ట్‌ఫోన్ Infinix Note 12 ను ట్రై చేయండి. మే 28 నుంచి ఈ స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభం కాగా.. దీన్ని వేయి రూపాయల కంటే తక్కువ ధరకే కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 28, 2022, 02:07 PM IST
Infinix Note 12 Sale: వేయి రూపాయల కంటే తక్కువ ధరకే Infinix Note 12 స్మార్ట్ ఫోన్.. త్వరపడండి!

Infinix Note 12 Sale: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? Infinix కంపెనీకి చెందిన తాజా స్మార్ట్‌ఫోన్ Infinix Note 12 ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మే 28 నుంచి ఆన్ లైన్ షాపింగ్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో అమ్మకానికి ఉంది. ఈ మొబైల్ ను అత్యంత తక్కువ ధరకే కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 

Infinix Note 12 ఫస్ట్ సేల్..

ఇన్ఫినిక్స్ నోట్ 12 ఫస్ట్ సేల్ ను మే 28 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభించారు. Infinix Note 12 లాంచ్ ధర రూ. 12,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ డీల్‌లో అనేక అదనపు ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా ఈ మొబైల్ ను మరింత తక్కువ ధరకే కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. 

ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు సమయంలో Axis బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించడం ద్వారా మీరు వెయ్యి రూపాయల తగ్గింపును పొందుతారు. Flipkart Axis క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే అదనంగా 600 రూపాయల క్యాష్‌బ్యాక్ పొందేందుకు అవకాశం ఉంది.

దీంతో పాటు ఈ డీల్ లో ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అవకాశం ఉంది. మీ పాత మొబైల్ ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా Infinix Note 12 మొబైల్ పై మరింత తగ్గింపు లభిస్తుంది. మీ పాత స్మార్ట్ ఫోన్ కండిషన్ ను బట్టి దాదాపుగా రూ. 12 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. ఇన్ని తగ్గింపులు, ఆఫర్స్ తర్వాత Infinix Note 12 స్మార్ట్ ఫోన్ ను రూ. వేయి కంటే తక్కువ  ధరకే కొనుగోలు చేయవచ్చు. 

Infinix Note 12 ఫీచర్లు

డిస్ ప్లే  - 7.6-అంగుళాల ఫుల్ HD + AMOLED 

బ్యాటరీ  -  5000mAh, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌

ప్రాసెసర్  -  MediaTek Helio G88 

స్టోరేజ్  -   6GB RAMతో 5GB వర్చువల్ RAM.. 128 GB వరకు స్టోరేజ్ ను పెంచుకోవచ్చు. 

కెమెరా - 50MP (మెయిన్ సెన్సార్), 2MP (డెప్త్ లెన్స్), 16MP ఫ్రంట్ కెమెరా. 

Also Read: Ration Card Aadhar Link: రేషన్ కార్డు దారులకు శుభవార్త.. ఆధార్ లింక్ గడువు పొడిగింపు!

Also Read: Knowledge Story: ఇండియన్ కరెన్సీ నోట్లపై ఉండే గీతలు ఏంటో ఎప్పుడైనా గమనించారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News