Income tax Dates: ఇన్‌కంటాక్స్ విషయంలో మే నెలలో ముఖ్యమైన తేదీలు, గుర్తుంచుకోవల్సిన అంశాలు

Income tax Dates: ఆదాయపు పన్నుకు సంబంధించి కీలక విషయాలు ప్రతియేటా గుర్తుంచుకోవాలి. ఐటీ రిటర్న్స్ పైల్ చేయడం, రిఫండ్ క్లైమ్ ఇతర వివరాలు, పన్ను చెల్లింపులు ఇలా కొన్ని ముఖ్యమైన తేదీలున్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 7, 2023, 08:25 PM IST
Income tax Dates: ఇన్‌కంటాక్స్ విషయంలో మే నెలలో ముఖ్యమైన తేదీలు, గుర్తుంచుకోవల్సిన అంశాలు

Income tax Dates: ట్యాక్స్ పేయర్లకు ముఖ్య గమనిక. పన్ను చెల్లించేందుకు, ఇతర కీలకమైన విషయాలకు మే నెల అత్యంత ముఖ్యమైందిగా గుర్తుంచుకోవాలి. మే నెలలో వివిధ పనులకు వివిధ గడువు తేదీలున్నాయి. ఈ గడువు తేదీలు దాటితే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది.

ఇన్‌కంటాక్స్ ప్లానింగ్ అత్యంత కీలకమైంది. ప్లానింగ్ సరిగ్గా ఉంటే ట్యాక్స్ నుంచి మినహాయింపు పొందవచ్చు. వివిధ రకాల పన్నులకు వేర్వేలు తేదీలుంటాయి. పన్ను చెల్లింపు విషయంలో ఏదైనా తప్పులు దొర్లితే తిరిగి ఫైన్ చెల్లించాల్సి వస్తుంది. మే నెలలో ఇన్‌కంటాక్స్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన గడువు తేదీల గురించి తెలుసుకుందాం..

మే 7

ఏప్రిల్ 2023లో ట్యాక్స్ మినహాయింపు లేదా డిపాజిట్‌కు మే 7 చివరి తేదీ. 

మే 15

మార్చ్ 2023లో ఇన్‌కంటాక్స్ శాఖ సెక్షన్లు 194-1ఏ, 194-1 బి, 194 ఎం, 194 ఎస్ కింద మినహాయింపు పొందిన టీడీఎస్ సర్టిఫికేట్ జారీకు మే 15 చివరి తేదీగా ఉంది.  ప్రభుత్వ కార్యాలయం నుంచి ఫాం 24జి అందుకునేందుకు సైతం ఇదే చివరి తేదీ. స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ఫారమ్ 3 బీబీ స్టేట్‌మెంట్ అందించేందుకు గడువు తేదీ ఇదే. 

మే 30

ఏప్రిల్ 2023 నాటికి సెక్షన్లు 194 ఏ, 194 బి, 194 ఎం, 194 ఎస్ ద్వారా డిడక్షన్ ఇచ్చిన పన్నుకు చలాన్ కమ్ స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు మే 30 చివరి తేదీగా ఉంది. 2022-23 సంవత్సరానికి ఎన్ఆర్ఐలు స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు కూడా ఇదే చివరి తేదీ.

మే 31

ఏప్రిల్ 2023 నాటికి ముగిసే త్రైమాసికానికి సంబంధించిన పైల్ చేసిన టీడీఎస్ స్టేట్‌మెంట్‌ను మే 31లోగా సమర్పించాలి. సూపర్ యాన్యుయేషన్ ఫండ్‌కు ట్రస్టీలు చెల్లించిన చందాలకు ట్యాక్స్ రిడక్షన్ రిటర్న్ మే 31లోగా సమర్పించాలి. 2022-23 ఆర్దిక సంవత్సరంలో సెక్షన్ 285 బి ప్రకారం అందించాల్సిన ఆర్దిక లావాదేవీలకు ఇదే చివరి తేదీ.మరోవైపు 2023-24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి పాత, కొత్త ట్యాక్స్ విధానాలఎంపికపై నిర్ణయాన్ని కూడా తెలియజేయాల్సి ఉంటుంది. వాస్తవానికి ఇప్పటికే చెప్పాల్సి ఉన్నా..ఇంకా సమయముంది. 

Also read: Go First Insolvency: భారీగా పెరిగిన విమానం చార్జీలు.. మరింత ఖరీదైన విమానయానం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News