Hyundai sedan models: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుండయ్ ఇటీవలే హ్యుండయ్ వెర్నా సెడాన్ లాంచ్ చేసింది. ఈ కారు ధర ధర ఎక్కువే అయినా ఫీచర్లు, డిజైన్ పరంగా చూస్తే అద్భుతమైంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ రెండు కార్లకు మంచి డిమాండ్ ఉంది.
హ్యుండయ్ కంపెనీ ఇటీవల లాంచ్ చేసిన హ్యుండయ్ వెర్నా సెడాన్ కొత్తరూపం అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ కారు ధర 10.90 లక్షల నుంచి ప్రారంభమౌతుంది. ఇందులో 1.5 లీటర్ నేచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ రెండూ ఉన్నాయి. ఈ కారు 20.60 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ కారు కొత్త డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇందులో ఏడీఏఎస్ లెవెల్ 2 ఫీచర్ జోడించారు. సెడాన్ కారు కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్.
కానీ పది లక్షల కంటే తక్కువ ధరకు, అత్యధిక మైలేజ్ ఇచ్చే సెడాన్ కావాలనుకుంటే ఇదే హ్యుండయ్ కంపెనీ నుంచి మరో కారు అందుబాటులో ఉంది. హ్యుండయ్ ఆరా మంచి ఆప్షన్ కాగలదు. కంపెనీ ఇటీవలే హ్యుండయ్ ఆరాను అప్‌డేట్ చేసింది. హ్యుండయ్ ఆరాని కంపెనీ నాలుగు మోడల్స్ E,S,SX,SX(o)లో అందుబాటులో ఉన్నాయి. హ్యుండయ్ ఆరా సెడాన్ ప్రారంభధర 6.30 లక్షల రూపాయలుంది. ఈ కారు 6 మోనోటోన్ రంగుల్లో లభ్యమౌతోంది. ఈ కారుని హోండా ఎమేజ్, టాటా టిగోర్, మారుతి సుజుకి డిజైర్‌తో పోటీగా పెట్టవచ్చు.
ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ 83 పీఎస్, 114 ఎన్ఎం టార్క్ వినియోగించారు. ఇంజన్‌ను 5 స్పీడ్ మేన్యువల్, 5 స్పీడ్ ఏఎంటీ గేర్ బాక్స్‌తో జోడించారు. ఈ కారు సెడాన్ సీఎన్జీ పవర్‌ట్రేన్‌లో కూడా లభిస్తుంది. ఇది 69 పీఎస్, 95.2 ఎన్ఎం అవుట్‌పుట్ ఇస్తుంది. సీఎన్జీతో ఈ కారు మైలేజ్ 28 కిలోమీటర్లు కావడం విశేషం. వాస్తవానికి 25 కిలోమీటర్ల వరకూ మైలేజ్ ఇస్తుంది.
హ్యుండయ్ ఆరా ఫీచర్లు
హ్యుండయ్ ఆరా సెడాన్ కారులో 8 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్, క్రూయిజ్ కంట్రోల్, హైట్ ఎడ్జస్టెబుల్ డ్రైవర్ సీట్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటో క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సెక్యూరిటీ కోసం ఇందులో 4 ఎయిర్ బ్యాగ్స్ ఉంటే..ఇదే మోడల్ టాప్ వేరియంట్‌లో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెషర్ మోనిటరింగ్ సిస్టమ్ ఉన్నాయి. వీటితో పాటు రివర్స్ కెమేరా, ఐసోఫిక్స్ ఛైల్డ్ సీడ్ యాంకర్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కూడా ఉంది.
Also read: Upcoming Electric Cars: విడుదలకు సిద్ధంగా ఉన్న 5 ఎలక్ట్రిక్ కార్లు.. పూర్తి వివరాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Hyundai sedan models: డిజైర్, ఎమేజ్‌కు పోటీగా ఇంతకంటే తక్కువ సెడాన్ కారు ఉండదు మరి