Hyundai New Launch: హ్యుండయ్ నుంచి మరో రెండు కార్లు, ధర ఎంత, ఫీచర్లు ఎలా ఉన్నాయి

Hyundai New Launch: దేశంలో ఇప్పటికే ఎస్‌యూవీ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న హ్యుండయ్ కంపెనీ మరో రెండు కొత్త వేరియంట్ కార్లను లాంచ్ చేసింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న రెండు కార్లకు అడిషనల్ ఇవి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 9, 2023, 12:04 AM IST
Hyundai New Launch: హ్యుండయ్ నుంచి మరో రెండు కార్లు, ధర ఎంత, ఫీచర్లు ఎలా ఉన్నాయి

Hyundai New Launch: దేశంలో టాప్ సెల్లింగ్ ఎస్‌యూవీ అంటే హ్యుండయ్ క్రెటా. క్రెటా తరువాత అల్కజార్, వెన్యూలకు కూడా క్రేజ్ పెరుగుతోంది. ఇప్పుడు హ్యుండయ్ కంపెనీ మరో రెండు కొత్త వేరియంట్లను లాంచ్ చేసింది. కొత్త ఫీచర్లతో సరికొత్తగా రూపుదిద్దుకున్న హ్యుండయ్ మిడ్‌సైజ్ కార్ల గురించి తెలుసుకుందాం..

దేశంలో ఇటీవలి కాలంలో ఎస్‌యూవీ మార్కెట్ క్రేజ్ పెరుగుతోంది. ఇందుకు తగ్గట్టే వివిధ కంపెనీలు ఎస్‌యూవీలపై ఫోకస్ పెంచుతున్నాయి. ఎస్‌యూవీ మార్కెట్‌లో ఇప్పటికే అగ్రగామిగా ఉన్న హ్యుండయ్ కంపెనీ మరో రెండు కొత్త ఎడిషన్లు లాంచ్ చేసింది. క్రెటా, అల్కజార్ కార్లకు అడ్వెంచర్ వెర్షన్ లాంచ్ చేసి మార్కెట్‌లో హల్‌చల్ చేస్తోంది. అత్యాధునిక ఫీచర్లు, అప్‌డేట్స్‌తో మిడ్ సైజ్ ఎస్‌యూవీ ప్రీమియం ఎడిషన్ వేరియంట్లను ప్రవేశపెట్టింది. 

హ్యుండయ్ క్రెటా అడ్వంచర్ ఎడిషనర్ 15.17 లక్షలు కాగా, హ్యుండయ్ అల్కజార్ ఎడిషన్ 19.04 లక్షలుంది. ఈ రెండు అడ్వెంచర్ కార్లలో వివిధ వేరియంట్లు కూడా ఉన్నాయి. హ్యుండయ్ క్రెటా అడ్వెంచర్ ఎడిషన్ పెట్రోల్ ఎంటీఏఈ వెర్షన్ 15.17 లక్షలు. అయితే ఇందులోనే ఐవీటీఏఈ వెర్షన్ ధర 17.90 లక్షలుంది. 

ఇక హ్యుండయ్ అల్కజార్ అడ్వెంజర్ ఎడిషన్ ఎంటీఎంఈ పెట్రోల్ వెర్షన్ 19.04 లక్షలు కాగా, డీసీటీఏఈ వెర్షన్ 20.64 లక్షలుంది. ఇక ప్లాటినమ్ ఎంటీఏఈ వెర్షన్ ధర 19.99 లక్షలుంది. ఇక సిగ్నేచర్ ఎంటీఏఈ ధర 21.24 లక్షలుంది.

హ్యుండయ్ క్రెటా అడ్వెంచర్ ఎడిషన్ కారులో 1.5 పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 113 బీహెచ్‌పి పవర్, 144 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇందులో 6 స్పీడ్ మేన్యువల్ గేర్ బాక్స్ ప్రత్యేకత. ఇక హ్యుండయ్ అల్కజార్ 158 బీహెచ్‌పి పవర్ జనరేట్ చేస్తుంది. ఇందులో కూడా మేన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఉన్నాయి. హ్యుండయ్ అడ్వెంచర్ ఎడిషన్ కార్లను అందంగా రూపుదిద్దేందుకు కొత్తగా బ్లాక్డ్ అవుట్ గ్రిల్స్, బంపర్లు, స్కిడ్ ప్లేట్లు, డార్క్ కలర్ అల్లాయ్ వీల్స్ అమర్చారు. వీటిలో మోనోటోన్, డ్యూయల్ టోన్,. కలర్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. డ్యూయల్ కెమేరా డాష్ క్యామ్ మరో ప్రత్యేకత. 

Also read: Insurance Scams: బీమారంగంలో కూడా మోసాలు, నకిలీ ఇన్సూరెన్స్‌లు వస్తున్నాయి జాగ్రత్త

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News