Hyundai Creta: మీకు నచ్చిన హ్యుండయ్ క్రెటా కారు కేవలం 8 లక్షలే ఇప్పుడు, ఎక్కడంటే

Hyundai Creta: దేశంలో గత కొద్దికాలంగా ఎస్‌యూవీ క్రేజ్ పెరుగుతోంది. అదే సమయంలో ఎస్‌యూవీ అనగానే గుర్తొచ్చేది హ్యుండయ్ క్రెటా. అద్భుతమైన లుక్స్, ఫీచర్లతో అందర్నీ ఆకట్టుకునే క్రెటా అంటే అందరీ మోజెక్కువ. అయితే ధర ఎక్కువ కావడంతో వెనుకంజ వేస్తుంటారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 31, 2023, 03:55 PM IST
Hyundai Creta: మీకు నచ్చిన హ్యుండయ్ క్రెటా కారు కేవలం 8 లక్షలే ఇప్పుడు, ఎక్కడంటే

Hyundai Creta: ఈ క్రమంలో హ్యుండయ్ క్రెటా తక్కువ ధరకు లభ్యమౌతుందంటే నమ్ముతారా..కేవలం 8 లక్షలకే హ్యుండయ్ క్రెటాను మీ సొంతం చేసుకోవచ్చు. అది కూడా ఏ విధమైన రోడ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేకుండానే. ఆ వివరాలు పరిశీలిద్దాం..

హ్యుండయ్ క్రెటా అంటే ఆ కంపెనీలో అత్యధికంగా విక్రయమయ్యే ఎస్‌యూవీ. జూన్ నెలలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఎస్‌యూవీ కూడా ఇదే. హ్యుండయ్ క్రెటాకు ప్రస్తుతం మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంది. హ్యుండయ్ క్రెటా కొనాలంటే కొన్ని నెలలు వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది. అందుకే ఇప్పుడు మేం మీకు వివరించబోయే క్రెటా అయితే వెయిటింగ్ అవసరం లేదు. వెంటనే ఇంటికి తీసుకెళ్లవచ్చు. రోడ్ ట్యాక్స్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది సెకండ్ హ్యాండ్ క్రెటా. పాత వాహనాలుకు రోడ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరముండదు. సెకండ్ హ్యాండ్ కార్ యాప్ కార్స్ 24 లో ఉదహరించిన కొన్ని కార్ల గురించి తెలుసుకుందాం..

కార్స్ 24లో పేర్కొన్న హ్యుండయ్ క్రెటా 2015 మోడల్. 1.6 మేన్యువల్ ధర 7.96 లక్షలుగా ఉంది. ఇది కేవలం 31, 824 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. పెట్రోల్ ఇంజన్ కలిగిన ఈ కారు ఫస్ట్ ఓనర్ షిప్‌లో ఉంది. రిజిస్ట్రేషన్ డీఎల్-8సితో ప్రారంభం కానుంది. నోయిడాలో ఇది అందుబాటులో ఉంది. 

ఇక మరో హ్యుండయ్ క్రెటా కారు 2015 మోడల్. 27,923 కిలోమీటర్లు తిరిగిన ఈ కారు ధర 8.13 లక్షలుగా ఉంది. ఇది కూడా పెట్రోల్ ఇంజన్ కారు కావడం విశేషం. ఈ కారు రిజిస్ట్రేషన్ యూపీ-32తో ప్రారంభమౌతుంది. ప్రస్తుతం నోయిడాలో ఉంది.

మరో హ్యుండయ్ క్రెటా 2015 మోడల్ ఇప్పటి వరకూ 44,445 కిలోమీటర్లు తిరిగింది. 1.6 మేన్యువల్ ఎస్ఎక్స్ (o) మేన్యువల్ వేరియంట్ ధర 8.35 లక్షలుగా ఉంది. ఇది డీజిల్ ఇంజన్ ఫస్ట్ ఓనర్ షిప్‌లో ఉంది.  ఈ కారు రిజిస్ట్రేషన్ నెంబర్ హెచ్ఆర్-10తో ప్రారంభమౌతుంది. నోయిడాలో ఉంది. 

ఇక హ్యుండయ్ క్రెటా 2015 మోడల్ ఎస్ఎక్స్ ప్లస్ 1.6 పెట్రోల్ వేరియంట్ 8.40 లక్షలుగా ఉంది. ఇప్పటివరకూ కేవలం 23, 796 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఈ కారు రిజిస్ట్రేషన్ కూడా డీఎల్-8సి తో ప్రారంభమౌతుంది. ప్రస్తుతం ఈ కారు కావాలంటే నోయిడాలో లభిస్తుంది.

Also read; ITR Filing Deadline: ఐటీఆర్‌ ఫైలింగ్‌కు నేడే లాస్ట్ డేట్.. ఈ ఐదు తప్పులు చేయకండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News