Hyundai Car Discounts: హ్యుందాయ్ కార్లపై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.1.5 లక్షల తగ్గింపు! ఈ అవకాశం మళ్లీ రాదు

Bumper discount offers on Hyundai i20 and Grand i10 Nios Cars. హ్యుందాయ్ ఐ20, గ్రాండ్ ఐ10 నియోస్, హ్యుందాయ్ ఆరా మరియు హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ డిస్కౌంట్ ఆఫర్‌లు ఉన్నాయి.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 7, 2022, 02:52 PM IST
  • హ్యుందాయ్ కార్లపై బంపర్ ఆఫర్
  • ఏకంగా రూ.1.5 లక్షల తగ్గింపు
  • ఈ అవకాశం మళ్లీ రాదు
Hyundai Car Discounts: హ్యుందాయ్ కార్లపై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.1.5 లక్షల తగ్గింపు! ఈ అవకాశం మళ్లీ రాదు

Hyundai Car Discounts 2022 December: 2022 సంవత్సరం త్వరలోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో చాలా కార్ల కంపెనీలు తమ పాత మోడళ్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్‌లను ప్రకటిస్తున్నాయి. మారుతీ సుజుకి కార్లపై రూ. 50,000 తగ్గింపు లభిస్తుండగా.. మహీంద్రాకు చెందిన ఎస్‌యూవీలపై లక్ష వరకు తగ్గింపు లభిస్తోంది. అదేవిధంగా హ్యుందాయ్ వాహనాలపై కూడా భారీ డిస్కౌంట్ ఆఫర్‌లు ఉన్నాయి. డిసెంబర్ నెలలో హ్యుందాయ్ కంపెనీ తమ కార్లపై రూ. 1.5 లక్షల వరకు తగ్గింపు ఇస్తోంది. హ్యుందాయ్ ఐ20, గ్రాండ్ ఐ10 నియోస్, హ్యుందాయ్ ఆరా మరియు హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ వాహనాలపై డిస్కౌంట్ ఆఫర్‌లు ఉన్నాయి. 

Hyundai Kona Electric:
హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారుపై కంపెనీ అత్యధిక తగ్గింపును ఇస్తోంది. 1.50 లక్షల తగ్గింపుతో డిసెంబర్‌లో ఈ కారును కొనుగోలు చేయవచ్చు. మీరు ఈ తగ్గింపును డైరెక్ట్ క్యాష్ డిస్కౌంట్ రూపంలో పొందవచ్చు. హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు 39kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. పూర్తి ఛార్జ్‌పై 452 కిమీల వరకు ప్రయాణం చేయొచ్చు. ఈ వాహనాన్ని 50kW DC ఛార్జర్ ద్వారా 57 నిమిషాల్లో 0-80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

Hyundai Grand i10 Nios:
డిసెంబర్‌లో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కారుపై రూ. 63,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇందులో నేరుగా రూ. 50,000 నగదు తగ్గింపు (1.0-లీటర్ ఇంజన్) ఉంటుంది. రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపు ఉన్నాయి. ప్రస్తుతం హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ మారుతి స్విఫ్ట్ మరియు టాటా టియాగో వంటి కార్లతో పోటీపడుతుంది.

Hyundai Aura:
హ్యుందాయ్ ఆరా కారు కంపెనీకి చెందిన కాంపాక్ట్ సెడాన్. ఈ వాహనం డిసెంబర్‌లో రూ. 43 వేల వరకు తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. ఇందులో నేరుగా రూ. 30,000 నగదు తగ్గింపు (CNG వెర్షన్) ఉంటుంది. రూ. 10,000 (1.2-లీటర్ మరియు CNG) ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపు ఉంది. 

Hyundai i20:
హ్యుందాయ్ ఐ20 కారు డిసెంబరు నెలలో రూ. 30,000 వరకు తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. ఇది కంపెనీ ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ కారు. ఈ తగ్గింపు పెట్రోల్ మరియు డీజిల్ కార్లపై అందుబాటులో ఉంది. ఇందులో రూ. 20,000 నగదు తగ్గింపు మరియు రూ.10,000 ఎక్స్చేంజ్ బోనస్ ఉన్నాయి.
Also Read: Sai dharam Tej: ఆసక్తి రేకెత్తిస్తున్న సాయిధరమ్‌ తేజ్‌ 'విరుపాక్ష' టైటిల్‌ గ్లింప్స్‌.. ఎన్టీఆర్‌ వాయిస్‌ అదుర్స్‌!  

Also Read: Rohit Sharma: రోహిత్ శర్మకు గాయం.. ఆసుపత్రికి తరలింపు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter,  Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. 

 

Trending News