Loan Application For Defaulters: ఏదైనా అత్యవసరంగా డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు లోన్ తీసుకోవడం, ఈఎంఐల రూపంలో తిరిగి చెల్లించడం చాలా మంది చేసే ఈజీ పనే కావొచ్చు. కానీ ఆ ఈఎంఐలను తిరిగి చెల్లించలేకపోతేనే అసలు సమస్య ఎదురవుతుంది. సరైన ఆర్థిక క్రమశిక్షణ లేని వారికి ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది. కొందరు వాయిదాలు తిరిగి చెల్లించడంలో తరుచుగా ఇబ్బందిపడుతుంటారు. ఒకవేళ సకాలంలో ఇఎంఐ చెల్లించలేకపోతే మీ సిబిల్ స్కోర్ బాగా తగ్గిపోతుంది. మూడు లేదా నాలుగు నెలల కంటే ఎక్కువ పరిస్థితి అలాగే కొనసాగితే.. లోన్ తీసుకుని ఇఎంఐ చెల్లించని వారిని బ్యాంకులు డీఫాల్టర్స్‌గా తేలుస్తాయి. అదేకానీ జరిగితే ఆ తరువాత ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
లోన్ తీసుకుని తిరిగి చెల్లించకుండా డిఫాల్టర్‌గా తేలితే.. అది వారి క్రెడిట్ స్కోర్‌పై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తుంది. అంతేకాకుండా వారిపై బ్యాంకులకు ఉండే విశ్వసనీయత కూడా సన్నగిల్లిపోతుంది. భవిష్యత్తులో మళ్లీ ఎప్పుడైనా కొత్త రుణాలు అవసరమైనప్పుడు లోన్ శాంక్షన్ అవ్వదు. పైగా బ్యాంకులకు ఎగ్గొట్టిన రుణం మొత్తాన్ని బట్టి డీఫాల్టర్ అనే రిమార్క్ కూడా మారుతూ ఉంటుంది.
ఇలాంటప్పుడే చాలామందికి ఒక సందేహం వస్తుంది. ఒక వ్యక్తి గతంలో ఏదేనా లోన్ తీసుకుని తిరిగి చెల్లించడంలో విఫలమై డీఫాల్టర్ గా మిగిలిపోతే.. ఆ వ్యక్తి మరోసారి లోన్ కోసం అప్లై చేసుకోవచ్చా ? ఒకవేళ రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే వస్తుందా అనే అనుమానం చాలామందిని వేధిస్తుంటుంది. అలాంటి సందేహాలకు సమాధానం ఇచ్చే ప్రయత్నమే ఈ వార్తా కథనం.
ఒకసారి మీరు డిఫాల్టర్ అయిన తర్వాత మళ్లీ రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చా ?
ఔను ఒకసారి డీఫాల్టర్ గా మారిన వాళ్లు లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.. లోన్ పొందనూ వచ్చు. కాకపోతే అంతకంటే ముందుగా తప్పనిసరిగా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అవేంటంటే..
సిబిల్ స్కోర్ :
ఎప్పుడైతే మీరు మీ లోన్ రీపేమెంట్ చేయకుండా బ్యాంకుకి లోన్ ఎగ్గొట్టారో.. అప్పుడే మీరు డీఫాల్టర్‌గా మారడమే కాదు... క్రెడిట్ హిస్టరీ పరంగా ఎంతో నష్టపోతారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఏదైనా ఒక బ్యాంకుకి లోన్ రీపేమెంట్ పెండింగ్‌లో ఉన్నంత కాలం మీ సిబిల్ స్కోర్ చాలా దారుణంగా పడిపోతుంది. ఆ సిబిల్ స్కోర్ చూడటంతోనే మీ లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. మీ సిబిల్ స్కోర్ పెరగాలి అంటే.. మీకు పెండింగ్‌లో ఉన్న ఆ లోన్ చెల్లించాల్సిందే.
లోన్ సైజ్ :
లోన్ తీసుకుని తిరిగి చెల్లించకుండా డీఫాల్ట్ అయిన వారు భవిష్యత్తులో లోన్ కోసం దరఖాస్తు చేసినప్పుడు.. మీరు కోరే మొత్తం మీ ఆదాయ వనరులను మించినట్టయితే బ్యాంకులు ఆ లోన్ అప్లికేషన్‌ని తిరస్కరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అలా కాకుండా మీరు చాలా తక్కువ మొత్తం కోసం దరఖాస్తు చేసుకున్నట్టయితే.. అప్పుడు బ్యాంకులు మీకు డీఫాల్ట్ హిస్టరీ ఉన్నప్పటికీ లోన్ మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా నిర్ణయం పూర్తిగా బ్యాంకుల విచక్షణాధికారాలకు వదిలేయాల్సి ఉంటుంది.
స్థిరమైన ఆదాయం : లోన్ డిఫాల్ట్ చరిత్ర ఉన్నప్పటికీ.. మీకు ఎక్కువ మోతాదులో వేతనం లేదా ఒక స్థిరమైన సంపాదన మార్గాలు ఉన్నట్టయితే.. బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌కి ఓకే చెప్పే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి : Hyundai Cars Discount Mela: కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. హ్యూందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్
పెండింగ్ లోన్స్ క్లియర్ చేయడం : ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ తిరస్కరించకుండా, షరతులు లేకుండా లోన్ మంజూరు చేయాలి అనుకున్నట్టయితే, అప్పుడు మీరు మీ సిబిల్ స్కోర్ పెంచుకోవడం తప్ప మీకు వేరే మార్గం లేదు. సిబిల్ స్కోర్ పెంచుకోవాలి అంటే.. మీ పాత లోన్ క్లియర్ చేయాల్సిందే అనే విషయం మర్చిపోవద్దు.
ఇది కూడా చదవండి : Fuel Credit Cards Benefits: అసలు ఫ్యూయెల్ క్రెడిట్ కార్డులతో లాభం ఉంటుందా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి