Aadhaar Card Updates: ఆధార్‌ కార్డులో అడ్రస్‌ మార్చుకోవాలా..? ఫ్రీగా ఇలా మార్చేసుకోండి..!

Aadhaar Card Address Change Online: ఆధార్‌ కార్డులో అడ్రస్‌ మార్చుకునేందుకు ఇబ్బంది పడుతున్నారా..? నో టెన్షన్‌. సింపుల్‌గా ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చు. అది కూడా ఫ్రీగా. ఎలాగో ఇక్కడ తెలుసుకోండి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2024, 03:11 PM IST
Aadhaar Card Updates: ఆధార్‌ కార్డులో అడ్రస్‌ మార్చుకోవాలా..? ఫ్రీగా ఇలా మార్చేసుకోండి..!

Aadhaar Card Address Change Online: ప్రస్తుతం ఆధార్‌ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే.. సరిచేసుకునేందుకు మీ సేవ కేంద్రాల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతున్నారు. వ్యక్తి పేరు, చిరునామా, పుట్టిన తేదీ, లింగం, ఫోటో వంటి సమాచారంలో ఏదైనా చిన్న తప్పు ఉన్నా.. ఛేంజ్ చేసుకునేందుకు మీ సేవలో ఒక్కొసారి గంటలు గంటలు వేచి చూడాల్సి ఉంటుంది. అన్ని ప్రభుత్వం పథకాలతోపాటు ప్రతి ఆర్థిక లావాదేవీకి ఆధార్ కార్డు తప్పనిసరి కావడంతో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఇల్లు మారినప్పుడు ఆధార్‌లో కూడా అడ్రస్ అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మీ సేవ, ఆధార్ కేంద్రాల చుట్టు తిరగాల్సిన పనిలేదు. ఇంట్లో కూర్చొని సింపుల్‌గా ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవచ్చు. 

అడ్రస్ ఇలా మార్చుకోండి..

==> ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ కి వెళ్లండి 
==> హోమ్ పేజీలో "మై ఆధార్" అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
==> “అప్‌డేట్ యువర్ ఆధార్” అనే ఆప్షన్‌ ఎంపిక చేసుకోండి. 
==> మీ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి.
==> "కంటిన్యూ" అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
==> "అప్‌డేట్ అడ్రస్"పై క్లిక్ చేయండి.
==> మీ కొత్త అడ్రస్‌ను ఎంటర్ చేయండి.
==> అవసరమైన డాక్యుమెంట్స్‌ను అప్‌లోడ్‌ చేయండి.
==> "ప్రొసీడ్" క్లిక్ చేయండి.
==> ఓటీపీని ఎంటర్ చేసి.. సబ్మిట్‌ బటన్‌పై క్లిక్ చేయండి.

ఆ తరువాత మీ ఆధార్ కార్డ్ అప్‌డేట్ రిక్వెస్ట్‌ను UIDAI పరిశీలిస్తుంది. 15 నుంచి 30 రోజులలోపు అప్‌డేట్ అయిన తరువాత ఆధార్ కార్డ్‌ అడ్రస్‌కు పంపిస్తారు. ఓటరు ఐడీ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్, బ్యాంక్ స్టేట్‌మెంట్, విద్యుత్ బిల్లు, టెలిఫోన్ బిల్లు వంటి వాటిలో ఏదో ఒకటి అప్‌లోడ్ చేసి అడ్రస్ అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే కాకుండా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రాన్ని సందర్శించి కూడా అడ్రస్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో అడ్రస్‌ను మార్చుకునేందుకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.  

Also Read: KTR Republic Day: గవర్నర్‌ తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం.. బీజేపీ, కాంగ్రెస్‌ ఫెవికాల్‌ బంధమంటూ వ్యాఖ్యలు

Also Read: Republic Day: విషాదం నింపిన 'గణతంత్ర వేడుకలు'.. జెండా కర్రకు విద్యుత్‌ తీగలు తగిలి ఇద్దరు దుర్మరణం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News