Honda Elevate Car Review: కొత్తగా లాంచ్ అయిన హోండా ఎలివేట్ ఖచ్చితంగా హోండా కార్స్ ఇండియా నుండి వచ్చిన సూపర్ ప్రోడక్ట్ అనే చెప్పొచ్చు అంటున్నారు ఆటో ఎక్స్‌పర్ట్స్. మంచి ఫీచర్స్, ఫిట్టింగ్ ఉన్న కాంపాక్ట్ ఎస్‌యూవీ కారు ఇది. అయితే, హోండా ఎలివేట్‌కి పోటీగా ఉన్న కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్ల విషయంలో ఉన్న కొన్ని మోడర్న్ ఫీచర్స్ ఇందులో లేవు అని కూడా వాళ్లే చెబుతున్నారు. హోండా ఎలివేట్‌లో డీజిల్ ఇంజన్ ఆప్షన్ లేదు. బహుశా ఇండియా డీజిల్ ఇంజన్స్‌పై ఆంక్షలు కఠినతరం అవుతుండటం హోండా తీసుకున్న ఈ నిర్ణయానికి ఒక కారణం అయి ఉండొచ్చు.
అలాగే హోండా ఎలివేట్ కారులో అన్ని హైపర్‌బ్రిడ్ కార్ల తరహాలో పవర్‌ట్రెయిన్ ఫీచర్ కూడా లేదు. పవర్ ట్రెయిన్ అంటే మీ కారు వేగంగా పరుగెత్తే శక్తిని ఇంజన్ నుంచి నాలుగు వీల్స్‌కి సరిసమానంగా అందించడం అన్నమాట. ప్రస్తుతం ఇండియాలో ఈ హైబ్రిడ్ సెగ్మెంట్‌లో కార్లకు భారీ ఆధరణ లభిస్తోంది. కానీ హోండా ఎలివేట్‌లో అదే లోపిస్తోంది అని తెలుస్తోంది. 458 లీటర్స్ బూట్‌స్పేస్ ఉంది. ఈ సెగ్మెంట్‌లో లభించే బెస్ట్ బూట్‌స్పేస్ లో ఇది కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు.
హోండా ఎలివేట్ మిడ్‌సైజ్ SUV కారు ఇంజన్ విషయానికొస్తే.. 1.5 NA పెట్రోల్ ఇంజన్‌తో వస్తోన్న ఈ కారులో స్పీడ్ మాన్వల్ గేర్ సిస్టం ఆప్షన్ అలాగే 7 స్పీడ్ సీవీటీ ఆటోమేటిక్ గేర్ ఆప్షన్ ఉంది. 10.25 అంగుళాల ఇన్ఫోటెయిన్మెంట్ టచ్ స్క్రీన్ ఉంది. అలాగే ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కారుప్లే కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి. వెనుక భాగంలో రెండు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్స్‌తో పాటు ఏసీ వెంట్స్, 12V పవర్ సాకెట్ ఉన్నాయి.
ఇది కూడా చదవండి : Defective ITR: డిఫెక్టివ్ ఐటిఆర్ అంటే ఏంటి ? దీంతో నష్టమా ?
ఇక హోండా ఎలివేట్ మిడ్‌సైజ్ SUV కారు ధరల విషయానికొస్తే.. ఈ ఎస్‌యూవీ కారు బేసిక్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 10 లక్షలు లేదా 12 లక్షల రూపాయల నుంచి టాప్ ఎండ్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 15 లక్షల నుండి రూ. 17 లక్షల వరకు ఉంటుంది అని అంచనాలు వేస్తున్నారు. ఆగస్టులో హోండా ఎలివేట్ మిడ్‌సైజ్ SUV కారు షోరూంలలోకి రానుండగా సెప్టెంబర్ నుంచి డెలివరీ అవనున్నాయి. జులై 3వ తేదీ నుంచే హోండా ఎలివేట్ కారు బుకింగ్స్ సైతం షురూ అయ్యాయి.
ఇది కూడా చదవండి : Discontinued Cars & SUVs In 2023: 2023 నుంచి తయారీ ఆగిపోయిన కార్ల జాబితా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి