Home Loan Rates: హోమ్‌ లోన్స్‌ గుడ్‌ న్యూస్‌..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్‌..

Home Loan Rates: హోమ్‌ లోన్స్‌ తీసుకువారికి త్వరలోనే రిజర్వ్ బ్యాంక్‌ అందించబోతోంది. త్వరలోనే వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయని ప్రొఫెసర్ రాహుల్ మెహ్రోత్రా తెలిపారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 9, 2024, 04:51 PM IST
Home Loan Rates: హోమ్‌ లోన్స్‌ గుడ్‌ న్యూస్‌..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్‌..

Home Loan Rates: హోమ్‌ లోన్స్‌ తీసుకున్న వారికి 2022-23 సంవత్సరం చాలా భారమైంది. గత రెండేళ్లలో హోమ్‌ లోన్స్‌ EMIలు సాధారణం కంటే 20 శాతం ఎక్కువ పెరిగిన సంగతి తెలిసిందే..ఈ 2024 సంవత్సరం హోమ్‌ లోన్స్‌కి చాలా ప్రత్యేకమైనది. ఈ సంవత్సరం కేంద్రం వడ్డీ రేట్లను 0.5% నుంచి 1.25%కి తగ్గించే అవకాశం ఉంది. ఈ 2024లో తప్పకుండా వడ్డీ రేట్లు తగ్గే ఛాన్స్‌ ఉందని ఆర్థిక నిపుణులు కూడా తెలుపుతున్నారు. అయితే ఈ సంవత్సరం హోమ్‌ లోన్స్‌పై ఎంత మొత్తంలో వడ్డీ రేట్లు తగ్గుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

2024 సంవత్సరంలో రెపో రేటు 6.50% ఉండడం వల్ల మార్కెట్ స్థిరంగా ఉంది. ఈ సంవత్సరం మధ్యకాలంలో 6.25 శాతానికి తగ్గే అవకాశం ఉందని బోస్టన్‌లోని ఆర్కిటెక్చర్ సంస్థ RMA ఆర్కిటెక్ట్స్ వ్యవస్థాపక ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాహుల్ మెహ్రోత్రా ఎకనామిక్ టైమ్స్‌ ద్వారా తెలిపారు. 

ప్రపంచ ద్రవ్యోల్బణం పేరగడం కారణంగా ఆర్‌బిఐ కూడా మే 2022 నుంచి ఫిబ్రవరి 2023 వరకు రెపో రేటును నిరంతరం పెంచుతూ వచ్చింది. దీని కారణంగా హోమ్‌ లోన్స్‌ తీసుకున్న వారికి అదనంగా రుణ భారం పడింది.  2009 నుంచి ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గినప్పటికీ..సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించలేకపోయింది. అయితే ఈ సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య కమిటీ సమావేశంలో వడ్డీ రేట్లను తగ్గించే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..

సెంట్రల్ బ్యాంక్ రెపో రేటులో మార్పులు రావడం కారణంగా గృహ రుణాలపై ఎఫెక్ట్‌ పడకుండా కార్‌ లోన్స్‌, ఇతర లోన్స్‌పై ప్రభావం పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు రెపో రేటు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా రిజర్వ్ బ్యాంక్‌పై ప్రభావం పడుతుంది. అలాగే ద్రవ్య ప్రవాహం కూడా తగ్గుతుంది. అంతేకాకుండా రుణాలు సంబంధించిన వడ్డీలు కూడా పెరుగుతాయి. 

Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News