Recruitment Growth In India: 2023 ముగిసిపోయింది. కొత్త సంవత్సరం 2024 కూడా మొదలైపోయింది. ఇంకా ఉద్యోగం రాలేదని బాధపడే చాలా మంది నిరుద్యోగులకు శుభవార్త. ఈ ఏడాది మార్కెట్‌లో భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. డిసెంబర్ 2023లో ఉద్యోగ నియామకంలో 2 శాతం పెరుగుదల ఉండగా.. 2024లో నియామకాల్లో 8.3 శాతం వృద్ధి ఉండవచ్చని ఫౌండ్‌ఇట్ వార్షిక ట్రెండ్స్ నివేదిక అంచనా వేస్తోంది. ఇందులో బెంగళూరులోనే అత్యధికంగా 11 శాతం నియామకాలు జరుగుతాయని వెల్లడించింది. ఈ సంవత్సరం గరిష్ట నియామకాలు తయారీ, BFSE, ఆటోమోటివ్, రిటైల్, ట్రావెల్ టూరిజం రంగాల్లో నియామకాలు ఉండే అవకాశం ఉందని నివేదికలో పేర్కొంది.
ఫౌండ్‌ఇట్ ఇన్‌సైడ్ ట్రాకర్ (ఎఫ్‌ఐటీ) నుంచి వచ్చిన డేటా ప్రకారం.. 2022లో కంటే 2023 సంవత్సరంలో 5 శాతం తక్కువగా ఉద్యోగ నియామకాలు జరిగాయి. అయితే చివరి నెల అంటే డిసెంబర్ 2023లో మాత్రమే 2 శాతం పెరుగుదల ఉంది. అయితే కొత్త సంవత్సరంలో నియామక ప్రక్రియ వేగంగా జరిగే అవకాశం ఉంది. 2022 మధ్యకాలం నుంచి గతంలో ఉన్నదాని కంటే భిన్నంగా 2023 చివరి నాటికి ఆర్థిక వ్యవస్థ ఒక మలుపు తిరిగిందని నివేదిక వెల్లడించింది. అట్రిషన్, హైరింగ్ రేట్లు రెండూ స్థిరీకరించినట్లు పేర్కొంది.
గతేడాదిలో కొన్ని రంగాలు చెప్పుకోదగ్గ బలాన్ని, వృద్ధిని కనబరిచాయని తెలిపింది. అయితే సవాళ్లతో కూడిన వాతావరణంలో ఇది సక్సెస్ అయిందని పేర్కొంది. సముద్ర, షిప్పింగ్ పరిశ్రమలో నియామకాలలో 28 శాతం పెరుగుదల కనిపించిందని నివేదికలో తెలిపింది. రిటైల్, ట్రావెల్, టూరిజం 25 శాతం వృద్ధిని సాధించగా.. ప్రకటనలు, మార్కెట్ వనరులు, పబ్లిక్ రిలేషన్స్ రంగాలు 18 శాతం పెరిగాయని చెప్పింది.
జనవరి 2023 నుంచి డిసెంబర్ 2023 వరకు డేటాను విశ్లేషించింది. అభివృద్ధి చెందుతున్న టెక్నీకల్ రంగాల్లో టాలెంట్ ఉన్నవాళ్లకు డిమాండ్ ఉంటుందని తెలిపింది. ఐటీ నియామకాల్లో ఆరంభంలో కొంతం ఆలస్యమైనా.. AI/ML, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ నిపుణులకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేసింది.
Also Read: Ayodhya Rammandir Features: అయోధ్య రామమందిరం ఎలా ఉంటుంది, ప్రత్యేకతలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి