Lic investments in Adani: అదానీ గ్రూప్‌లో ఎల్ఐసీ పెట్టుబడి ప్రతికూల ప్రభావం చూపిస్తోందా, అసలేం జరుగుతోంది

Lic investments in Adani: అదానీ గ్రూప్ షేర్ల పతనంతో ఎల్ఐసీ మరోసారి చర్చనీయాంశమౌతోంది. హిండెన్‌బర్గ్ నివేదిక ప్రభావంతో అదానీ సామ్రాజ్యం పతనం ప్రారంభం కావడంతో ఎల్ఐసీపై ప్రశ్నలు విన్పిస్తున్నాయి. అదానీ షేర్ల పతనం ఎల్ఐసీపై దుష్ప్రభావం చూపిస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 24, 2023, 02:31 PM IST
Lic investments in Adani: అదానీ గ్రూప్‌లో ఎల్ఐసీ పెట్టుబడి ప్రతికూల ప్రభావం చూపిస్తోందా, అసలేం జరుగుతోంది

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక ప్రభావం గౌతమ్ అదానీ సంపదపై, అతని కంపెనీలో పెట్టుబడులు పెట్టిన సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. దేశంలోని అతిపెద్ద భీమా కంపెనీ ఎల్ఐసీపై కూడా ఇదే విధంగా నెగెటివ్ ప్రభావం చూపిస్తోంది. 

అదానీ గ్రూప్ కంపెనీల్లో ఎల్ఐసీ పెట్టుబడులు ఫిబ్రవరి 22, 2022 నాటికి 33,632 కోట్ల రూపాయలుగా ఉంది. స్టాక్ ఎక్స్చేంజ్ వద్ద ఉన్న ప్రాధమిక సమాచారం ప్రకారం వివరాలివి. 2023 జనవరి 27 నాటికి అదానీ గ్రూప్‌లో ఎల్ఐసీ పెట్టుబడుల విలువ 56.142 కోట్లు. మొత్తం 7 అదానీ కంపెనీల్లో ఎల్ఐసీ 30, 127 కోట్లు పెట్టుబడి పెట్టింది. 2023 ఫిబ్రవరి 22 నాటికి ఎల్ఐసీ పెట్టుబడుల విలువ 33, 632 కోట్లకు పడిపోయింది. 

డిసెంబర్ నెల షేర్ హోల్డింగ్ డేటా ప్రకారం అదానీ గ్రూప్‌లో ఎల్ఐసీ పెట్టుబడుల విలువ 62, 550 కోట్లుగా ఉంది. జనవరి 27 నాటికి ఆ విలువలో 6,408 కోట్లు తగ్గిపోయింది. అంటే 2023లో జనవరి 1 నుంచి జనవరి 24 మధ్యకాలంలో ఎల్ఐసీ తన వాటాలో పది శాతం అమ్మేసిందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఒకవేళ పైన పేర్కొన్న తేదీల్లో ఎల్ఐసీ అదానీ గ్రూప్ కంపెనీల్లో తన వాటా నుంచి 10 శాతం అమ్మేసిందనుకోవాలి. అయితే 22వ తేదీ ఫిబ్రవరి, 2023 నాటికి అదానీ గ్రూప్‌లో ఎల్ఐసీ పెట్టుబడి విలువ 33, 632 కోట్లగా ఉందని తేలింది. అంటే 10 శాతం తీసివేస్తే..ఫిబ్రవరి 22 నాటికి ఎల్ఐసీ పెట్టుబడులు 30,221 కోట్లు ఉంటాయి.

ఫిబ్రవిరి 23వ తేదీ అంటే నిన్న మద్యాహ్నం 12 గంటలకు అదానీ గ్రూప్‌లో ఎల్ఐసీ పెట్టుబడులు మరో 500 కోట్లు క్షీణించాయి. అంటే ఇప్పటికే నష్టపోయిన ఎల్ఐసీ పెట్టుబడుల్లో మరింత క్షీణత ఏర్పడింది. సెప్టెంబర్ 30, 2022 నాటికి ఎల్ఐసీ మొత్తం సంపద విలువ 41.66 లక్షల కోట్లు. ఎల్ఐసీ మొత్తం సంపదలో అదానీ గ్రూప్‌లో పెట్టిన పెట్టుబడి 1 శాతం కంటే తక్కువేనని ఎల్ఐసీ వాదిస్తోంది. కానీ జరిగిన, జరుగుతున్న నష్టాన్ని పట్టించుకోవడం లేదు. 

Also read: ITR Filing: ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా..? ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News