Todays Gold Rate: కొత్త ఏడాదిలో పెరుగుతున్న బంగారం ధర, దేశంలో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా

Todays Gold Rate: కొత్త ఏడాది వరుసగా రెండవరోజు కూడా బంగారం ధరల్లో పెరుగుదల కన్పిస్తోంది. ఇవాళ కూడా పసిడి ధర స్వల్పంగా పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 2, 2022, 06:46 AM IST
Todays Gold Rate: కొత్త ఏడాదిలో పెరుగుతున్న బంగారం ధర, దేశంలో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా

Todays Gold Rate: కొత్త ఏడాది వరుసగా రెండవరోజు కూడా బంగారం ధరల్లో పెరుగుదల కన్పిస్తోంది. ఇవాళ కూడా పసిడి ధర స్వల్పంగా పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

బులియన్ మార్కెట్‌‌లో బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. వివిధ దేశాల మధ్య భౌగోళిక పరిస్థితులు, కరోనా మహమ్మారి, ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం, డాలర్ విలువ, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు వంటివి బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే ఎప్పటికప్పుడు బంగారం ధరలు మారుతుంటాయి. ఒక్కోసారి పెరుగుతుంటే ఇంకోసారి తగ్గుతుంటాయి. పది గ్రాముల బంగారంపై ఇవాళ అంటే కొత్త ఏడాదిలో వరుసగా రెండవ రోజు 140 రూపాయల వరకూ పెరిగింది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం (Delhi Gold Price)10 గ్రాముల ధర 47 వేల 6 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 51 వేల 930 రూపాయలుగా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 150 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 150 రూపాయలుగా ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 590 అయితే..24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 730 రూపాయలుగా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 150 కాగా , 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 850 రూపాయలుంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 450 రూపాయలైతే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 590 రూపాయలుగా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 450 రూపాయలైతే, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 590 రూపాయలుగా ఉంది.  

ఇక తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో (Hyderabad Gold Price) 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 45 వేల 450 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 590 రూపాయలుగా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 450 రూపాయలైతే..24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 590 రూపాయలుగా ఉంది. 

Also read: FCRA Act: ఢిల్లీ ఐఐటీ సహా ఆ సంస్థలకు ఇక విదేశీ విరాళాలు లేవు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News