దేశవ్యాప్తంగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు, ఢిల్లీలో అత్యధిక ధర

Gold Price Today: బంగారం ప్రియులకు కాస్త ఊరటనిచ్చే విషయమిది. దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే కొత్తగా పెరుగుదల లేదు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 23, 2021, 07:09 AM IST
  • బంగారం ప్రియులకు ఊరట, స్థిరంగా ఉన్న బంగారం ధరలు
  • ఢిల్లీలో అత్యధికంగా పది గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర 47 వేల 890 రూపాయలు
  • అత్యల్పంగా హైదరాబాద్, బెంగళూరులో 45 వేల 790 రూపాయలు
 దేశవ్యాప్తంగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు, ఢిల్లీలో అత్యధిక ధర

Gold Price Today: బంగారం ప్రియులకు కాస్త ఊరటనిచ్చే విషయమిది. దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే కొత్తగా పెరుగుదల లేదు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

దేశీయంగా గానీ, ప్రపంచవ్యాప్తంగా గానీ బంగారం ధరలు(Gold Prices)పెరగడానికి చాలా కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, లభ్యత, కేంద్ర బ్యాంకుల్లో ఉన్న బంగారం నిల్వలు, డాలర్ ధర వంటివి చాలా ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే బంగారం ధర రోజూ మారుతుంటుంది. గత కొద్దిరోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర..రెండ్రోజులు వరుసగా తగ్గుముఖం పట్టింది. ఇవాళ బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరల్ని చూద్దాం. 

దేశంలో అన్నింటికంటే ఎక్కువగా రాజధాని ఢిల్లీలో ఉంది. ఢిల్లీలో(Delhi Gold Price) 22 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర 47 వేల 890 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 52 వేల 240 రూపాయలుగా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర 48 వేల 280గా ఉంటే..24 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర 49 వేల 280 గా ఉంది. ఇక చెన్నై రాజధాని తమిళనాడులో మాత్రం బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. ఇక్కడ 22 క్యారెట్లు పది గ్రామలు బంగారం ధర 46 వేల 50 రూపాయలైతే.. 24 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర 50 వేల 240గా ఉంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర 45 వేల 740 రూపాయలు కాగా, 24 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర 49 వేల 900గా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో(Hyderabad Gold Price) 22 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర 45 వేల 740 కాగా, 24 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర 49 వేలుగా ఉంది. విజయవాడలో ఏ విధమైన మార్పు లేదు.  ఇక్కడ 22 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర 45 వేల 740 రూపాయలు కాగా, 24 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర 49 వేల 9 వందలుగా ఉంది.  ఇక విశాఖపట్నంలో 22 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర 45 వేల 740 అయితే..24 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర 49 వేల 9 వందలుగా ఉంది. 

Also read: వరుసగా రెండవరోజు స్వల్పంగా తగ్గిన బంగారం ధర, దేశవ్యాప్తంగా ఏ నగరంలో ఎంత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News