Todays Gold Rate: పెరిగిన బంగారం, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా

Todays Gold Rate: దేశీయంగా బంగారం ధర మరోసారి పెరిగింది. గత కొద్దిరోజులుగా స్వల్పంగా బంగారం ధర పెరుగుతూనే ఉంది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 22, 2022, 06:53 AM IST
 Todays Gold Rate: పెరిగిన బంగారం, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా

Todays Gold Rate: దేశీయంగా బంగారం ధర మరోసారి పెరిగింది. గత కొద్దిరోజులుగా స్వల్పంగా బంగారం ధర పెరుగుతూనే ఉంది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

బంగారం ధరల్లో గత కొద్దిరోజులుగా పెరుగుదల కన్పిస్తోంది. కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, డాలర్ విలువ, కరోనా మహమ్మారి, వివిద దేశాల మధ్య భౌతిక పరిస్థితులు, మార్కెట్ తీరు వంటి వాటి ప్రభావం బంగారం ధరలపై కచ్చితంగా ఉంటుంది. అందుకే బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. దేశవ్యాప్తంగా ఇవాళ బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం (Gold Price) 10 గ్రాముల ధర 47 వేల 8 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 52 వేల 100 రూపాయలుగా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 640 రూపాయలుండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 8 వందల రూపాయలుగా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 640 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 640 రూపాయలుగా ఉంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 2 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 9 వందలుగా ఉంది. ఇక కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 8 వందలుగా ఉంది. 

ఇక హైదరాబాద్ (Hyderabad Gold Price) నగరంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 650 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 8 వందలుగా ఉంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 650 రూపాయలైతే..24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 8 వందలుగా ఉంది. ఇక విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. 

Also read: Stock Market today: వారాంతంలోనూ స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు- సెన్సెక్స్​ 427 మైనస్​

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News