Gold Price today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు, వివిధ నగరాల్లో ఇవాళ్టి ధరలు

Gold Price today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్. దేశంలో బంగారం ధర మరోసారి తగ్గింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. అటు వెండి ధర కూడా గణనీయంగా తగ్గింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 16, 2021, 07:57 AM IST
 Gold Price today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు, వివిధ నగరాల్లో ఇవాళ్టి ధరలు

Gold Price today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్. దేశంలో బంగారం ధర మరోసారి తగ్గింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. అటు వెండి ధర కూడా గణనీయంగా తగ్గింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, డాలర్ విలువ, రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వాటిపై వర్తించే వడ్డీరేటు, ఇతర పరిస్థితుల కారణంగా బంగారం, వెండి ధరలు రోజురోజుకూ మారుతుంటాయి. నిన్న బంగారం ధర 380 రూపాయల వరకూ పెరగగా..ఇవాళ తగ్గింది. దేశవ్యాప్తంగా పది గ్రాముల బంగారం ధర 280  రూపాయలవరకూ తగ్గింది. కిలో వెండిపై 7 వందల రూపాయల వరకూ తగ్గింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు(Gold Price)ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 150 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 51 వేల 430 రూపాయలుగా ఉంది. కిలో వెండి 60 వేల 9 వందలుగా ఉంది. ఇక ఆర్దిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 46 వేల 910 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 910 రూపాయలుంది. ఇక కోల్‌కతా నగరంలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 100 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 8 వందలుంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 45 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 100 రూపాయలుంది. వెండి ధర 60 వేల 9 వందలుగా ఉంది. 

ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే ధర కొనసాగుతోంది. హైదరాబాద్ నగరంలో(Hyderabad Gold Price) 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 45 వేల రూపాయలుంటే..24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 100 రూపాయలుగా ఉంది. అటు విజయవాడలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 45 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 100 రూపాయలుగా ఉంది. వెండి(Silver Price) కూడా 64 వేల 6 వందల రూపాయలుంది. విశాఖపట్నంలో కూడా బంగారం ధర ఇలాగే కొనసాగుతోంది. 

Also read: Banks strike: నేటి నుంచి రెండు రోజులు బ్యాంకుల సమ్మె- కారణాలివే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News