Forbes Richest List 2024: ఫోర్బ్స్ ప్రపంచ ధనవంతుల్లో ముకేశ్‌కు స్థానం, ఇండియా నుంచి 200 మంది

Forbes Richest List 2024: ప్రపంచ ధనవంతుల జాబితా విడుదలైంది. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ మేగజైన్ విడుదల చేసే జాబితాలో భారత వ్యాపార దిగ్గజానికి చోటుదక్కింది. ప్రపంచంలోని టాప్ 10 కుబేరుల్లో ఈయన ఒకడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 4, 2024, 02:44 PM IST
Forbes Richest List 2024: ఫోర్బ్స్ ప్రపంచ ధనవంతుల్లో ముకేశ్‌కు స్థానం, ఇండియా నుంచి 200 మంది

Forbes Richest List 2024: ప్రపంచ కుబేరుల జాబితా 2024ను ఫోర్బ్స్ మేగజైన్ విడుదల చేసింది.  ఫోర్బ్స్ విడుదల చేసిన టాప్ 10 ధనవంతుల్లో ఇండియాకు చెందిన ముకేశ్ అంబానీ స్థానం సంపాదించారు. మొత్తం జాబితాలో అయితే భారతదేశానికి చెందిన బిలియనీర్లు 200 ఉన్నారు. ఫోర్బ్స్ మేగజైన్ ప్రతి ఏటా ప్రపంచ ధనవంతులు, శక్తివంతమైన వ్యక్తుల జాబితా విడుదల చేస్తుంటుంది. 

ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా 2024 ప్రకారం ఇండియా నుంచి కొత్తగా 25 మంది కుబేరులు చేరారు. గత ఏడాది మొత్తం భారతదేశ బిలియనీర్లు ఈ జాబితాలో 169 ఉంటే ఈసారి 200కు చేరింది. మొత్తం భారతీయల సంపద లెక్కిస్తే ఏకంగా 954 బిలియన్ డాలర్లు ఉంది. ఇది గత ఏడాది తేలిన 675 బిలియన్ డాలర్ల కంటే 41 శాతం అధికం. ఇండియాలో ధనవంతుల జాబితాను పరిశీలిస్తే  రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మొదటి స్థానంలోనూ, అదానీ గ్రూప్‌కు చెందిన గౌతమ్ అదానీ రెండవ స్థానంలోనూ, శివనాడార్ మూడో స్థానంలోనూ ఉన్నారు. 

టాప్ 10 భారతదేశ కోటీశ్వరులు

ముకేశ్ అంబానీ 116 బిలియన్ డాలర్లు, గౌతమ్ అదానీ 84 బిలియన్ డాలర్లు, శివ నాడార్ 36.9 బిలియన్ డాలర్లు, సావిత్రి జిందాల్ 33.5 బిలియన్ డాలర్లు, దిలీఫ్ సాంఘ్వి 26.7 బిలియన్ డాలర్లు, సైరస్ పూణావాలా 21.3 బిలియన్ డాలర్లు, కుషాల్ పాల్ సింఘ్ 20.9 బిలియన్ డాలర్లు, కుమార్ బిర్లా 19.7 బిలియన్ డాలర్లు, రాధాకిషన్ దామని 17.6 బిలియన్ డాలర్లు, లక్ష్మి మిట్టల్ 16.4 బిలియన్ డాలర్లు సంపద కలిగి ఉన్నారు. 

ప్రపంచంలోని టాప్ 10 ధనికుల్లో ఇండియాకు చెందిన ముకేశ్ అంబానీ ఒక్కరే 9వ స్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్ మేగజైన్ ప్రపంచవ్యాప్తంగా 2,781 మంది బిలియనీర్లు గుర్తించింది. ఈ సంఖ్య గత ఏడాది కంటే 141 ఎక్కువ. మొత్తం అందరి సంపద కలిపితే 14.2 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. 

ఇక ఇండియా నుంచి ఈసారి ఫోర్బ్స్ జాబితాలో 200 మంది బిలియనీర్లు ఉన్నారు. ఇండియా మూడో స్థానంలో నిలిచింది. ఫోర్బ్స్ జాబితా 2024లో మొదటి స్థానంలో 233 బిలియన్ డాలర్లతో బెర్నార్డ్ ఆర్నాల్ట్ కుటుంబం ఉంది. రెండవ స్థానంలో  195 బిలియన్ డాలర్లతో ఎలాన్ మస్క్ ఉన్నారు. ఇక మూడో స్థానంలో 194 బిలియన్ డాలర్లతో జెఫ్ బెజోస్ ఉన్నారు. మార్క్ జుకర్‌బర్గ్ 177 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. 114 బిలియన్ డాలర్లతో లారీ ఎల్లిసన్ ఐదవ స్థానంలో, 133 బిలియన్ డాలర్లతో వారెన్ బఫెట్ ఆరవ స్థానంలో ఉన్నారు. 128 బిలియన్ డాలర్లతో బిల్‌గేట్స్ 7వ స్థానంలో, 121 బిలియన్ డాలర్లతో స్టీవ్ బాల్మర్ 8వ స్థానంలో నిలిచారు. ఇక ముకేశ్ అంబానీ 116 బిలియన్ డాలర్లతో 9వ స్థానంలో ఉంటే, 114 బిలియన్ డాలర్లతో లారీ పేజ్ పదో స్థానంలో ఉన్నారు. 

Also read: Pan-Aadhaar Link: పాన్‌కార్డు ఆధార్ లింక్ ఎవరికి అవసరం లేదో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News