OPPO Reno6 5G: ఒప్పొ రెనో6 ఫోన్​పై రూ.22,210 వరకు డిస్కౌంట్​- పూర్తి వివరాలివే!

OPPO Reno6 5G: ఒప్పొ రెనో6 స్మార్ట్​ఫోన్​పై ఫ్లిప్​కార్ట్​ భారీ డిస్కౌంట్ ఇస్తోంది. స్పెషల్ ఆఫర్​లో భాగంగా రూ.22,210 వరకు డిస్కౌంట్​ ఇస్తోంది. ఈ ఆఫర్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 3, 2022, 11:50 AM IST
  • ఫ్లిప్​కార్ట్​లో స్మార్ట్​ఫోన్​లపై భారీ ఆఫర్లు
  • బడ్జెట్ ధరకే 5జీ ప్రీమియం ఫోన్లు
  • రెనో 6పై రూ.22,210 వరకు డిస్కౌంట్​!
OPPO Reno6 5G: ఒప్పొ రెనో6 ఫోన్​పై రూ.22,210 వరకు డిస్కౌంట్​- పూర్తి వివరాలివే!

OPPO Reno6 5G: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్​కార్ట్​ స్మార్ట్​ఫోన్లపై బంపర్ ఆఫర్స్ ప్రకటించింది. ఒప్పొ ప్రీమియం స్మార్ట్​ఫోన్ రెనో6 5జీ స్మార్ట్​ఫోన్​పై క్రెజీ ఆఫర్​ ప్రకటించింది. రూ.35,900 విలువగల ఈ ఫోన్​ను రూ.13,690కు కొనుగోలు చేసే ఆఫర్​ను తీసుకొచ్చింది.

ఆఫర్​ వివరాలు..

ఒప్పొ రెనో6 5జీ మోడల్ మార్కెట్ ధర ఫ్లిప్​కార్ట్​లో రూ.35,990గా ఉంది. అయితే దీనిపై ఫ్లిప్​కార్ట్​ 16 శాతం డిస్కౌంట్​ ఇస్తోంది. అంటే ఈ ఫోన్​పై  రూ.5,910 వరకు తగ్గింపు లభిస్తుంది. దీనితో ఫోన్ ధర రూ.29,990కు తగ్గుతుంది.

ఇదే కాకుండా ఫ్లిప్​కార్ట్ యాక్సిస్​ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఈ ఫోన్​ను కొనుగోలు చేస్తే తక్షణం 5 శాతం డిస్కౌంట్ లభించనుంది. అంటే దాదాపు రూ.1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. అప్పుడు ఈ ఫోన్​ను రూ.28,490కు  కొనుగోలు చేసే వీలుంది.

ఇక ఎక్స్ఛేంజ్​ ఆఫర్ ద్వారా ఈ స్మార్ట్​ఫోన్పై మరింత డిస్కౌంట్ పొందే వీలుంది. పాత ఫోన్​ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.14,800 వరకు తగ్గింపు ఇస్తోంది ఫ్లిప్​కార్ట్​. ఎక్స్ఛేంజ్ చేసే ఫోన్ కండీషన్​ను బట్టి ఈ ఎక్స్ఛేంజ్​ విలువల ఆధారపడి ఉంటుంది.

ఒకవేళ మీరు ఎక్స్ఛేంజ్ చేసే స్మార్ట్​ఫోన్​కు రూ.14,800 విలువ లభిస్తే.. రెనో6ను కేవలం రూ.13,690కు సొంతం చేసుకోవచ్చు.

రెనో 6 5జీ ఫీచర్లు..

  • 6.43 అంగుళాల డిస్​ప్లే (ఫుల్​ హెచ్​డ ప్ల్​)
  • 5జీ సపోర్ట్​
  • మీడియాటెక్​ డెమెన్సిటీ 900 ప్రాసెసర్​
  • 8 జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజ్​
  • 64 ఎంపీ మెయిన్​ కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్​ కెమెరా సెటప్​ (64ఎంపీ+8ఎంపీ+2ఎంపీ)
  • సెల్ఫీ కెమెరా 32 మెగా పిక్సెల్​
  • 4,300 ఎంఏహెచ్ బ్యాటరీ (65 వాట్స్​ సుపర్​ వూక్ 2.0 ఛార్జింగ్

Also read: Apple Event 2022: యాపిల్ ఈవెంట్​ తేదీ ఫిక్స్​- అదే రోజు ఐఫోన్ ఎస్​ఈ 3 విడుదల!

Also read: Amazon LG Window AC: అమెజాన్ బంపర్ ఆఫర్.. LG విండో ఏసీపై 51 శాతం డిస్కౌంట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News