Flipkart Electronics Sale: రూ.18,990 విలువ గల ఒప్పొ ఏ53ఎస్​ 5జీ ఫోన్ కేవలం రూ.540కే!

Flipkart Electronics Sale: ఫ్లిప్​కార్ట్​లో స్మార్ట్​ఫోన్లపై అదిరే ఆఫర్లు ఇస్తోంది. ముఖ్యంగా ఓ మొబైల్​ను కేవలం రూ.540కే సొంతం చేసుకునే వీలు కల్పిస్తోంది. మరి ఈ ఆఫర్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 29, 2022, 07:41 PM IST
  • ఫ్లిప్​కార్ట్​లో అదిరే ఆఫర్లు
  • ఎలక్ట్రానిక్స్​ సేల్​లో మొబైల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు
  • ఒప్పో స్మార్ట్​ఫోన్ కేవలం రూ.540కే!
Flipkart Electronics Sale: రూ.18,990 విలువ గల ఒప్పొ ఏ53ఎస్​ 5జీ ఫోన్ కేవలం రూ.540కే!

Flipkart Electronics Sale: ప్రముఖ ఈ-కామర్స్​ దిగ్గజం ఫ్లిప్​కార్ట్​లో.. ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ సేల్​ నడుస్తోంది. జనవరి 27న ఈ సేల్​ ప్రారంభమైంది. ఈ నెల 31తో సేల్​ ముగియనుంది. ఈ సేల్​లో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రానిక్స్​పై సూపర్​ ఆఫర్లు ఇస్తోంది. మఖ్యంగా స్మార్ట్​ఫోన్లపై అదిరే డిస్కౌంట్లు (Flipkart offers on Mobile Phones) ఇస్తోంది ఫ్లిప్​కార్ట్​.

ఫోన్లపై ఆఫర్లు ఇలా..

ఈ సేల్​లో ఓ బంపర్ ఆఫర్​ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అదే ఒప్పొ ఏ53ఎస్​ 5జీ మొబైల్​.

ఈ ఫోన్​ అసలు ధర రూ.18,990 దీనిని ఈ స్పెషల్​ సేల్​లో కేవలం రూ.540కే సొంతం చేసుకోవచ్చు. షాకింగ్​గా ఉంది కదూ. మరి అంత తక్కువ ధరకు.. ఏ53ఎస్ 5జీ మొబైల్​ను ఎలా కొనొచ్చు అనేది ఇప్పుడు వివరంగా (Flipkart Offer on Oppo A53s 5G) తెలుసుకుందాం.

ఆఫర్​ పూర్తి వివరాలు..

ఒప్పొ ఏ53ఎస్​ 5జీ మొబైల్ 8 జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజ్​ వేరియంట్ ధర మార్కెట్లో రూ.18,990గా ఉంది. ఈ ఫోన్​పై ప్రస్తుత సేల్​లో భాగంగా ఫ్లిప్​కార్ట్ 15 శాతం డిస్కౌంట్​ ఇస్తోంది. అంటే.. ఈ ఫోన్ ధర రూ.15,990కి (Oppo A53s 5G price) తగ్గుతుంది.

స్పెషల్ సేల్ డిస్కౌంట్​తోపాటు.. బ్యాంక్ ఆఫర్లు, ఇతర డిస్కౌట్లు కూడా ఇస్తోంది ఫ్లిప్​కార్ట్​. వీటితో పాటు.. ఎక్స్ఛేంజ్ ఆఫర్​ను కూడా ఇస్తోంది.

ఒప్పొ ఏ53ఎస్​ 5జీ కోసం.. పాత ఫోన్​ను ఎక్స్ఛేంజ్​ చేస్తే రూ.15,450 వరకు తగ్గింపును ఇస్తోంది ఫ్లిప్​కార్ట్​. అంటే ఫోన్​ ధర రూ.15,990 నుంచి రూ.540కి తగ్గుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సి విషయం ఏమిటంటే.. మీరు ఎక్స్ఛేంజ్​ చేసే ఫోన్​ మోడల్​, దాని కండీషన్​పైనే ఈ ఆఫర్ విలువ ఆధారపడి ఉంటుంది.

ఫ్లిప్​కార్ట్ స్పెషల్​ సేల్ డిస్కౌంట్​, ఎక్స్ఛేంజ్​ ఆఫర్ రెండు కలిపితే.. రూ.18,990 విలువైన ఫోన్​ను.. కేవలం రూ.540కే సొంతం చేసుకోవచ్చు.

ఒప్పొ ఏ53ఎస్​ 5జీ ఫీచర్లు (Oppo A53s 5G features)..

  • 6.52 అంగుళాల హెచ్​ ప్లస్​ డిస్​ప్లే
  • మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్​
  • వెనకవైపు మూడు కెమెరాలు (13 ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)
  • 9 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా
  • 5,000 ఎంఏహెచ్​ బ్యాటరీ

Also read: Todays Gold Price: తగ్గిన పసిడి ధర, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇవాళ్టి బంగారం ధరలు

Also read: How to get duplicate PAN card: మీ పాన్ కార్డ్ పోయిందా? డూప్లికేట్ పాన్ కార్డు పొందండిలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News