Flipkart Sales: సెప్టెంబర్ 23 నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం, 1 రూపాయి టోకెన్ అడ్వాన్స్‌తో ప్రీ బుకింగ్ సౌకర్యం

Flipkart Sales: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ మరి కొద్దిరోజుల్లో అంటే సెప్టెంబర్ 23న ప్రారంభం కానుంది. ఈ క్రమంలో డీల్స్, డిస్కౌంట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కస్టమర్లు 1 రూపాయి టోకెన్ అడ్వాన్స్‌తో ప్రీ బుక్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 19, 2022, 05:20 PM IST
Flipkart Sales: సెప్టెంబర్ 23 నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం, 1 రూపాయి టోకెన్ అడ్వాన్స్‌తో ప్రీ బుకింగ్ సౌకర్యం

Flipkart Sales: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ మరి కొద్దిరోజుల్లో అంటే సెప్టెంబర్ 23న ప్రారంభం కానుంది. ఈ క్రమంలో డీల్స్, డిస్కౌంట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కస్టమర్లు 1 రూపాయి టోకెన్ అడ్వాన్స్‌తో ప్రీ బుక్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. 

ఫ్లిప్‌కార్ట్ 9వ ఎడిషన్ ఫ్లాగ్‌షిప్‌గా ది బిగ్ బిలియన్ డేస్ ఫెస్టివల్ సేల్స్ సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 30 వరకూ కొనసాగనున్నాయి. లక్షలాదిమంది అమ్మకం దారులు, కిరాణా డెలివరీ భాగస్వాములు నాణ్యతతో కూడిన వస్తువుల్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఈ సందర్భంగా కస్టమర్లు నచ్చిన వస్తువుల్ని ప్రీ బుక్ చేసుకునే సౌకర్యం కూడా ఫ్లిప్‌కార్ట్ కల్పిస్తోంది. ఇందుకోసం కేవలం 1 రూపాయి టోకెన్ అడ్వాన్స్ చెల్లిస్తే చాలు. 90కు పైగా బ్రాండ్స్, 10 వేలకు పైగా ఉత్పత్తులు, 130 స్పెషల్ ఎడిషన్స్ కస్టమర్లకు అందుబాటులో ఉండనున్నాయి.

ధర ఎక్కువగా ఉండే ఖరీదైన ఉత్పత్తుల డెలివరీకు ఓపెన్ బాక్స్ డెలివరీ ఆప్షన్ కల్పిస్తోంది. బ్యాంక్ కార్డ్స్, యూపీఐ, ఈఎంఐల ద్వారా షాపింగ్ చేసే వెసులుబాటు ఉంది. దేశంలో ఫెస్టివ్ సీజన్ ప్రారంభం కానుండటంతో..పండుగ సీజన్ సందర్భంగా 11.8 బిలియన్ డాలర్ల వ్యాపారం జరగవచ్చని అంచనా ఉంది. గత ఏడాది కంటే 28 శాతం అధికంగా ఉండవచ్చని తెలుస్తోంది. 

తొలి వారంలో అమ్మకాలు 5.9 బిలియన్ డాలర్లుగా ఉండవచ్చని ఫ్లిప్‌కార్ట్ అంచనా. ఇది గత ఏడాది జరిగిన 4.8 బిలియన్ డాలర్ల కంటే 28 శాతం అధికం. 

Also read: Investment Tips: ఈ ఐదు చోట్ల పెట్టుబడితో ధనవంతులౌతారా, మంచి రిటర్న్స్ ఇచ్చే స్కీమ్స్ ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News