Air India Offers: ఫ్లైట్ టికెట్స్‌పై బంపర్ ఆఫర్.. ఎయిర్ ఇండియా రిపబ్లిక్ డే సేల్

Air India Republic Day sale: ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఫ్లైట్ టికెట్ ధరలపై భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్‌లో టికెట్లు బుక్ చేసుకుని.. దేశంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చని వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా.. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 22, 2023, 01:43 PM IST
  • ఫ్లైట్ టికెట్స్‌పై ఎయిర్ ఇండియా భారీ డిస్కౌంట్
  • రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా ఆఫర్
  • రేపటి వరకే లాస్ట్ డేట్
Air India Offers: ఫ్లైట్ టికెట్స్‌పై బంపర్ ఆఫర్.. ఎయిర్ ఇండియా రిపబ్లిక్ డే సేల్

Air India Republic Day sale: మరికొద్ది రోజుల్లో దేశం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతోంది. రిపబ్లిక్ డే సందర్భంగా పలు కంపెనీలు భారీ ఆఫర్లు అందిస్తున్నాయి. ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా కూడా మంచి ఆఫర్‌ను ప్రకటించింది. తక్కువ ధరలకే విమాన ప్రయాణ అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎయిర్ ఇండియా దేశీయ నెట్‌వర్క్‌లో విమాన టిక్కెట్లపై ఆఫర్లను ప్రారంభించింది.

ఎయిర్ ఇండియా అందిస్తున్న ఈ ఆఫర్ ఈ నెల 23వ తేదీ వరకు చెల్లుబాటు అవుతుంది. రేపటిలోపు టిక్కెట్లను బుక్ చేసుకున్న వారు.. తక్కువ ధరలకే ప్రయాణించవచ్చు. ఈ ఆఫర్ కింద టిక్కెట్లు ఎయిర్‌లైన్ అధీకృత ట్రావెల్ ఏజెంట్లతో సహా అన్ని ఎయిర్ ఇండియా బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్‌లో డొమెస్టిక్ విమానాల టిక్కెట్లను కంపెనీ తక్కువ ధరకే ప్రజలకు అందించనుంది.

ఈ తగ్గింపు టిక్కెట్లు ఎకానమీ క్లాస్‌లో అందుబాటులో ఉంటాయని.. ఫిబ్రవరి 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు దేశీయ నెట్‌వర్క్‌లో ప్రయాణానికి వర్తిస్తుందని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. రూ.1705 కంటే తక్కువ వన్ వే ఛార్జీల నుంచి ధర ప్రారంభమవుతుందని పేర్కొంది. 49 కంటే ఎక్కువ దేశీయ గమ్యస్థానాలకు ఈ ఆఫర్ కింద ప్రజలు తగ్గింపు ధరతో టికెట్లు బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది. 

ఎయిర్ ఇండియా ఆఫర్ ఇలా..

- ఢిల్లీ టు ముంబై- రూ.5.075
- చెన్నై నుంచి ఢిల్లీ- రూ.5,895
- బెంగళూరు నుంచి ముంబై- రూ.2,319
- ఢిల్లీ నుంచి ఉదయపూర్- రూ 3,680
- ఢిల్లీ నుంచి గోవా వరకు- రూ 5,656
- ఢిల్లీ నుంచి శ్రీనగర్- రూ.3,730
- అహ్మదాబాద్ నుంచి ముంబై- రూ.1,806
- గోవా నుండి ముంబై- రూ.2,830
- దిమాపూర్ నుంచి గౌహతి- రూ.1,783

Also Read: Rohit Sharma: గ్రౌండ్‌లోకి దూసుకువచ్చిన బాలుడు.. రోహిత్ శర్మ చెప్పిన ఆ ఒక్క మాటతో..

Also Read:  Smita Sabharwal: సీఎంవో అధికారిని స్మితా సబర్వాల్ ఇంట్లోకి దూరిన డిప్యూటీ తహసీల్దార్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News