FD Interest Rate: సీనియర్ సిటిజన్లకు అత్యధికంగా 8.40 శాతం వడ్డీ చెల్లిస్తున్న బ్యాంకులు

FD Interest Rates In All Banks: ఫిక్స్డ్ డిపాజిట్లపై కొన్ని బ్యాంకులు అత్యధిక వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకులు ఏకంగా 8.40 శాతం వడ్డీ ఇస్తుండటం విశేషం. పూర్తి వివరాలు మీ కోసం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 22, 2024, 10:57 PM IST
FD Interest Rate: సీనియర్ సిటిజన్లకు అత్యధికంగా 8.40 శాతం వడ్డీ చెల్లిస్తున్న బ్యాంకులు

Fixed Deposit Interest Rates in All Banks: కొత్త ఏడాది 2024 ప్రారంభమౌతూనే చాలా బ్యాంకులు ఎఫ్‌డి వడ్డీ రేట్లలో మార్పులు చేశాయి. కొన్నిబ్యాంకులైతే స్పెషల్ ఎఫ్‌డీ గడువు తేదీను కూడా పెంచాయి. ప్రభుత్వం రంగ బ్యాంకులైన పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడెరల్ బ్యాంక్, ఐడీబీఐలు అయితే జనవరి 2024 నుంచి వడ్డీ రేట్లలో మార్పులు చేశాయి. జనవరి నుంచి ఏ మేరకు వడ్డీ పెంచాయో తెలుసుకుందాం..

ఐడీబీఐ బ్యాంక్ ఎఫ్‌డి వడ్డీ రేటు

ఐడీబీఐ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీని పెంచింది. సాధారణ పౌరుల ఎఫ్‌డీలపై ఈ బ్యాంకు 3 నుంచి 7 శాతం వడ్డీని 7 రోజుల్నించి 10 ఏళ్ల కాల వ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై అందిస్తోంది. అదే సీనియర్ సిటిజన్లకు అయితే 3.50 శాతం నుంచి 7.50 శాతం వరకూ వడ్డీ చెల్లిస్తోంది. ఈ కొత్త వడ్డీ రేట్లు జనవరి 17, 2024 నుంచి అమల్లోకి వచ్చాయి.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎఫ్‌డి వడ్డీ రేటు

జనవరి 2024 నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంకు ఎఫ్‌డి వడ్డీ రేట్లను రెండు సార్లు మార్చింది. ఏకంగా 80 బేసిస్ పాయింట్లు వడ్డీ పెంచింది. 300 రోజుల ఎఫ్‌డి పై వడ్డీ రేటును 80 బేసిస్ పాయింట్లు పెంచడం ద్వారా 6.25 శాతం నుంచి 7.05 శాతం చేసింది. అయితే ఇది సాధారణ పౌరులకు మాత్రమే. అదే సీనియర్ సిటిజన్లకు అయితే 7.55 శాతం వడ్డీని, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.85 శాతం వడ్డీని ఇస్తోంది. ఇప్పుడు మార్పు చేసిన తరువాత సాధారణ పౌరులకు 3.50 శాతం నుంచి 7.25 శాతం వడ్డీ చెల్లిస్తోంది. సీనియర్ సిటిజన్లకు ఇచ్చే వడ్డీ 4 శాతం నుంచి 7.75 శాతం ఉంది. 

బ్యాంక్ ఆఫ్ బరోడా ఎఫ్‌డి వడ్డీ రేటు

బ్యాంక్ ఆఫ్ బరోడా స్పెషల్ టెర్మ్ ఎఫ్‌డి లాంచ్ చేసింది. ఇందులో అత్యధిక వడ్డీ లభిస్తుంది. 2 కోట్ల కంటే తక్కువ ఉన్న డిపాజిట్లపై కొత్త వడ్డీ రేట్లు జనవరి 15,2024 నుంచి వర్తిస్తాయి. 360డి పేరుతో బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త ఎఫ్‌డి లాంచ్ చేసింది. ఈ ఎఫ్‌డీపై సాధారణ పౌరులకు 7.10 శాతం వడ్డీ సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ లభిస్తుంది. ఇప్పుడు మార్పు తరువాత సాధారణ పౌరులకు 4 శాతం నుంచి 7.25 శాతం లభిస్తుంది. ిది 7 రోజుల్నించి 10 ఏళ్ల కాల వ్యవధికి వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్లు ఎక్కువగా లభిస్తుంది. 

ఫెడరల్ బ్యాంక్ ఎఫ్‌డి వడ్డీ రేటు

ఫెడరల్ బ్యాంక్ 500 రోజుల FDపై 7.75 శాతం వడ్డీని సీనియర్ సిటిజన్లకు 8.25 శాతం వడ్డీని అందిస్తోంది. ఫెడరల్ బ్యాంక్ ఇప్పుడు సీనియర్ సిటిజన్లకు అత్యధికంగా 8.40 శాతం వడ్డీ అందిస్తోంది. అది కూడా 500 రోజుల ఎఫ్‌డికు. 1 కోటి నుంచి 2 కోట్ల వరకూ ఉన్న నాన్ విత్ డ్రా ఎఫ్‌డీలపై వడ్డీని 7.90 శాతానికి పెంచింది. ఫెడరల్ బ్యాంకు ఎఫ్‌డి వడ్డీ రేట్లను 3 శాతం నుంచి 7.75 శాతం వరకూ సౌధారణ పౌరులకు చెల్లిస్తుంటే సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం నుంచి 8.25 శాతం అందిస్తోంది. ఈ వడ్డీ 7 రోజుల్నించి 10 ఏళ్ల కాల వ్యవధి కలిగిన ఎప్‌డీలకు వర్తిస్తుంది. 

Also read: Bank Holidays in March 2024: మార్చ్ నెలలో బ్యాంకు సెలవుల జాబితా

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News