EPFO Updates: ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ప్రయోజనాలు చాలా ఉన్నాయి. చాలామందికి ఈ ప్రయోజనాల గురించి పూర్తిగా తెలియదు. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఉచిత ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తున్న సంగతి అతి తక్కువ మందికి తెలుసు. విశేషమేమంటే ఈపీఎఫ్ఓ ఎక్కౌంట్ కలిగి ఉండటం ఒక్కటే ఈ ఇన్సూరెన్స్ ప్రయోజనం పొందేందుకు అర్హత.
ఈపీఎఫ్ఓ అందిస్తున్న ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం ద్వారా 7 లక్షల వరకూ బెనిఫిట్ అందుతుంది. దీనికోసం అదనంగా ఏ విధమైన ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. విడిగా ఏమీ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈపీఎఫ్ ఖాతాదారుడు అకాలంగా మరణించినప్పుడు ఈ ఇన్సూరెన్స్ సంబంధిత కుటుంబసభ్యులు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ అందిస్తున్న ఈ ఇన్సూరెన్స్ నియమ నిబంధనలేంటో తెలుసుకుందాం..
ఎవరు క్లెయిమ్ చేయాలి
ఈపీఎఫ్ఓ సభ్యుడి మరణానంతరం ఇన్సూరెన్స్ అంటే బీమా అందుతుంది. ఈపీఎఫ్ సభ్యుడి నామినీ లేదా కుటుంబసభ్యుడు ఈ ఇన్సూరెన్స్ కోసం క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగంలో ఉండగా ఈపీఎఫ్ సభ్యుడు మరణిస్తే ఆ కుటుంబసభ్యులు లేదా నామినీ ఇన్సూరెన్స్ కోసం అప్లై చేయవచ్చు. ఇందులో కనీస బీమా మొత్తం 2.5 లక్షల రూపాయలు కాగా గరిష్టంగా 7 లక్షల రూపాయలు. నామినీ ఎక్కౌంట్లోకి నేరుగా డబ్బులు జమ అవుతాయి.
ఇన్సూరెన్స్ ఎలా లెక్కిస్తారు
ఈపీఎఫ్ఓ సభ్యుడి గత 12 నెలల జీతం ఆధారంగా ఇన్సూరెన్స్ మొత్తం ఎంతనేది లెక్కిస్తారు. గత 12 నెలల్లో అందుకున్న బేసిక్ శాలరీకు 35 రెట్లు ఉంటుంది. అదే సమయంలో గరిష్టంగా 7 లక్షల రూపాయలు దాటకుండా ఉంటుంది. గతంలో గరిష్ట మొత్తం 6 క్షల రూపాయలుండేది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే లక్ష రూపాయలు పెంచింది. కనీస మొత్తం మాత్రం 2.5 లక్షల రూపాయలే.
నామినీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
ఈపీఎఫ్ఓ సభ్యుడు తన ఎక్కౌంట్ లో తప్పనిసరిగా నామినీని నమోదు చేయాలి. నామినీని చేర్చడం వల్ల చాలా ప్రయోజనముంది. ఒకవేళ సభ్యుడు అకస్మాత్తుగా మరణిస్తే..ఇన్సూరెన్స్ మొత్తం పొందడంలో ఆ కుటుంబానికి ఏ విధమైన ఇబ్బందులు ఎదురుకావు. అదే సమయంలో నామినీ పేరు చేర్చకపోతే లీగల్ హెయిర్ విషయంలో చాలా పేపర్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫలితంగా క్లెయిమ్ ఆలస్యమౌతుంది.
Also read: Unclaimed Amount: కేంద్ర ఆర్ధిక మంత్రి శుభవార్త, త్వరలో ఆ ఎక్కౌంట్లలో పడనున్న 35 వేల కోట్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook