EPF Nomination Benefits: EPFO ఈ-నామినేషన్ పూర్తి చేయకపోతే రూ.7 లక్షల బీమా కోల్పోయినట్టే!

EPF Nomination Benefits: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ కు సంబంధించిన ఈ-నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారా? లేదంటే వెంటనే ఆన్ లైన్ లో పూర్తి చేయండి. నామినేషన్ ను పూర్తి చేయని క్రమంలో పీఎఫ్ ఖాతా దారుల రూ. 7 లక్షల బీమా ప్రయోజనాలు కోల్పోయే అవకాశం ఉంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 18, 2022, 03:24 PM IST
EPF Nomination Benefits: EPFO ఈ-నామినేషన్ పూర్తి చేయకపోతే రూ.7 లక్షల బీమా కోల్పోయినట్టే!

EPF Nomination Benefits: ఉద్యోగస్తులు ఇప్పుడు తమ ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాకు సంబంధించిన ఈ-నామినేషన్ ప్రక్రియను తప్పనిసరి చేశారు. అందుకు సంబంధించి ఇటీవలే ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఓ అధికారిక ప్రకటన చేసింది. పీఎఫ్ వినియోగదారులు ఈ-నామినేష్ పూర్తి చేయకపోతే ఆయా ఖాతాలకు సంబంధించిన బ్యాలెన్స్ చెక్ చేసేందుకు అవకాశం లేదు. 

ఒకవేళ పీఎఫ్ ఖాతాకు సంబంధించిన నామినేషన్లను సమర్పించని పక్షంలో అనేక ప్రయోజనాలు కోల్పోయే అవకాశం ఉంది. EPF ఆన్‌లైన్ నామినేషన్ అర్హతగల కుటుంబ సభ్యులకు రూ. 7 లక్షల వరకు PF తో పాటు పెన్షన్, ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (EDLI) అందుబాటులో ఉంది. 

EPF ఆన్‌లైన్ నామినేషన్ ప్రక్రియ:

1) మీరు EPFO ​​వెబ్‌సైట్‌ను వెళ్లి.. సర్వీసెస్ విభాగానికి వెళ్లి, ఆపై 'ఎంప్లాయిస్' ఆప్షన్ ను ఎంచుకోవాలి. 

2) ఆ తర్వాత 'మెంబర్ UAN / ఆన్‌లైన్ సర్వీస్'పై క్లిక్ చేయాలి.

3) యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN), పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయండి.

4) 'మేనేజ్‌మెంట్ ట్యాబ్' కింద 'ఈ-నామినేషన్' ఎంచుకోవాలి.

5) ఇప్పుడు స్క్రీన్‌పై 'Fill The Details' ట్యాబ్ కనిపిస్తుంది. దానికి సంబంధించిన సమాచారాన్ని పొందుపరచి.. ఆ తర్వాత సేవ్ బటన్ పై క్లిక్ చేయాలి. 

6) నామినేషన్ ప్రక్రియను రెన్యూవల్ చేసేందుకు 'Yes' పై క్లిక్ చేయాలి.

7) 'Add Family Member' ఆప్షన్ ను ఎంచుకోవాలి. (ఒకరి కంటే ఎక్కువ మంది నామినీలను జోడించవచ్చు).

8) అప్పుడు మీ కుటుంబ సభ్యులలో (నామినీలు) ఎవరికి వాటా ఉండాలో మీరే నిర్ణయించుకోండి. అయితే మొత్తం మొత్తం 100%కి సమానం అని గుర్తుంచుకోండి.

9) అవసరమైన సమాచారాన్ని ఫిల్ చేసిన తర్వాత 'సేవ్ ఈపీఎఫ్ రిజిస్ట్రేషన్'పై క్లిక్ చేయండి.\

10) OTP కోసం 'e-Sign'పై క్లిక్ చేయండి. ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌కు పంపిన OTPని అందులో సబ్ మిట్ చేయాలి. 

EPF ఈ-నామినేషన్ యొక్క ప్రయోజనాలు..

EPFO ఈ-నామినేషన్ పీఎఫ్, పెన్షన్, ఉద్యోగి డిపాజిట్ లింక్డ్ బీమా స్కీమ్ పై  దాదాపుగా రూ. 7 లక్షల వరకు బీమా పొందవచ్చు. ఈ - నామినేషన్లను ఎప్పుడైనా అప్డేట్ చేయవచ్చు. పీఎఫ్ మెంబర్ పెళ్లైన తర్వాత తప్పనిసరిగా పునరుద్ధరణ చేయాల్సి ఉంటుంది. 

Also Read: Flipkart Realme 8S 5G: రూ.5 వేలకే Realme 8S 5G స్మార్ట్ ఫోన్.. త్వరపడండి!

Also Read: OnePlus New Model: OnePlus ప్రియులకు గుడ్ న్యూస్.. రూ.20 కంటే తక్కువ ధరకే 5G మొబైల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News