Edible Oils: వంటనూనెల ధరల తగ్గతున్నాయి. ఆకాశాన్నంటుతున్న ధరల్నించి ప్రజలకు ఉపశమనం కల్గించేందుకు భారీగా వంటనూనె దిగుమతి చేసుకుంటోంది. ఫలితంగా ధరలు తగ్గనున్నాయి.
పెరుగుతున్న వంటనూనె ధరల్నించి వినియోగదారులకు ఉపశమనం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలకచర్య చేపట్టింది. సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్స్‌పై కస్టమ్స్ డ్యూటీ, అగ్రిసెస్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడమే కాకుండా 20 లక్షల మెట్రిక్ టన్నుల ఆయిల్ దిగుమతికి నిర్ణయించింది. మే 25 నుంచి కేంద్ర ఆర్ధిక శాఖ కొత్త ఉత్తర్వులు అమల్లో వచ్చాయి. మార్చ్ 31, 2024 వరకూ ఉంటాయి.
సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్స్ ఒక్కొక్కటి ఏడాదికి 20 లక్షల మెట్రిక్ టన్నుల దిగుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇది రెండేళ్లపాటు అమల్లో ఉంటుంది. దీనిపై కస్టమ్స్ డ్యూటీ, అగ్రిసెస్ మినహాయింపు ఉంటుంది. ఫలితంగా వంటనూనెల ధరలు దేశంలో భారీగా తగ్గనున్నాయి. దేశంలో వంటనూనెల ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో వెజిటబుల్ ఆయిల్స్ దిగుమతిలో ఇండియా అతిపెద్ద దేశంగా ఉంది. దేశ అవసరాల్లో 60 శాతం దిగుమతుల ద్వారానే పూర్తవుతున్నాయి.
ఉక్రెయిన్ దేశంపై రష్యా ఆక్రమణతో వంటనూనెల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దేశంలో అత్యధికంగా వినియోగించే సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను ఇండియా అత్యధికంగా రష్యా, ఉక్రెయిన్ దేశాల్నించే దిగుమతి చేసుకుంటోంది. గతంలో అంటే ఫిబ్రవరి నెలలో క్రూడ్ పామ్ ఆయిల్‌పై విధించే అగ్రిసెస్‌ను కేంద్ర ప్రభుత్వం 5 శాతానికి తగ్గించింది. గతంలో అది 7.5 శాతంగా ఉండేది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కస్టమ్స్ , అగ్రిసెస్ మినహాయింపు ఇస్తూ..సన్‌ఫ్లవర్, సోయాబీన్ క్రూడ్ ఆయిల్స్ ఒక్కొక్కటీ 20 లక్షల మెట్రిక్ టన్నుల దిగుమతికి అనుమతివ్వడంతో ఇక నుంచి ధరలు భారీగా తగ్గనున్నాయి.
Also read: Google New Feature: గూగుల్ నుంచి సరికొత్త ఫీచర్, హ్యాకర్ల నుంచి రక్షణ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook