Success Story: పకోడీలు అమ్మాడు.. రూ.300 జీతంతో.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించాడు.. సక్సెస్ అంటే ఇదే బ్రో

Reliance Industries: మామూలు పాఠశాల ఉపాధ్యాయుడి కుమారుడిగా జన్మించిన ధీరూబాయ్ అంబానీ తిరిగి వెళ్లేనాటికి 5వేల కోట్ల రూపాయల రిలయన్స్ మహా సామ్రాజ్యాధినేతగా ఎదిగార. ఆయన పడిన కష్టమే..ఆయనను ఉన్నతస్థాయికి తీసుకువచ్చింది. ధీరూభాయ్ అంబానీ యెమెన్‌లోని పెట్రోల్ పంపులో పని చేసేవారు. పని పట్ల అతని అంకితభావం, కృషిని చూసి, కంపెనీ అతనిని తన మేనేజర్‌గా చేసింది. కానీ అక్కడ దాదాపు ఆరు సంవత్సరాలు గడిపిన తర్వాత, ధీరూబాయ్ 1954లో భారతదేశానికి వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగింది..ఉన్నతస్థాయికి ఎలా చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.   

Written by - Bhoomi | Last Updated : Dec 28, 2024, 04:01 PM IST
Success Story: పకోడీలు అమ్మాడు.. రూ.300 జీతంతో.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించాడు.. సక్సెస్ అంటే ఇదే బ్రో

Dhirubhai Ambani's Birthday: వేల లక్షల కోట్ల రూపాయల టర్నోవర్‌తో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను ప్రారంభించిన ధీరూభాయ్ అంబానీ 92వ పుట్టినరోజు నేడు. ధీరజ్‌లాల్ హీరాచంద్ అంబానీ అలియాస్ ధీరూ భాయ్ అంబానీకి జ్నానం తెలిసినప్పుడు తన కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగలేదు. పలు కారణాల వల్ల 16 సంవత్సరాల వయస్సులో ధీరుబాయ్ అంబానీ వారు నివసించే  గ్రామంలోని దేవాలయాలు దగ్గర పండ్లు, పకోడీలు అమ్మడం ప్రారంభించాడు. కానీ వీటిని అమ్మడం వల్ల పెద్దగా ఆదాయం రాలేదు. ఏడాది పొడవునా పర్యాటకులు వస్తే లాభాలు ఉంటాయని గమనించారు. దాంతో కొంతకాలానికి ఆ వ్యాపారాన్ని ఆపేశారు. 

1948లో తన అన్న రమణిక్లాల్ సహాయంతో ధీరుబాయ్ అంబానీ యెమెన్‌లోని అడెన్ నగరానికి చేరుకున్నాడు.  నెలకు రూ.300తో కంపెనీలో ఉద్యోగంలో చేరాడు.   యెమెన్‌లోని అరబ్ మర్చంట్ వద్ద కూడా పనిచేశాడు. యెమెన్‌లోని ఓ పెట్రోల్ పంపులో పనిచేసేవారు. పని పట్ల అతని అంకితభావం, కృషిని చూసి, కంపెనీ అతనిని తన మేనేజర్‌గా చేసింది. కానీ అక్కడ దాదాపు ఆరు సంవత్సరాలు గడిపిన తర్వాత, ధీరూభాయ్ 1954లో భారతదేశానికి వచ్చారు. 1955లో జేబులో 500 రూపాయలు పెట్టుకుని అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ముంబై చేరుకున్నాడు. అతని వ్యాపార ప్రయాణం ముంబై నగరం నుండే ప్రారంభమైంది. 

ముంబైకి చేరుకున్న తర్వాత, ధీరూభాయ్ అంబానీ భారతీయ మార్కెట్‌ను దగ్గరగా అర్థం చేసుకున్నారు. ఆ సమయంలో పాలిస్టర్‌కు భారతదేశంలో అత్యధిక డిమాండ్ ఉందని అతను గ్రహించాడు. మరోవైపు విదేశాల్లో భారతీయ మసాలా దినుసులకు డిమాండ్ చాలా ఎక్కువ. సొంతంగా వ్యాపారం చేయాలని ప్లాన్ చేసి అద్దెకు ఇల్లు తీసుకున్నాడు. 1958లో, ధీరూభాయ్ తన బంధువు చంపక్‌లాల్ దిమాని సహాయంతో రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్‌ను స్థాపించాడు. ఈ కంపెనీ ద్వారా అల్లం, పసుపు, ఏలకులు, బట్టలు, అనేక ఇతర వస్తువులను పశ్చిమ దేశాలకు ఎగుమతి చేసేవాడు.

అతని వ్యాపార ప్రయాణం ఇక్కడ నుండి ప్రారంభమైంది. అంచలంచెలుగా ఎదిగింది. వెనుదిరిగి చూడలేదు. అనతికాలంలోనే కోటీశ్వరుడయ్యాడు. ఒకదాని తర్వాత ఒకటిగా కంపెనీని ప్రారంభిస్తూ 2000 సంవత్సరంలో దేశంలోనే అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త అయ్యాడు. ధీరూభాయ్ అంబానీ 1958లో రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్‌ను ప్రారంభించినప్పుడు, అతను 350 చదరపు అడుగుల కార్యాలయంలో ఒక టేబుల్, మూడు కుర్చీలు, ఇద్దరు అసోసియేట్‌లతో కార్యాలయాన్ని ప్రారంభించాడు.

Also Read: Bank Of Baroda Recruitment 2024: బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి.. చివరి తేదీ ఎప్పుడంటే?  

ఆసియాలో అత్యంత శక్తివంతమైన వ్యక్తుల' జాబితాలో చేర్చింది. 2001లో, ఫోర్బ్స్ ఇంటర్నేషనల్ 500 కంపెనీల జాబితాలోకి ప్రవేశించిన మొదటి భారతీయ ప్రైవేట్ కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది. ధీరూభాయ్ అంబానీ 1955లో కోకిలాబెన్‌ను వివాహం చేసుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ విజయం వెనుక ధీరూభాయ్ అంబానీతో పాటు కోకిలాబెన్ కూడా పూర్తి సహకారం అందించారు. కోకిలాబెన్ జీవితంలోని ప్రతి హెచ్చు తగ్గులలో ధీరూభాయ్ అంబానీకి మద్దతు ఇచ్చింది. ధీరూభాయ్ అంబానీకి నలుగురు పిల్లలు, ముఖేష్ (1957), అనిల్ (1959), దీప్తి (1961)  నీనా (1962).

జూన్ 4, 2002న ధీరూభాయ్ అంబానీకి రెండవసారి గుండెపోటు వచ్చింది. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ధీరూభాయ్ అంబానీ 6 జూలై 2022న 69 సంవత్సరాల వయసులో మరణించారు. ధీరూభాయ్ అంబానీ మరణించిన రెండేళ్లలోనే ముఖేష్, అనిల్ అంబానీల మధ్య వైరం వెలుగులోకి వచ్చింది. ధీరూభాయ్ అంబానీ భార్య కోకిలాబెన్ వ్యాపారాన్ని విభజించుకునేంత పెద్దదయ్యింది. ఈ విభజనలో అప్పటి ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్ వీకే కామత్ కీలక పాత్ర పోషించారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

 

Trending News