Cooking Oil: దేశంలో దిగొస్తున్న వంట నూనెల ధరలు..కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!

Cooking Oil: దేశంలో వంట నూనెలు మరింత తగ్గనున్నాయా..? కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది..? అంతర్జాతీయంగా ఎలాంటి ధరలు ఉన్నాయి..? సుంకాలపై రాయితీ ఎలా ఉంది..? 

Written by - Alla Swamy | Last Updated : Oct 2, 2022, 07:44 PM IST
  • వంట నూనెలు మరింత తగ్గనున్నాయా..?
  • మోదీ సర్కార్ కీలక నిర్ణయం
  • ధరల వివరాలు
Cooking Oil: దేశంలో దిగొస్తున్న వంట నూనెల ధరలు..కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!

Cooking Oil: వంట నూనెలపై మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వంట నూనెల దిగుమతి సుంకంపై కల్పిస్తున్న రాయితీని పొడిగించింది. 2023 మార్చి వరకు రాయితీ కొనసాగనుంది. ఈమేరకు కేంద్ర ఆహార శాఖ ప్రకటించింది. దేశీయంగా సరఫరాలను పెంచి ధరలను కట్టడి చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగానే సుంకంపై రాయితీని ఆరు నెలలు పొడిగించారు. 

అంతర్జాతీయ ధరలు దిగివస్తున్నాయి. అదేవిధంగా దేశంలోనూ ధరలు ఉండాలని మోదీ సర్కార్ భావిస్తోంది. ఇందులో భాగంగానే వంట నూనెల ధరలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈక్రమంలోనే దేశంలో వంట నూనెల ధరలు అదుపులోకి వస్తున్నాయి. తాజాగా సుంకంపై రాయితీ కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో దేశవ్యాప్తంగా ధరలు మరింత తగ్గనున్నాయి. దీంతో ముడి, రిఫైన్డ్ పామాయిల్, ముడి, రిఫైన్డ్ సోయాబీన్ అయిల్, ముడి, రిఫైన్డ్ సన్ ఫ్లవర్ నూనెలపై దిగుమతి సుంకాలు యథాతథంగా ఉండనున్నాయి. 

ప్రసుత్తం ముడి రకాల నూనెలపై సున్నా శాతం దిగుమతి సుంకం ఉందని అధికారులు తెలిపారు. ఐతే వ్యవసాయం, సామాజిక సంక్షేమ సెస్సులతో కలిపి..దిగుమతి దారులు 5.5 శాతం పన్ను కట్టాల్సి ఉంది. రిఫైన్డ్ పామాయిల్ దిగుమతిపై 13.75 శాతం, రిఫైన్డ్ సోయాబీన్, సన్ ఫ్లవర్ నూనెలపై 19.25 శాతం పన్ను విధించారు. గతేడాది కొన్ని కారణాల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో వంట నూనెల ధరలు అమాంతంగా పెరిగాయి.

వంట నూనెలకు సంబంధించిన ముడి సరుకును భారత్ ఇతర దేశాలను దిగుమతి చేసుకుంటోంది. అంతర్జాతీయ పరిణామాలపై దేశంలో నూనెల ధరలు రెట్టింపు అయ్యాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల కూడా ధరలు మరింత పెరిగాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. పలు దఫాలుగా దిగుమతి సుంకాన్ని తగ్గిస్తోంది. భారతదేశం..2020-21లో రూ.1.17 లక్షల కోట్ల విలువైన వంట నూనెలను దిగుమతి చేసుకుంది. 

Also read:Congress President Election: పార్టీ బలోపేతం చేయడమే లక్ష్యం..శశిథరూర్‌కు మల్లికార్జున ఖర్గే కౌంటర్..!

Also read:CM Kcr: టీఆర్ఎస్‌నే బీఆర్ఎస్‌గా మారుస్తున్నారా..? సీఎం కేసీఆర్ మదిలో ఏముంది..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News