Alert: మీకు పెన్షన్ వస్తుందా..? అయితే నవంబర్ 30 లోపు ఈ పని చేయకపోతే మీకే నష్టం!

ప్రతి నెల మీకు పెన్షన్ వస్తుందా..?? అయితే నవంబర్ 30 లోపు లైఫ్ సర్టిఫికెట్ ను అందించకపోతే మీకు ఇక పెన్షన్ రాకపోవచ్చు. ఇవే కాకుండా చాలా పనులు నవంబర్ 30 తేదీకి గడువు ముగియనున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 23, 2021, 05:43 PM IST
  • పెన్షనర్లు నవంబర్ 30 లోపు లైఫ్ సర్టిఫికెట్ ను సమర్పించాలి
  • అతి తక్కువ వడ్డీ రేటుతో హోమ్ లోన్ అందించే చివరి తేదీ కూడా నవంబర్ 30
  • జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశ దరఖాస్తు చివరి తేదీ కూడా నవంబర్ 30
Alert: మీకు పెన్షన్ వస్తుందా..? అయితే నవంబర్ 30 లోపు ఈ పని చేయకపోతే మీకే నష్టం!

Things Must do before November 30 2021: మీకు పెన్షన్ (Pension) వస్తుందా.. ?? అయితే ఇది మీ కోసమే.. నవంబర్ నెల లోపు ఈ పని కానీ పూర్తి చేయకపోతే వచ్చే నెల నుండి మీకు పెన్షన్ రాదు.. నవంబర్ నెల ముగియటానికి ఇంకా కొన్ని రోజులే మిగిలివుంది.. ఇది మాత్రం పూర్తి చేయకుంటే  మీరు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. 

నవంబర్ 30లోపు ఈ పనిని పూర్తి చేయండి

ముఖ్యమైన పనులకు డెడ్ లైన్ నవంబర్ 30. ఉదాహరణకు పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్ ను నవంబర్ 30 లోపు సమర్పించడం తప్పనిసరి. ఇవే కాకుండా ముఖ్యమైన పనులకు డెడ్ లైన్ నవంబర్ 30.. మీరు తప్పక చేయాల్సిన పనులేంటో మరోసారి మీకోసం. 

Also Read: Viral Video: గ్లాసులో వాటర్ తాగుతున్న బ్లాక్ కోబ్రా.. వీడియో చూస్తే చెమటలు పట్టడం ఖాయం

లైఫ్ సర్టిఫికెట్ సమర్పించండి 
పెన్షన్ కోసం లైఫ్ సర్టిఫికెట్ తప్పనిసరి.. ఒకేవేళ పెన్షన్  (Pensioners) పొందే పెన్షన్ దారులలో మీరుకూడా ఒకరైతే... నవంబర్ 30 లోగా లైఫ్ సర్టిఫికెట్ (Life Certificate ) సమ్పరించటం తప్పనిసరి. నిజానికి పెన్షన్ పొందే వారు బ్రతికి ఉన్నారని తెలియజేసేదే ఈ సర్టిఫికెట్. ఒకవేళ గడువు ముగిసేలోపు ఈ సర్టిఫికెట్ సమర్పించుకుంటే.. వచ్చే నెల నుండి మీరు పెన్షన్ పొందలేరు. 

హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోండి
మీరు హోమ్ లోన్ తీసుకోవాలి అనుకుంటున్నారా..?? ఎల్‌ఐసి (LIC Housing Finance) వారు అందిస్తున్న స్పెషల్ హోమ్ లోన్ ఈ నెలలో ముగియనుంది. ఈ  స్పెషల్ ఎల్‌ఐసి హోమ్ లోన్ లో భాగంగా దాదాపు రూ. 2 కోట్ల వరకు... అతి తక్కువ వడ్డీ రేటును 6.66 శాతంపై అందించనుంది. అంటే స్పెషల్ ఎల్‌ఐసి హోమ్ లోన్ (LIC Home Loans) లో అతి తక్కువ వడ్డీ కడుతున్నారని అర్థం. ఈ స్పెషల్ ఆఫర్ యొక్క చివరి తేదీ నవంబర్ 30 కాగా.. ఆ తరువాత కంపెనీ ఏ రోజు అయిన వడ్డీ రేటును పెంచవచ్చు. కావున హోమ్ లోన్ తీసుకునే వారు నవంబర్ 30 లోగా తీసుకోవటం మంచిది. 

Also Read: Viral Pre Wedding Photoshoot: గంటలో పెళ్లి.. జిమ్‌లో తెగ కసరత్తులు చేస్తోన్న పెళ్లి కూతురు

జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశం 
జవహర్ నవోదయ విద్యాలయంలో (Jawahar Navodaya Vidyalaya) ప్రవేశం కోసం ఒక ముఖ్య ప్రకటన..  ఇందులో ప్రవేశం కోసం చూసే వారికి ఈ నెల నవంబర్ 30 చివరి తేదీ.. జవహర్ నవోదయ విద్యాలయంలో 9వ తరగతి ప్రవేశానికి నవంబర్ 30లోపు దరఖాస్తు చేసుకోవాలి. 30 ఏప్రిల్ 2022న జరిగే ఎంపిక పరీక్షకు దరఖాస్తు చివరి తేదీ నవంబర్ 30. నవోదయ విద్యాలయ సమితి అధికారిక వెబ్‌సైట్ navodaya.gov.in ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా మిగతా వివరాల కోసం ఈ వెబ్‌సైట్ సందర్శించండి. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News