Passport Alert: డూప్లికేట్ పాస్‌పోర్ట్ వెబ్‌సైట్లు, యాప్స్ ఉన్నాయి జాగ్రత్త, ఇలా గుర్తించండి

Passport Alert: పాస్‌పోర్ట్ చేయించుకోవాలనుకుంటున్నారా..అయితే కేంద్ర ప్రభుత్వం ఇదుకు సంబంధించి కీలకమైన అప్‌డేట్స్ జారీ చేసింది. అవేమిటో తెలుసుకోకుంటే డబ్బులు వృధా అయిపోతాయి. మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 27, 2024, 11:41 AM IST
Passport Alert: డూప్లికేట్ పాస్‌పోర్ట్ వెబ్‌సైట్లు, యాప్స్ ఉన్నాయి జాగ్రత్త, ఇలా గుర్తించండి

Passport Alert: కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్ట్ విషయంలో ఎప్పటికప్పుడు కీలకమైన సూచనలు జారీ చేస్తుంటుంది. ఒక్కోసారి నిబంధనలు మారుస్తుంటుంది. ఈ నియమ నిబంధనలు, మార్పుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. లేకపోతే పాస్‌పోర్ట్ చేయించుకునేటప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. 

కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్ట్ విషయంలో కీలకమైన సూచనలు జారీ చేసింది. పాస్‌పోర్ట్ చేయించుకునే క్రమంలో ఫేక్ వెబ్‌సైట్లు, లేదా ఫేక్ మొబైల్ అప్లికేషన్లో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది. చాలా ఫేక్ వెబ్‌సైట్స్ లేదా మొబైల్ యాప్స్ పాస్‌పోర్ట్ జారీ చేసే ముసుగులో డేటా మాత్రమే కాకుండా ఫీజులు కూడా వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని పాస్‌పోర్ట్ అధారిటీ తెలిపింది. 

చాలా ఫేక్ వెబ్‌సైట్లు, మొబైల్ అప్లికేషన్లు దరఖాస్తుదారుల్నించి డేటా సేకరించడం, ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్, అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేయడం ఇలా వివిధ రూపాల్లో అదనపు డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్నాయని విదేశాంగ శాఖ దృష్టికి వచ్చింది. ఇందులో కొన్ని ఓఆర్జీ డొమైన్‌తో రిజిస్టర్ అయ్యాయని, కొన్ని ఇన్ పేరుతో రిజిస్టర్ అయ్యాయని తెలుస్తోంది.

పాస్‌పోర్ట్ జారీ పేరుతో ఫేక్ వెబ్‌సైట్స్

1. www.indiapassport.org
2. www.online-passportindia.com
3. www.passportindiaportal.in
4. www.passport-india.in
5. www.passport-seva.in
6. www.applypassport.org

ఈ క్రమంలో పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసేవాళ్లు ఇలాంటి ఫేక్ వెబ్‌సైట్ల జోలికి వెళ్లవద్దని, ఎలాంటి పేమెంట్లు జరపవద్దని ఇండియన్ పాస్‌పోర్ట్ అథారిటీ కోరుతోంది. ఒకవేళ అలా చేస్తే డబ్బులు పోగొట్టుకుంటారని హెచ్చరిస్తోంది. విదేశీ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్ passportindia.gov.in మాత్రమేనని..లింక్  www.passportindia.gov.in ఇలా ఉంటందని తెలిపింది. అందుకే ఇవి తప్ప మరే వెబ్‌సైట్ క్లిక్ చేయవద్దని సూచించింది. ఇక మొబైల్ యాప్ విషయంలో  mPassport Seva మాత్రమే ఉందని తెలిపింది. ఈ వెర్షన్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ రెండింటికీ వర్తిస్తుందని వెల్లడించింది. 

Also read: Tulsi Benefits: తులసి ఆకులు రోజూ తింటే చాలు, ఏ వ్యాధి కూడా దరి చేరదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News