Gold Price: బడ్జెట్ దెబ్బకు భారీగా పడిపోయిన బంగారం ధర..ఏకంగా రూ. 4వేలు తగ్గింపు..!

Gold, Silver Prices: కేంద్రంలో మోదీ సర్కార్ మూడోసారి కొలువుదీరిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 15శాతం నుంచి 6శాతం వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ తరుణంలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఏకంగా రూ. 4వేల వరకు తగ్గాయి.   

Written by - Bhoomi | Last Updated : Jul 23, 2024, 04:44 PM IST
Gold Price: బడ్జెట్ దెబ్బకు భారీగా పడిపోయిన బంగారం ధర..ఏకంగా రూ. 4వేలు తగ్గింపు..!

 Gold, Silver Prices Fall: దేశంలో సాధారణ బడ్జెట్ 2024 ప్రవేశపెట్టిన వేళ బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని6శాతం తగ్గిస్తున్నట్లు ఆర్ధిక మంత్రి తెలిపారు. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ నిర్ణయం, బంగారం, వెండి ధరలను చాలా వరకు తగ్గిస్తుంది. ఈ లోహాలకు డిమాండ్ పెరగడంతో ఫలితంగా సామాన్యులకు కూడా బంగారం లేదా వెండి ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఫలితంగా విలువైన లోహాలు స్మగ్లింగ్ తగ్గుతుందని ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు. ఇందులో ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ (BCD) 10% నుండి 5%కి, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్ (AIDC) 5% నుండి 1%కి తగ్గింది.జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమోడిటీస్ హెడ్ హరీష్ వి మాట్లాడుతూ, "కస్టమ్స్ డ్యూటీని 15శాతం నుండి 6శాతానికి తగ్గించడం వల్ల దేశీయ ధరలు తగ్గవచ్చు .డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. గతంలో డ్యూటీలో 10% BCD మరియు 5% AIDC ఉన్నాయని పేర్కొన్నారు. 

ఆర్థిక మంత్రి ప్రకటన అనంతరం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ధరలు రూ. 72,838 నుండి 10 గ్రాములకు రూ.68,500కి తగ్గింది.అంటే తులంపై  రూ.4,000 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో, బంగారం ధరలు ఔన్సుకు దాదాపు $2,397.13గా నమోదయ్యాయి.అటు MCXలో వెండి ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. కిలో రూ.88,995 నుంచి రూ.84,275కి పడిపోయింది. 

కాగా బంగారం ఫ్యూచర్స్ ధరలు ఈరోజు పెరుగుదలతో ప్రారంభం అయ్యాయి. మల్టీ కమోడిటి ఎక్స్చేంజ్ లో బంగారం బెంచ్ మార్క్ ఆగస్టు కాంట్రాక్టు రోజు రూ. 120 పెరిగి రూ. 72,838వద్ద ప్రారంభం అయ్యింది. ఈ ఒప్పందం రూ. 100 పెరుగుదలతో రూ. 72.818 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ సమయంలో రూ. 72.850 వద్ద రోజు గరిష్టాన్ని తాకింది. రూ. 72.809 వద్ద కనిష్టా స్థాయికి తాగింది. బంగారం భవిష్యత్ ధర ఈ నెలల అత్యధికంగా రూ. 74, 471కి చేరింది. అంటే వెండి  మందకోడిగా ప్రారంభం అయ్యింది. ఎంసీఎక్స్ లో వెండి బెంచ్ మార్క్ సెప్టెంబర్ కాంట్రాక్ట్ ఈరోజు రూ. 205 పతనంతో రూ. 88995 వద్ద ప్రారంభం అయ్యింది. ఈ కాంట్రాక్ట్ ధర రూ. 213 పతనంతో రూ. 88,990 వద్ద ట్రేడ్ అవుతోంది. అంటే 89,, 015 వద్ద రోజు గరిష్టాన్ని తాకింది. రూ. 88,971 వద్ద కనిష్టాన్ని తాకింది. కాగా ఈ ఏడాది వెండి ఫ్యూచర్స్ ధర అత్యధికంగా రూ. 96,493కి చేరింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఫూచర్స్ ధరలు పెరగడంతో ప్రారంభం అయ్యాయి. 

Also Read : Budget 2024: స్మార్ట్‌ఫోన్స్‌ కొనేవారికి గుడ్‌ న్యూస్‌.. 15 శాతం కస్టమ్ డ్యూటీ తగ్గింపు..

అయితే కస్టమ్స్ డ్యూటీని 15శాతం నుంచి 6శాతానికి తగ్గించడం కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. 5శాతం కోత అంచనా వేయనప్పటికీ 9శాతం తగ్గింపు అనేది నిజంగానే ప్రశంసనీయంగా చెప్పవచ్చు. ఈతగ్గుదలఅనేది వినియోగదారులను తక్కువ ధరకు బంగారం కొనుగోలు చేసేందుకు సానుకూలంగా ఉంటుంది. 10 గ్రాముల బంగారం ధర రూ. 67వేల కంటే మించి తగ్గే అవకాశం కూడా లేకపోలేదని ఆర్ధిక రంగ నిపుణులు భావిస్తున్నారు. 

Also Read :Budget 2024: బడ్జెట్ వేళ.. తెల్ల చీరలో మెరిసిన కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి నిర్మలమ్మ..!!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News