Budget 2023: ట్యాక్స్ పేయర్స్‌కు మర్చిపోలేని రోజు.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయంతో..

Union Budget 2023: 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటోందనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి శుభవార్తలు అందిస్తారని నమ్మకంతో ఉన్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బడ్జెట్ జనరంజకంగా ఉంటుందని భావిస్తున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2023, 06:28 PM IST
Budget 2023: ట్యాక్స్ పేయర్స్‌కు మర్చిపోలేని రోజు.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయంతో..

Union Budget 2023: ఈ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంటులో సమర్పించనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈసారి లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే బడ్జెట్‌ కావడంతో మధ్యతరగతి ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గత కొన్నేళ్లుగా బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం కొన్ని మార్పులు చేస్తోంది. ఈ మార్పులను కొన్ని వర్గాలకు సంతోష పెడుతుండగా.. మరికొందరికి షాక్‌ను ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆదాయ పన్ను చెల్లింపుదారులు కూడా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటోందనని ఎదురుచూస్తున్నారు. 
 
గతేడాది పన్ను చెల్లింపుదారులకు నేరుగా రూ.1.5 లక్షల దెబ్బ తగిలింది. ఇప్పటికైనా ఆ మార్పును పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టక ముందే ప్రజల అభిప్రాయం తీసుకోవాల్సిందని అభిప్రాయం కూడా వెల్లడైంది. 80సీ కింద ఆదాయపు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయడానికి వివిధ సెక్షన్లలోని ఉద్యోగులు, ఇతర వ్యక్తులకు ప్రభుత్వం ఒకటిన్నర లక్షల రూపాయల మినహాయింపు ఇస్తుంది. వీటిలో ఒకటి సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు తగ్గింపును పొందవచ్చు. ఇందులో పిల్లల ట్యూషన్ ఫీజు, పీపీఎఫ్, ఎల్ఐసీ, ఈపీఎఫ్, మ్యూచువల్ ఫండ్ (ఈఎల్ఎస్ఎస్), హోమ్ లోన్ ప్రిన్సిపల్ అమౌంట్ తదితరాలను క్లెయిమ్ చేసుకోవచ్చు.

అంతేకాకుండా ఆదాయపు పన్ను సెక్షన్ 24బీ కింద హోమ్ లోన్ వడ్డీపై ప్రభుత్వం 2 లక్షల రూపాయల అదనపు మినహాయింపు ఇస్తుంది. మార్చి 31, 2022 వరకు సెక్షన్ 80EEA కింద హోమ్ లోన్ వడ్డీపై రూ.1.5 లక్షల వరకు అదనపు తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ విధంగా నిబంధనల ప్రకారం గృహ రుణంపై వడ్డీపై మూడున్నర లక్షల రూపాయల వరకు రాయితీని పొందవచ్చు. అందుబాటు ధరల్లో ఇళ్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 2019 బడ్జెట్‌లో ఈ నిబంధనను రూపొందించింది. అయితే గతేడాది బడ్జెట్ ప్రసంగంలో ఈ అదనపు మినహాయింపు రూ.1.5 లక్షలను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించలేదు.

సెక్షన్ 80EEA కింద వడ్డీపై పన్ను మినహాయింపు పొందడానికి గృహ రుణం ఏప్రిల్ 1, 2019, మార్చి 31 నుంచి 2022 మధ్య తీసుకుని ఉండాలి. ఇందులో రెండో షరతు ఏంటంటే.. ఆస్తి స్టాంపు డ్యూటీ రూ.45 లక్షలకు మించకూడదు. కొనుగోలుదారుకు ఇతర నివాస ఆస్తి కూడా ఉండకూడదు. ఈ మూడు షరతులను అర్హులైన వ్యక్తులు మార్చి 31, 2022 వరకు రూ.3.5 లక్షల వరకు హోమ్ లోన్ వడ్డీని క్లెయిమ్ చేసుకున్నారు. ఉద్యోగ వృత్తి దీని గరిష్ట ప్రయోజనాన్ని పొందుతోంది.

Also Read: Comedian Ali: పవన్ కళ్యాణ్‌పై పోటీకి సిద్ధం.. నటుడు అలీ సంచలన వ్యాఖ్యలు

Also Read: Telangana Teacher Posts: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో 23 వేల టీచర్ పోస్టులు..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News