BSNL Independence Day 2022 Offer: రూ. 275తో బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్.. రెండున్నర నెలల పాటు సూపర్‌ఫాస్ట్ ఇంటర్నెట్!

Get 75 Days of Broadband Service at Rs 275 in BSNL. రూ. 275కే 75 రోజుల ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తున్న‌ట్లు తాజాగా బీఎస్ఎన్ఎల్ ప్ర‌క‌టించింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 12, 2022, 04:41 PM IST
  • రూ. 275తో బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
  • 75 రోజుల పాటు సూపర్‌ఫాస్ట్ ఇంటర్నెట్
  • 60 Mbps స్పీడ్‌తో డేటా
BSNL Independence Day 2022 Offer: రూ. 275తో బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్.. రెండున్నర నెలల పాటు సూపర్‌ఫాస్ట్ ఇంటర్నెట్!

Get 75 Days of Broadband Service just Rs 275 in BSNL Independence Day 2022 Offer: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్ఎన్ఎల్) తన వినియోగదారులను ఆకర్షించడానికి ఎప్పటికప్పుడూ కొత్త ప్లాన్‌లను అందించడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే స్వాతంత్య్ర దినోత్సవ సంద‌ర్భంగా ఓ అద్భుత‌మైన ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. రూ. 275కే 75 రోజుల ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తున్న‌ట్లు తాజాగా బీఎస్ఎన్ఎల్ ప్ర‌క‌టించింది. అయితే ఈ ఆఫర్ బీఎస్ఎన్ఎల్ అందించే ప్రతి ప్లాన్‌కు వర్తించదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. 

స్వాతంత్య్ర దినోత్సవం 2022 సంద‌ర్భంగా ప్ర‌క‌టించిన రూ. 275 ఆఫ‌ర్‌ కోసం బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే ఉన్న మూడు ప్లాన్ల‌ను ఎంపిక చేసింది. అందులో రూ. 449, రూ. 599 మరియు రూ. 999 ప్లాన్‌లు ఉన్నాయి. ఈ మూడు ప్లాన్ల‌కు భారత్ ఫైబర్ స్వాతంత్య్ర దినోత్సవం 2022 రూ. 275 ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంది. స్వాతంత్య్ర దినోత్స‌వ ఆఫ‌ర్‌లో భాగంగా రూ. 449 మరియు రూ. 599 ప్లాన్‌లను కేవ‌లం రూ. 275 బీఎస్ఎన్ఎల్ అందిస్తుంది. రూ. 275 చెల్లించి ఈ రెండు ప్లాన్‌లలో దేనికైనా 75 రోజుల పాటు బ్రాడ్‌బ్యాండ్ సేవలను పొందండి. ఇండిపెండెన్స్ డే ఆఫర్‌తో లభించే తగ్గింపు ధర కింద ప్రయోజనాల విషయంలో ఎలాంటి మార్పు ఉండదు. 

రూ. 999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ఇండిపెండెన్స్ డే ఆఫర్లో భాగంగా కేవ‌లం రూ. 775కి 75 రోజుల పాటు బ్రాడ్‌బ్యాండ్ సేవలను బీఎస్ఎన్ఎల్ అందించనుంది. ఇది కంపెనీ అందించే ప్రీమియం ప్లాన్‌లలో ఒకటి. అంతేకాకుండా ఈ ప్లాన్‌కు OTT (ఓవర్-ది-టాప్) ప్రయోజనాలు ఉన్న‌ కారణంగా ఇది వినియోగదారులకు ఒక ప్ర‌త్యేక‌మైన ఎంపికగా ఉంది.

బీఎస్ఎన్ఎల్ రూ. 449 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను 30 Mbps వేగంతో అందిస్తోంది. వినియోగదారులు 3.3TB నెలవారీ డేటాను పొందుతారు, నిర్ణీత డేటా పూర్త‌య్యాక‌ ఇంటర్నెట్ వేగం 2 Mbpsకి పడిపోతుంది. రూ.599 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో 3.3TB నెలవారీ డేటాను 60 Mbps స్పీడ్‌తో పొందుతారు. ఆపై ఇంటర్నెట్ వేగం 2 Mbpsకి తగ్గిపోతుంది. ఇక రూ. 999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో వినియోగదారులు 2TB డేటాతో 150 Mbps వేగాన్ని పొందుతారు. అయితే ఉచితంగా డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్, హుంగామా, సోనీ లివ్, ZEE5, YuppTV వంటి OTT ప్రయోజనాలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.

Also Read: ఓపెనర్‌గా కేఎల్‌ రాహుల్‌ వద్దు.. రోహిత్‌ శర్మకు అతడే సరైన జోడి: కనేరియా

Also Read: Viral Video: ఢిల్లీలో దారుణ హత్య... నడిరోడ్డుపై యువకుడిని కత్తులతో పొడిచి చంపిన దుండగులు   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News