BSNL New Plan: బీఎస్ఎన్ఎల్ సూపర్ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌.. 75 రోజులకు రూ. 275 మాత్రమే!

75 Days of Broadband Service offer in BSNL at Rs 275. వినియోగదారులను ఆకట్టుకోవడంలో భాగంగా రూ. 275కే బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించనున్నట్లు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 20, 2022, 11:41 AM IST
  • బీఎస్ఎన్ఎల్ సూపర్ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌
  • 75 రోజులకు రూ. 275 మాత్రమే
  • 60 Mbps స్పీడ్‌తో డేటా
BSNL New Plan: బీఎస్ఎన్ఎల్ సూపర్ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌.. 75 రోజులకు రూ. 275 మాత్రమే!

BSNL Broadband Service gets just Rs 275 for 75 days: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్ఎన్ఎల్) తన వినియోగదారులను ఆకర్షించడానికి ఎప్పటికప్పుడూ కొత్త ప్లాన్లను అందించడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే అతి తక్కువ ధరకే బ్రాడ్‌బ్యాండ్‌ సేవలకు సంబంధించి కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కొత్త వినియోగదారులను ఆకట్టుకోవడంలో భాగంగా రూ. 275కే బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ బీఎస్ఎన్ఎల్ అందించే ప్రతి ప్లాన్‌కు వర్తించదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. 

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఆఫర్‌ను (రూ. 275కే బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు) బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. అయితే తొలి 75 రోజుల వరకే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఆపై ప్లాన్‌ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే.. కొత్తగా బ్రాడ్‌బ్యాండ్‌ తీసుకునే వినియోగదారులకు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. బీఎస్ఎన్ఎల్ ఎంట్రీ లెవల్‌ ప్లాన్లు రూ.449, రూ.599కు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. తొలి 75 రోజుల పాటు ఈ ప్లాన్లు రూ. 275కే అందిస్తారు. 

వినియోగదారులు రూ. 449 ప్లాన్‌పై 30 ఎంబీపీఎస్‌ వేగంతో.. 3.3 టీబీ నెలవారీ డేటా పొందొచ్చు. ఈ డేటా పరిమితి దాటాక వేగం 2 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. రూ. 599 ప్లాన్‌పై 60 ఎంబీపీఎస్‌ వేగంతో.. 3.3 టీబీ డేటాను పొందొచ్చు. నెలవారీ పరిమితి డేటా దాటాక వేగం 2 ఎంబీపీఎస్‌కు పడిపోతుంది. ఇక రూ. 999 ప్లాన్‌పై తొలి 75 రోజుల పాటు రూ.775 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌లో 150 ఎంబీపీఎస్‌ వేగంను 2 టీబీ వరకు పొందవచ్చు. 

వినియోగదారులు రూ. 999 ప్లాన్‌లో ఓటీటీ ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ ప్లాన్‌లో డిస్నీ+ హాట్‌స్టార్‌, హంగామా, సోనీలివ్‌, జీ5, వూట్‌, యుప్‌టీవీ, లయన్స్‌గేట్‌ ఓటీటీలు ఫ్రీగా లభిస్తాయి. ఈ ప్లాన్‌లు అన్ని సెప్టెంబర్‌ 13 వరకు మాత్రమే వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. బ్రాడ్‌బ్యాండ్‌ విభాగంలో ఇతర టెలికాం సంస్థలకు బీఎస్ఎన్ఎల్ గట్టి పోటీ ఇస్తోంది. డేటా ఉపయోగించుకునే వారికి ఈ ఆఫర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 

Also Read: నైట్ వేర్‌లో క్లివేజ్ అందాలు.. సెగలు పెట్టిస్తున్న డింపుల్ హయాతి!

Also Read: భారత్‌ vs జింబాబ్వే డ్రీమ్ 11 టీమ్.. మ్యాచ్ టైమింగ్స్, స్ట్రీమింగ్ డీటెయిల్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News