Business Idea : కేవలం బ్రాయులర్ కోళ్ల బిజినెస్ తో ఎన్ని లక్షల ఆదాయం వస్తుందో తెలుసా?

Broiler Chicken : ఈ మధ్యకాలంలో ఎంత గొప్ప చదువులు చదువుకున్నప్పటికీ ఉద్యోగాల కోసం ఎండల్లో చెప్పులు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే చాలామంది యువకులు ఉద్యోగం మీద కాకుండా బిజినెస్ మీద ఆసక్తి చూపిస్తున్నారు. వైజాగ్ కి చెందిన ఒక యువకుడు కూడా ఈ విధంగానే ఒక బ్రాయిలర్ కోళ్ల బిజినెస్ ప్రారంభించి ఇప్పుడు లక్షలలో ఆదాయం సంపాదిస్తున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 27, 2023, 07:19 PM IST
Business Idea : కేవలం బ్రాయులర్ కోళ్ల బిజినెస్ తో ఎన్ని లక్షల ఆదాయం వస్తుందో తెలుసా?

Broiler Chicken Business : ఈమధ్య కాలంలో చదువు పూర్తి చేసిన యువత ఉద్యోగాల కంటే వ్యాపారం మీదే ఎక్కువగా ముగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం కష్టపడే రోజులు పోయాయి. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలన్న ఆసక్తి కూడా ఇప్పుడు యువతకి తగ్గిపోయింది. ఇక ప్రైవేట్ కంపెనీలలో జాబ్స్ లో ఉండే ఒత్తిడి తట్టుకోలేక కూడా చాలామంది సొంత వ్యాపారం చేస్తూ బతకడం బెటర్ అని నిర్ణయించుకుంటున్నారు.

ఒకరి కింద ఉద్యోగం చేస్తూ కష్టపడే కంటే సొంతంగా బిజినెస్ మొదలు పెట్టుకొని కెరియర్ లో సెటిల్ అవడం మంచిది అని చాలామంది యువకులు బిజినెస్ మీదనే దృష్టి సారిస్తున్నారు. ఈ విధం గానే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా, రావికమతం మండలంలోని, దొండపూడి గ్రామానికి చెందిన గట్రెడ్డి నాని అనే వ్యక్తి కూడా సొంతంగా బ్రాయిలర్ కోళ్ల ఫారం బిజినెస్ ను మొదలుపెట్టాడు. ప్రైవేట్ ఉద్యోగాలపై విసుగు చెందిన నాని తన వద్ద ఉన్న రెండు లక్షల రూపాయలు తో పాటు బ్యాంక్ నుంచి ఆరు లక్షల లోన్ కూడా తీసుకొని మొత్తం ఎనిమిది లక్షల ఇన్వెస్ట్మెంట్ తో ఒక బ్రాయిలర్ కోళ్ల బిజినెస్ ను మొదలుపెట్టాడు.

తాజాగా ఈ బిజినెస్ గురించి చెబుతూ ఇందులో లాభాలు తప్ప నష్టాలు ఉండవని అన్నారు. దీనికోసం రోజుకు కేవలం నాలుగు గంటలు మాత్రం కేటాయిస్తే చాలు అని అంటున్నారు నాని. ఇక ఈ బిజినెస్ గురించి చెబుతూ, 5 వేల కోళ్ల కెపాసిటీ ఉన్న షెడ్డు నిర్మాణానికి దాదాపు 8 లక్షల వరకు ఖర్చు అవుతుందని అన్నారు. రెండు షెడ్డుల కోసం ఐరన్, ఇతర సామాగ్రి అన్ని ఇందులోనే వస్తాయట.

షెడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత పౌల్ట్రీ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవాలి. ఉదాహరణకు సుగుణ, స్నేహ వంటి పౌల్ట్రీ కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకోవచ్చు. ఒప్పందం చేసుకున్న తర్వాత ఆ కంపెనీ వారే బ్రాయిలర్ కోడి పిల్లలను అందజేస్తారట. మనం నిర్మించుకున్న షెడ్ల వద్దకు తీసుకువచ్చి వాటికి అవసరమైన దాణా, రోగాల బారిన పడకుండా ఇంజక్షన్లు కూడా వారే సప్లై చేస్తారట.

"ఆ కంపెనీలు చెప్పిన విధంగా వాటిని పెంచి వారికి ఇవ్వడం మన పని. అలా పెంచినందుకు కంపెనీ వారు మనకి కమిషన్ ఇస్తారు. 45 రోజులపాటు పెంచిన కోళ్లు ఒక సైజుకు వచ్చిన తర్వాత కంపెనీ వారే వాహనాన్ని షెడ్డు కు పంపించి కోళ్లను తీసుకెళ్తారు" అని చెప్పారు నాని.

5000 సామర్థ్యంతో మొదలుపెట్టిన పౌల్ట్రీ ఫార్మ్ లో 45 రోజుల కు ఒక్కో కోడి 2 కేజీల దాకా బరువు పెరుగుతుంది. అన్ని కోళ్లు ఒక్కోటి రెండు కేజీలు చొప్పున చూసుకుంటే షెడ్ లో ఉన్న మొత్తం కోళ్ల బరువు 10,000 కేజీలు ఉంటుంది. కంపెనీ వారు ఒక్కొక్క కేజీకి ఆరు రూపాయల చొప్పున కమిషన్ ఇస్తే దాదాపు 60 వేల దాకా వస్తాయట. 10,000 ఖర్చులకి పోయినా 50,000 మిగులుతాయి. ఇలా సంవత్సరానికి 12 బ్యాచ్ ల చొప్పున వేసుకుంటే 6 లక్షల ఆదాయం వస్తుంది.

తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కోడి పిల్లల పెంపకంపై దృష్టి పెడితే ఈ బిజినెస్ లో ఊహించినటువంటి విధంగా లాభాలు వస్తాయని నాని అంటున్నారు.

Also Read: Fixed Deposit Rates 2023: గుడ్‌న్యూస్ చెప్పిన బ్యాంక్.. ఎఫ్‌డీలపై వడ్డీరేట్లు పెంపు   

Also Read: Tirumala Temple: తిరుమల భక్తులకు అలర్ట్.. ఆ రోజు ఆలయం మూసివేత  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News