China Richest Country: డ్రాగన్ దేశం చైనా దూసుకుపోతోంది. అగ్రరాజ్యాన్ని వెనక్కి నెట్టి మరీ ముందుకు పోతోంది. ఇప్పుడు అగ్రరాజ్యమంటే అమెరికా కాదంటోంది. సంపదలో చైనా వృద్ధి గురించి ఇప్పుడు పరిశీలిద్దాం.
నిన్నటి వరకూ అమెరికా అగ్రదేశం. అత్యంత ధనిక దేశంగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడా పరిస్థితి మారినట్టు కన్పిస్తోంది. అగ్రరాజ్యాన్ని కాదని చైనా ముందుకెళ్లినట్టుగా నివేదికలు అందుతున్నాయి. సంపద సృష్టిలో అగ్రరాజ్యం అమెరికాను దాటి చైనా అగ్రస్థానాన్ని ఆక్రమించేసింది. బ్లూమ్‌బర్గ్ నివేదిక ( Bloomberg Report) అదే చెబుతోంది. సంపద సృష్టించడంలో నెంబర్ వన్ దేశంగా.. చైనా అవతరించింది. గత రెండు దశాబ్దాల్లో ప్రపంచ సంపదలో చైనా సంపద మూడు రెట్లు పెరిగినట్టుగా బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది. మెకిన్సే అండ్ కో పరిశోధన విభాగం పది దేశాల బ్యాలెన్స్ షీట్లను విశ్లేషించిన అనంతరం ఈ నివేదిక రూపొందించినట్టు తెలిపింది. ప్రపంచం మొత్తం ఆదాయంలో 60 శాతం పదిదేశాల వద్దే ఉందని నివేదిక పేర్కొంది.
బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించిన ఆ పది దేశాల్లో అమెరికా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్, మెక్సికో, స్వీడన్‌లు ఉన్నాయి. మెకిన్సే ఏజెన్సీ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా సంపద 2000లో 156 ట్రిలియన్ డాలర్లు ఉంటే..ఇప్పుడది అనూహ్యంగా పెరిగి 514 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఈ సంపదలో చైనాకు అత్యధిక వాటా లభించిందని..అంటే మూడవ వంతు చైనాకు(China)లభించిందని నివేదిక వెల్లడించింది. 2000 సంవత్సరంలో 7 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న చైనా సంపద ఇప్పుడు 120 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రపంచ వాణిజ్య సంస్థలో(WTO) చైనా చేరిన తరువాత ఆ దేశ సంపద దూసుకెళ్తున్నట్టుగా మెకన్సీ నివేదిక తెలిపింది. అమెరికా సంపద రెండింతలు పెరిగి 90 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇప్పుడు అమెరికా ప్రపంచంలోనే అత్యంత ఆర్ధిక వ్యవస్థలు (China as Richest Country)కలిగిన దేశాలుగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 68 శాతం నికర సంపద మొత్తం రియల్ ఎస్టేట్ రంగంలో ఉందనేది నివేదిక సారాంశం.
Also read: OPPO foldable smartphones: ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్స్ వచ్చేస్తున్నాయ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook