Bisleri Water: అమ్మకానికి బిస్లెరీ వాటర్, టాటా గ్రూప్‌తో 7 వేల కోట్లకు డీల్ కుదిరిందా

Bisleri Water: మేడ్ ఇన్ ఇండియా, ప్రస్టైజ్ ఆఫ్ ఇండియాగా ఉన్న బిస్లరీ వాటర్ అమ్మకానికి సిద్ధమైంది. దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం పరిచయమైన బిస్లెరీ బ్రాండ్‌ను కొంటున్నదెవరో తెలుసా..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 24, 2022, 08:13 PM IST
Bisleri Water: అమ్మకానికి బిస్లెరీ వాటర్, టాటా గ్రూప్‌తో 7 వేల కోట్లకు డీల్ కుదిరిందా

ఇండియాలో ప్యాకేజ్డ్ వాటర్ కంపెనీలు లెక్కకు మించి ఉన్నాయి. వీటన్నిటికీ మార్గదర్శకుడు మాత్రం మేడ్ ఇన్ ఇండియా బిస్లెరీ మాత్రమే. అంతర్జాతీయ బ్రాండ్లు కిన్లీ, ఆక్వాఫినాలను సైతం తట్టుకోగలుగుతున్న బిస్లెరీ ఇప్పుడు అమ్మకానికి సిద్ధమైందనేది చర్చనీయాంశమైంది.

ఇండియాలో తొలి ప్యాకేజ్డ్ వాటర్ కంపెనీ బిస్లెరీ. 1969లో రమేష్ చౌహాన్ ప్రారంభించారు. వ్యాపారంలో నిలదొక్కుకోవడమే కాకుండా బిస్లెరీ బ్రాండ్‌ను దేశవ్యాప్తం చేశారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం బిస్లెరీ చేరింది. కాలక్రమంలో పెప్సీ గ్రూపుకు చెందిన ఆక్వాఫినా, కోకాకోలాకు చెందిన కిన్లీలు భారతదేశ మార్కెట్‌లో ప్రవేశించినా..తట్టుకుని నడుపుతున్నారు. 82 ఏళ్ల వయస్సు కలిగిన రమేష్ చౌహాన్ వ్యాపారంలో చాలా సంచలనాలు నమోదు చేశారు. 

ప్రస్తుతం కోకాకోలా కంపెనీలో ప్రముఖ బ్రాండ్స్‌గా ఉన్న థమ్స్‌అప్, మాజా, లిమ్కాలతో పాటు గోల్డ్‌స్పాట్, సిట్రా వంటి బ్రాండ్లకు ప్రజాదరణ తీసుకురాగలిగారు. ఈ బ్రాండ్లను 1993లో కోకాకోలాకు అమ్మేశాడు. థమ్స్‌అప్ ఇప్పటికే బిలియన్ డాలర్ బ్రాండ్‌గా మారగా..ఫ్రూట్ డ్రింక్ విభాగంలో ఉన్న మాజా 2024 నాటికి బిలియన్ డాలర్ బ్రాండ్ కాగలదని అంచనా.  2016లో రమేష్ చౌహాన్..బిస్లరీ పాప్ పేరుతో కూల్‌డ్రింక్స్ విభాగంలో మరోసారి ఎంట్రీ ఇచ్చినా..విఫలమయ్యారు. 

ఇప్పుడు బిస్లెరీ బ్రాండ్‌ను అమ్మకానికి పెట్టారు. తన కుమార్తె జయంతికి వ్యాపారాన్ని నిర్వహించేందుకు ఆసక్తి లేకపోవడంతో..సమర్ధులైన వ్యాపారులకు విక్రయించేందుకు చూస్తున్నానన్నారు. వ్యాపారాన్ని నిర్వహించగలిగిన సత్తా ఉన్న వారసుడు లేకపోవడమే కంపెనీ విక్రయించాలనే ఆలోచనకు కారణమన్నారు. 

బిస్లెరీ అమ్మకం ధర ఎంత

బిస్లెరీ ప్యాకేజ్డ్ వాటర్ బ్రాండ్‌ను టాటా గ్రూప్‌కు విక్రయించేందుకు చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. కానీ బిస్లెరీ కంపెనీ ఛైర్‌పర్సన్ రమేష్ చౌహన్, టాటా కంపెనీలు ఈ వార్తల్ని ఖండించాయి. 7 వేల కోట్లకు బిస్లెరీ బ్రాండ్ అమ్మకానికి సిద్ధంగా  ఉన్నట్టు తెలుస్తోంది. రమేష్ చౌహాన్‌కు చెందిన కూల్‌డ్రింక్స్ బ్రాండ్లను నాడు కోకోకోలా కొనుగోలు చేయగా..ఇప్పుడీ ప్యాకేజ్డ్ వాటర్ బ్రాండ్ బిస్లెరీని ఎవరు కొనుగోలు చేస్తారో చూడాలి.

Also read: Croma Black Friday Sales: యాపిల్ ఉత్పత్తులపై భారీగా డిస్కౌంట్ ఆఫర్లు, ఎప్పటివరకంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News